ఆరోగ్యానికి కొరియన్ ఫార్ములా ఇలా..

korean diet
Photo by Ella Olsson from Pexels

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో కొరియన్ లైఫ్ స్టైల్ చూసే ