నటి నిహారిక కొణిదెలకు పెళ్లి కుదిరింది. నిన్న మిస్ నిహా.. అన్న ఫ్రేజ్ లో మిస్ కొట్టేసి మిస్సెస్ నిహా? అంటూ ఇన్ స్టాలో అభిమానుల ఊహలకు వదిలేసిన నిహారిక గురువారం సాయంత్రం పీక్ ఏ బో అంటూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. తనను హగ్ చేసుకున్న ఓ అబ్బాయి ముఖం కనిపించని ఫోటో అది.
నిహారిక ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే.. తన బావ సాయి ధరమ్ తేజ్ .. గాడ్ బ్లెస్ యూ తల్లి అంటూ మెసేజ్ చేశారు. అందం అభినయంతో ఆకట్టుకున్న నీహారిక పెళ్లిపై అనేక రూమర్స్ గతంలో వచ్చాయి. అవేవీ నిజం కాలేదు. తాజాగా తనే ఇన్ స్టా లో తన పెళ్లిపై క్లూ ఇవ్వడం, ఫోటో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అబ్బాయి ఎవరా అంటూ అభిమానులు ఆరా తీయడం కనిపిస్తోంది.
అబ్బాయి పేరు చైతన్య జేవీ
అబ్బాయి పేరు చైతన్య జేవీ. ఇతడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు కుమారుడు. భారతీయ విద్యాభవన్, బిట్స్ పిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదివి ప్రస్తుతం టెక్ మహీంద్రా సాఫ్ట్ వేర్ కంపెనీలో గ్రోత్ స్ట్రాటజీ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు.
నిశ్చితార్థం ఆగస్టులో, పెళ్లి ఫిబ్రవరిలో ఉంటుందని సినీ పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిహారికకు ఇన్ స్టాగ్రామ్ లో, ట్విటర్ లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిర్మాత స్వప్నాదత్, హీరోయిన్ లావణ్య, నిధి అగర్వాల్, అల్లు స్నేహారెడ్డి తదితరులు నిహారికకు శుభాకాంక్షలు చెప్పారు.
ఇక చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ అయితే ’మిస్సెస్ సూర్యకాంతం.. ఆసమ్ పిక్‘ అంటూ గ్రీటింగ్స్ పంపారు.
చివరగా రాత్రి పది గంటల సమయంలో చైతన్య, నిహారిక కలిసి దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. సో.. నిహారిక కొణిదెల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆల్ ది బెస్ట్ నిహారిక కొణిదెల.