జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్టు ఇదే

trains
Image Source: ministry of railways

జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ కు రైల్వే శాఖ బుకింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించనుంది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ నుంచి, మొబైల్ యాప్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మొత్తం 100 జతల (రాను పోను కలిపి 200 రైళ్లు) రైళ్లను జూన్ 1 నుంచి అందుబాటులోకి తేనుంది. 

ఇప్పటికే మే 12 నుంచి 15 జతల ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ వాటికి అదనంగా వీటిని జోడించింది. మే 12 నుంచి నడుస్తున్న ప్రత్యేక రైళ్లన్నీ రాజధాని రైళ్ల కావడంతో అందులో డైనమిక్ ఛార్జీలు వసూలు చేశారు. అంటే సీట్లు భర్తీ అవుతున్న కొద్దీ టికెట్ ధర పెరుగుతుంది. విమాన ఛార్జీల తరహాలో అన్నమాట. 

ప్రత్యేక రైళ్లకు వారం రోజుల ముందు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. కానీ జూన్ 1 నుంచి నడిచే రైళ్లకు 30 రోజులు ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చు. కేవలం ఈటికెటింగ్ పద్దతుల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్లు ఉండవు. అలాగే తత్కాల్, ప్రీమియం తత్కాల్ వెసులుబాటు కూడా ఉండదు. 

కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తారు. గంటన్నర ముందే స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. 

రోజూ నడిచే ముఖ్యమైన రైళ్ల వివరాలు

ముంబై – హైదరాబాద్ మధ్య హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్

హౌరా – సికింద్రాబాద్ మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ – న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్ ప్రెస్

విశాఖ పట్నం – విశాఖపట్నం మధ్య ఏపీ ఎక్స్ ప్రెస్

సికింద్రాబాద్ – గుంటూరు మధ్య గోల్కొండ ఎక్స్ ప్రెస్

తిరుపతి – నిజామాబాద్ మధ్య రాయలసీమ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య గోదావరి ఎక్స్ ప్రెస్

దానాపూర్ – సికింద్రాబాద్ మధ్య దానాపూర్ ఎక్స్ ప్రెస్

ముంబై – భువనేశ్వర్ మధ్య కోణార్క్ ఎక్స్ ప్రెస్

వారానికి రెండు సార్లు నడిచే రైళ్లు

సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ)

హౌరా – విజయవాడ – యశ్వంత్ పురా మధ్య దురంతో ఎక్స్ ప్రెస్ వారానికి ఐదు రోజులు

జూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్ట్ కోసం కింది ఫైల్ ను క్లిక్ చేయండి.

Previous article25వ తేదీ నుంచి విమాన సర్వీసులు
Next articleమీ కలల వేటలో ఫెయిల్యూర్ వెంటాడుతోందా?