రాణా మిహీకా లవ్ స్టోరీ ఎలా మొదలైంది?

rana miheeka

రాణా మిహీకా లవ్ స్టోరీ ఎలా మొదలైంది? రాణా మిహీకా మధ్య ప్రేమ ఎప్పుడు ఎలా మొదలైంది.. తల్లిదండ్రులు ఎలా స్పందించారు.. వంటి అనేక అంశాలపై నటి మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా రాణాతో ఇంటర్వ్యూ చేసింది. ప్రేమ, కెరీర్, సినిమా, ఓటీటీ, లాక్‌డౌన్‌.. ఇలా ఎన్నో కబుర్లు రాణా పంచుకున్నారు. అందులో కొన్ని ముచ్చట్లు ఇలా సాగాయి.

మంచు లక్ష్మిః ఎక్కడ కలిశావ్‌ ఆ అమ్మాయిని..
రాణాః ఆశ్రిత క్లాస్‌ మేట్‌(నటుడు, రాణా బాబాయి వెంకటేశ్‌ పెద్ద కూతురు)
మంచు లక్ష్మిః రాణా చూపు ఎప్పుడు పడింది?
రాణాః లాక్‌డౌన్‌కు ముందు.. మిహీకా ఫ్యామిలీ చాలా ముందు నుంచే తెలుసు..
మంచు లక్ష్మిః అమ్మాయిలనే కాకుండా అబ్బాయిల మనసును గాయపరిచావు..
రాణాః ఏం.. వారికేమైంది?
మంచు లక్ష్మిః ఇప్పుడే పెళ్లేంటి.. ఇంకా రాణా కూడా పెళ్లి చేసుకోలేదని పోస్టర్లు వేసుకున్నవారి మనసు గాయపరిచావు కదా..
రాణాః ఒక ఏజ్‌ దాటిన తరువాత ఇక పోస్టర్లు పనిచేయవు. పోస్టర్‌ మారాలి.

మంచు లక్ష్మిః చాలా మంది అమ్మాయిలను చూసి ఉంటావు కదా.. తనే నీ వైఫ్‌ అని ఎందుకు అనిపించింది.
రాణాః మంచి పనులు జరుగుతున్నప్పుడు అలా జరగనివ్వాలి. ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు. ఎక్కువ లెక్కలు వేయకూడదు. అలా ఫ్లోలో వెళ్లిపోవాలి. నేను కూడా అలా ఫ్లోలో వెళ్లిపోయాను.
మంచు లక్ష్మిః మీ పేరెంట్స్‌ రియాక్షన్‌ ఏంటి?
రాణాః అమ్మానాన్న ఇద్దరూ తొలుత షాక్‌తో కూడిన సంతోషానికి లోనయ్యారు. చివరకు చాలా హాపీగా ఫీలయ్యారు.

మంచు లక్ష్మిః తను ఏంచేస్తుంటారు?
రాణాః తనకు ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఉంది.
మంచు లక్ష్మిః ఇండస్ట్రీ నుంచి కాకుండా బయటివారిని చేసుకోవాలనుకున్నారా?
రాణాః అంతగా ఆలోచించలేదు. తను నచ్చింది అంతే..
మంచు లక్ష్మిః ఇలాంటి సందర్భం ఎలా వచ్చింది..
రాణాః తను నచ్చింది. ఇప్పుడు టైమ్‌ వచ్చిందనుకుంటున్నాను. రైట్‌పర్సన్‌. రైట్‌ టైమ్‌. తను కూడా నా ఫ్యామిలీ ఫ్రెండ్‌. అలాగే బాంబేలో మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఒకరకంగా ఒకే ప్రపంచం.

rana roka function

మంచు లక్ష్మిః తన చేయి పట్టుకున్నావా?(నవ్వులు)
రాణాః లేదు పట్టుకోలేదు..
మంచు లక్ష్మిః నమ్మేశా రాణా.. ఇదిగో చెవిలో పువ్వులు..
రాణాః పువ్వులు విసిరాను..
మంచులక్ష్మిః సోషల్‌ డిస్టెన్స్‌.. అంటే కిసెస్‌ కూడా విసిరేశావా..
రాణాః అవును..
మంచు లక్ష్మిః తను కూడానా..
రాణాః తను కూడా అలాగే చేసింది..
మంచు లక్ష్మిః మళ్లీ అడుగుతున్నా.. ఎలా పడేశావ్‌..
రాణాః ఓ రోజంతా ఆలోచించి ఈవ్‌నింగ్‌ ఫోన్‌ చేసి ప్రపోజ్‌చేశాను. చాలా లెక్కలు వేసి అందరూ ఆలోచిస్తారు.. అవన్నీ రాంగ్‌.. అలా జరిగిపోతుందంతే.

రాణా మిహీకా లవ్ స్టోరీ ముచ్చట్లపై మంచు లక్ష్మి చేసిన పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.

 

రాణాతో లక్ష్మి మంచు పూర్తి ఇంటర్వ్యూ
Previous articleఇంటిముంగిటే టెస్ట్ డ్రైవ్, హోమ్ డెలివరీ
Next articleహిట్ ది సెకెండ్ కేస్ రిజిస్టర్డ్