గూగుల్ మీట్ అత్యంత వేగంగా పాపులర్ అయిన యాప్. మే 18 నాటికే 50 మిలియన్ (5 కోట్లు) డౌన్‌లోడ్స్ పూర్తిచేసుకుంది. సులువుగా వాడుకునేందుకు వీలుగా టెక్నాలజీని అందించడం గూగుల్ ప్రత్యేకత. నాణ్యతలో దీనికి సాటి వచ్చేదేముంది? ఈ గూగుల్ మీట్ కూడా చాలా సులువైన వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్‌ఫామ్.
లాక్‌డౌన్ నేపథ్యంలో జూమ్ వంటి వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లకు గిరాకీ పెరిగింది. డిమాండ్ ఎక్కడుంటే గూగుల్ అక్కడ ఉంటుంది. అందుకే గూగుల్ మీట్‌ను డెవలప్ చేసింది. ఇతర యాప్‌లతో పోలిస్తే దీనిని వాడడం చాలా సులువు. జీమెయిల్‌తో అనుసంధానమై ఉంటుంది. దీంతో రోజూ దాదాపు 30 లక్షల మంది కొత్తగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
ఫస్ట్‌లో గూగుల్ మీట్‌ను బిజినెస్ మీటింగ్స్ కోసం తెచ్చారు. కానీ తరువాత అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా చేశారు.
గూగుల్ మీట్ వాడడం ఎలా?
మీకు జీమెయిల్ ఖాతా ఉంటే చాలు. జీమెయిల్ ద్వారానైనా గూగుల్ మీట్ ఓపెన్ చేయొచ్చు. లేదంటే గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యేకంగా గూగుల్ మీట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడొచ్చు.
జీమెయిల్‌లో ఇన్‌బాక్స్, స్టార్డ్, స్నూజ్డ్, సెంట్, డ్రాఫ్ట్స్ తదితర బటన్ల కింద ఈ మీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని కింద స్టాట్ ఏ మీటింగ్, జాయిన్ ఎ మీటింగ్ సెక్షన్లు ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీటింగ్‌లో జాయిన్ అవ్వొచ్చు.
లేదంటే గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న గూగుల్ మీట్ యాప్ ద్వారా కూడా నేరుగా మీటింగ్‌లో జాయిన్ అవ్వొచ్చు. న్యూ మీటింగ్, మీటింగ్ కోడ్ బటన్స్ కనిపిస్తాయి.
పైన కుడివైపు కార్నర్‌లో స్పీకర్, ఫోన్, ఆడియో ఆఫ్, తదితర ఆప్షన్లు ఉన్నాయి.
గూగుల్ క్యాలెండర్‌ను ఉపయోగించడం ద్వారా మీటింగ్ షెడ్యూల్ కూడా చేయొచ్చు.
జూమ్ యాప్ కంటే సులువుగా వాడుకోగలిగిన ఈ యాప్ ద్వారా మీటింగ్‌లో ఇప్పటివరకు 50 మంది వరకు పార్టిసిపేట్ చేసేలా గూగుల్ డెవలప్ చేసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక జీ సూట్ ఖాతా ఉంటే గూగుల్ మీట్ ద్వారా మరిన్ని వెసులుబాట్లు ఉన్నాయి. వీడియో మీటింగ్ రికార్డు చేసుకోవడం వంటి వెసులుబాట్లు ఉన్నాయి. లైవ్ స్ట్రీమ్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.