హైదరాబాద్ బెస్ట్ రిసార్ట్స్ .. రీఫ్రెష్ అవ్వండిలా

hyderabad resorts
Image by Free-Photos from Pixabay

హైదరాబాద్ చుట్టూ ఉన్న బెస్ట్ రిస్టార్ట్స్ తెలుసుకుంటే మీరు మీ స్ట్రెస్ లైఫ్ నుంచి కొంత రిలీఫ్ పొందేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. రణగొణధ్వనులతో, కాలుష్యంతో నిండిన నగరాన్ని వదిలి పచ్చని పరిసరాల మధ్య కొన్ని రోజులైనా సేదతీరితే మీరు రీఫ్రెష్ బటన్ నొక్కినట్టే. 

కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమికులు సంతోషంగా గడిపేందుకు రిసార్టులు అందుబాటులోనే ఉన్నాయి. పెళ్లి వేడుకలు, బర్త్ డే తదితర ఫంక్షన్లు జరుపుకొనే వీలున్న రీసార్ట్స్ కూడా ఉన్నాయి. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, బార్బీ క్యూ గ్రిల్, స్పా, స్విమ్మింగ్ పూల్, ప్రయివేట్ పూల్, కిడ్స్ పూల్.. ఇలా వసతులకు కొదవే లేదు. వసతులను బట్టి ఛార్జీలు ఉంటాయి. ఈ స్టోరీలో ప్రస్తావించిన ఛార్జీలు సీజన్ బట్టి మారుతుంటాయని గమనించాలి. 

ఇలా హైదరాబాద్ చుట్టూ అనేక రిసార్టులు ఉన్నాయి. దాదాపు అన్ని రిసార్టులకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులో ఉంది. క్యాబ్‌లో కూడా వెళ్లొచ్చు. హైదరాబాద్ రిసార్ట్స్‌లలో కొన్నింటి వివరాలు ఇదిగో…

1. లియోనియో హోలిస్టిక్ డెస్టినేషన్

క్లాస్ – 5 స్టార్
ఎక్కడ- శామీర్ పేట, హైదరాబాద్
దూరం – హైటెక్ సిటీ నుంచి 43 కి.మీ, ఎయిర్ పోర్టు నుంచి 74 కి.మీ
ఛార్జీలు – ఒక్క రాత్రికి రూ. 3,100

రాత్రయితే కళ్లు చెదిరే విద్యుద్ధీపాల వెలుగుతో అదిరిపోతుంది ఈ లియోనియో రిసార్ట్. విదేశంలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ రిసార్టులో నిండైన పచ్చదనం, సహజంగా ఏర్పడిన పెద్ద పెద్ద రాళ్ల నిర్మాణాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ రిసార్టులో నాలుగు హోటళ్లతో పాటూ, విల్లాలు కూడా ఉన్నాయి.

నచ్చిన చోట గదులు అద్దెకు తీసుకోవచ్చు. పెద్ద కుటుంబంతో వస్తే విల్లాలో ఉండొచ్చు. భారత వంటకాలతో పాటూ ఇటాలియన్ వంటి పాశ్చాత్య వంటలు లభించే పది రెస్టారెంట్ లు కూడా ఉన్నాయి. ఇక స్పా, మసాజ్ సెంటర్లు, ఆయుర్వేద థెరపీ సెంటర్లు, అడ్వెంచర్ పార్క్, యాభైకి పైగా ఆటలు, పార్టీలు ఇలా చాలా రకాల సేవలు ఇక్కడ లభిస్తాయి.

2. అలంక్రిత రిసార్ట్

క్లాస్ – 4 స్టార్
ఎక్కడ – తూంకుంట గ్రామం, శామీర్ పేట, సికింద్రాబాద్
ఛార్జీలు – రోజుకి 3,600
దూరం – ఎయిర్ పోర్టు నుంచి 74 కి.మీ, హైటెక్ సిటీ నుంచి 43 కి.మీ

అలంక్రిత రిసార్ట్ లోని గార్డెన్లు, గడ్డి లాన్లు చూస్తే మనసుకు సాంత్వనగా అనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయివి. స్టాండర్డ్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, పెంట్ హౌస్, ఎలైట్ సూట్స్, క్రిస్టల్ సూట్స్, డీలక్స్ విల్లాలు, సిగ్నేచర్ సూట్స్ ఇలా రకరకాల గదులు అందుబాటులో ఉంటాయి.

అందులో ఉండే సదుపాయాలను బట్టి ధర ఉంటుంది. అతి తక్కువ ధర గల సూట్ కోసం రోజుకు రూ. 3,600 చెల్లించాలి. బ్యూటీ సెలూన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బీచ్ వాలీబాల్ కోర్టు, వాటర్ పార్క్, క్రికెట్ గ్రౌండ్, టెన్నిస్ కోర్టు, ఇండోర్ గేమ్స్… ఇలా ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

3. గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా

క్లాస్ – 4 స్టార్
ఎక్కడ – సాగర్ మహల్ కాంప్లెక్స్, ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర, గండిపేట, హైదరాబాద్
ఛార్జీలు – రోజుకి రూ. 10,300
దూరం – ఎయిర్ పోర్టు నుంచి 28 కి.మీ, హైటెక్ సిటీ నుంచి 15 కి.మీ

గోల్కొండ రిస్టార్ట్ ఒక లగ్జరీ రిసార్టు. కార్పొరేట్ మీటింగులకు, కంపెనీల అవుటింగులకు ఇది సరైన ఎంపిక. దాదాపు 13 ఎకరాల్లో ఈ రిసార్టు పరుచుకుని ఉంది. ఉస్మాన్ సాగర్ సరస్సు కనిపించేలా రిసార్టులోని కొన్ని గదులు నిర్మించారు. కావాలనుకుంటే ఆ గదులను ఏరికోరి అద్దెకు తీసుకోవచ్చు.

