ప్రశాంతంగా ఉండు సుశీ.. నిన్ను జీవితకాలం ప్రేమిస్తూనే ఉంటా

rhea chakraborthy with sushant singh

సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి సుశాంత్‌ పై ఉన్న తన ప్రేమను వ్యక్తపరిచారు. భావోద్వేగంగా, కవితాత్మకంగా వారి మధ్య ప్రేమను, సుశాంత్‌ వ్యక్తిత్వాన్ని సంక్షిప్తంగా వివరించారు.

‘నా భావోద్వేగాలను ఎదుర్కోవడానికి ఇప్పటికీ సతమతమవుతున్నా. కోలుకోలేని రీతిలో నా గుండె గాయపడింది. న్రేను పేమను విశ్వసించేలా చేశావు. దాని శక్తిని తెలియచెప్పావ్‌. ఓ చిన్న గణిత సూత్రం జీవిత పరమార్థాన్ని విశ్లేషిస్తుందని తెలియజెప్పావ్‌. నిజంగా నేను ప్రతి రోజూ నీ నుంచి నేర్చుకున్నా.

నువ్విప్పుడు చాలా ప్రశాంతమైన ప్లేస్‌లో ఉన్నావని నాకు తెలుసు. చంద్రుడు, చుక్కలు, నక్షత్ర మండలం చేతులు చాచి గొప్ప భౌతిక శాస్త్రవేతకు స్వాగతం చెప్పి ఉంటాయి.

చాలా ఆనందంగా నువ్వే ఒక నక్షత్రానివయ్యావు.. నా నక్షత్రం కోసం నేను వేచి ఉంటా.. నిన్ను నాకు తిరిగి ఇవ్వమని వేడుకుంటా..

నువ్వొక మంచి మనసున్న మనిషివి. ఈ ప్రపంచం చూసిన అద్భుతానివి నువ్వు. మనం పంచుకున్న ప్రేమను వ్యక్తీకరించడంలో నా పదాలకు శక్తిలేకుండా పోయింది.
అది మనిద్దరికి మించినదని నువ్వు చెప్పావ్‌ చూడు.. అది నిజంగా నిజం.

తెరిచిన హృదయంతో ప్రతి విషయాన్ని ప్రేమించావ్‌. మన ప్రేమ మరింత గాఢంగా పెరగుతోందని నువ్వు ఇప్పడు చూపావు..

ప్రశాంతంగా ఉండు సుశీ..

నిన్ను కోల్పోయి 30 రోజులైంది.. కానీ నిన్ను జీవితకాలం ప్రేమిస్తూనే ఉంటా..

శాశ్వతంగా కనెక్ట్‌ అయ్యా.. అనంతంగా.. అంతకుమించి…’’ అని సందేశం పోస్ట్ చేసింది.

దేవుడి బిడ్డ : మాజీ లవర్ అంకిత లోఖాండే

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ లవర్ అంకిత లోఖాండే దేవుడి పటం ముందు దీపం వెలిగించిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి ’చైల్డ్ ఆఫ్ గాడ్‘ అని క్యాప్షన్ ఇచ్చింది. సుశాంత్ సింగ్ చనిపోయాక తన గురించి చేసిన పోస్ట్ ఇదే.

సుశాంత్ చనిపోయి నెల రోజులైన సందర్భంలో ఆమె దియా వెలిగించి తన ప్రేమను చాటుకుంది. దేవుడి బిడ్డగా అభివర్ణించింది. నిజంగా సుశాంత్ ఈ ప్రపంచాన్ని ఎంతగా ప్రేమించాడో.. ఆ ప్రేమ తను బతికుండగానే వెనక్కి వస్తే బాగుండు కదా..

Previous articleసచిన్‌ పైలట్ ‌పై వేటు.. ఇక సపరేటు రూటు..!
Next articleనెట్‌ఫ్లిక్స్‌ న్యూ రిలీజెస్ సూన్: 12 న్యూ మూవీస్, 5 వెబ్‌ సిరీస్‌