అభిషేక్ బచ్చన్ తన కెరీర్ పై భావోద్వేగం

abhishek bachchan
image credit: instagram

బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడిగా తెరంగేట్రం చేసిన అభిషేక్ బచ్చన్ నటుడిగా తన సినీ ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకున్నారు. బాలీవుడ్ లో జేపీ దత్తా దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన ‘రెఫ్యూజీ’ అభిషేక్ బచ్చన్ తొలిచిత్రం. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో అభిషేక్ రెండు దశాబ్దాల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిషేక్ గతన్ని స్మరించుకున్నారు.

‘సమయాన్ని సరదాగా గడుపుతుంటే కరిగిపోతుంది. 20 ఏళ్ల క్రితం జేపీ దత్తా దర్శకత్వం వహించిన రెఫ్యూజీ చిత్రం విడులైంది. కరీనా కపూర్ ను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఈ చిత్రంతోనే. మొదటి చిత్రం ఎవరికైనా ప్రత్యేకమే, దానికి రెఫ్యూజీ ఏ మాత్రం తీసిపోదు. ఇదో అత్భుతమైన అనుభవం. కొత్తగా పరిశ్రమకు వచ్చిన వ్యక్తి ఇంతకన్నా ఏమి ఆశించగడు.

జేపీ సాబ్ ఉత్తమ గురువు. ఇప్పుటికి ఆయన నాకు మార్గదర్శనం చేసే వ్యక్తిగా నిలిచారు.  రెఫ్యూజీ చిత్ర బృందం ఎంతో ఓపికగా, సహాయంగా, ప్రోత్సాహకరంగా నిలిచింది. వారందరికీ నేను ఎంతో కృతజ్ఞుడిని. గత 20 ఏళ్ల కాలాన్ని వెనక్కు తిరిగి చూసుకొని అవలోకనం చేసుకోవడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నా. ఈ ప్రయాణం ఊహించలేనిదిగా ఉంది. ఈ అనుభవాల ముందు ఉత్తమమైనదేంటంటే.. ఇంకా ఇప్పుడే నా ప్రయాణాన్ని ప్రారంభించినట్టు అనుభూతి చెందుతుండడం.

abhishek bachchan career
Image Source: Instagram

నేను నిరూపించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది.. దాని కోసం వేచి ఉండలేకపోతున్నా!. ఏది ఏమైనా నా కుటుంబం లేనిదే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.

అదే నా స్ఫూర్తి, నా బలం. నాపై ఎలాంటి అంచనాల భారం, ఒత్తిడి వేయకుండా నాకు ఏం కావాలో నిర్ణయించుకొనే స్వేచ్చను వారిచ్చారు. నా నటన బాగాలేనప్పుడు ఆ విషయాన్ని వారు నాకు తెలియజేశారు, అదే బాగున్నప్పుడు ప్రేమను పంచారు.

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వారే కారణం. నాకు నమ్మకం ఉంది.. ఏదో ఒక రోజు వారు వెనక్కి తిరిగి నన్ను చూసుకొని గర్వంగా భావిస్తారు. ఇంకా ఎన్నో మైళ్లు ప్రయాణించాల్సి ఉంది. ఎంతో చేయాల్సి ఉంది’ అంటూ అభిషేక్ తన ప్రయాణం గురించి చొప్పుకొచ్చారు.

అభిషేక్ బచ్చన్ కు పేరు తెచ్చిన చిత్రాలు

అభిషేక్ నటించిన ధూమ్ సిరీస్, కబీ అల్విదా నా కెహెనా, దోస్తానా, యువ, సర్కార్, హౌస్ ఫుల్ చిత్రాలు అభిషేక్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఇక మణిరత్నం దర్శకత్వంలో ధీరూభాయ్ అంబానీ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కిన ‘గురు’ చిత్రం అభిషేక్ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిందని చెప్పొచ్చు.

ఆయన నటించిన బ్రీత్ ఇన్ టూ ద షాడోస్ వెబ్ సిరీస్ జూలై 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. కాగా రెఫ్యూజీ చిత్రం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే.. నటి కరీనా కపూర్ చిత్ర బృందానికి, కో స్టార్ అభిషేక్ కు కృతజ్ఞతలు చెప్పారు.

kareena kapur

ఈ చిత్రంతో తన మొదటి షాట్ ఉదయం నాలుగు గంటలకు తీశారన్నారు. అందుకే ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి అద్దంలో చూసుకొని జీవితంలో అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకున్నట్టు తన అభిమానులతో పంచుకుంది కరీనా కపూర్.

Previous articleనేను విన్నాను.. నేనున్నాను..
Next articleమూవీ రివ్యూ: సూఫియుం సుజాతయుం ఎటర్నల్‌ లవ్‌ స్టోరీ