ఈ రిసార్టులో 40 విల్లాలు, నాలుగు సూట్స్ అద్దెకు అందబాటులో ఉంటాయి. ఇక్కడున్న రెస్టారెంట్లలో హైదరాబాదీ వంటలతో పాటూ మెడిటేరియన్, ఓరియంటల్ వంటకాలు వండి వడ్డిస్తారు.

4. ప్రగతి రిసార్ట్స్

క్లాస్ – 3 స్టార్
ఎక్కడ – ప్రొద్దుటూరు విలేజ్, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, శంకరపల్లి మండల్, హైదరాబాద్
ఛార్జీలు – రోజుకి రూ. 3,700
దూరం – హైటెక్ సిటీ నుంచి 34 కిమి, ఎయిర్ పోర్టు నుంచి 40 కి.మీ

బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్టులలో ప్రగతి రిసార్ట్స్ ఒకటి. ఈ రిసార్టుకు వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ సూట్స్, సిగ్నేచర్ సూట్స్, లగూన్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. కుటుంబంతో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ప్రగతి రిసార్ట్ మంచి డెస్టినేషన్.

ఉచిత వైఫై నుంచి సేఫ్టీ డిపాజిట్స్ వరకు చాలా సౌకర్యాలు ఈ రిసార్టులో ఉన్నాయి. యోగా, మెడిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయుర్వేదిక్ థెరపీ కూడా అందుబాటులో ఉంది.

5. బ్రౌన్ టౌన్ రిసార్టు, స్పా, కన్వెన్షన్

క్లాస్ – 4 స్టార్
ఎక్కడ – సర్వే నెం 224/u, మొయినాబాద్, కనకమామిడి, ఫోన్ నెంబర్ 91547 93006
ఛార్జీలు – రోజుకు సుమారు రూ. 3,700
దూరం – హైటెక్ సిటీ నుంచి 31 కి.మీ, ఎయిర్ పోర్టు నుంచి 27 కి.మీ

పచ్చని అందాలతో ఎటు చూసినా ఆహ్లాదంగా ఉంటుంది బ్రౌన్ టౌన్ రిసార్టు. ఇందులో ప్రతి విల్లా బాల్కనీ, విండోలోంచి చూసినా పచ్చని గార్డెన్, చెట్లు పలకరిస్తాయి. అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తాయి ఈ రిసార్టు పరిసరాలు. పిల్లల కోసం అవుడ్ డోర్ గేమ్స్, బోర్డు గేమ్స్ అనేకం ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ఇక ఫుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వెజ్, నాన్ వెజ్ లలో అనేక రకాలు వేడివేడిగా సర్వ్ చేస్తారు. నగర జీవితంతో విసిగిపోయినవారంతా వారాంతంలో ఈ రిసార్టులో సేదతీరేందుకు ఇష్టపడతారు. స్పా, థాయ్ థెరపీలు ఇక్కడ ప్రత్యేకం.

హైదరాబాద్ చుట్టూ ఉన్న రిసార్ట్స్ లలో మరికొన్ని..

1. సమ్మర్ గ్రీన్ రిసార్టు
క్లాస్ – 3స్టార్
ఎక్కడ – సర్వే నెం 90, A, 111, 112/A, 112/B తూముకుంట గ్రామం, శామీర్ పేట, సికింద్రాబాద్
ఛార్జీలు – రోజుకి రూ. 2600

2. బటన్ ఐస్ రిసార్టు
క్లాస్ – 3 స్టార్
ఎక్కడ – మొయినాబాద్, రంగారెడ్డి
ఛార్జీలు – రోజుకి రూ. 3,500

3. సెలెబ్రిటీ రిసార్టు
క్లాస్ – 3 స్టార్
ఎక్కడ – సర్వే నెం . 1222, ఓఆర్ఆర్ సర్కిల్, కరీంనగర్ హైవే, శామీర్ పేట, మేడ్చల్
ఛార్జీలు – రోజుకి రూ.2,800

4. లహరి రిసార్టు
క్లాస్ – 3 స్టార్
ఎక్కడ – భానూర్, పటాన్ చెరు దగ్గర, హైదరాబాద్
ఛార్జీలు – రోజుకి రూ. 6,700

5. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్
క్లాస్ – 2 స్టార్
ఎక్కడ – వికారాబాద్ రోడ్, బకారం జాగీర్, చిలుకూర క్రాస్ రోడ్స్ కు వెళ్లేదారిలో, హైదరాబాద్
ఛార్జీలు – రోజుకు రూ.2,897

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleనాసాలో మన స్వాతి మోహన్
Next articleసామ్‌సంగ్‌ గెలాక్సీ టాబ్‌ ఎస్‌ 7 ఎఫ్‌ఈ, గెలాక్సీ టాబ్‌ ఎ 7 విడుదల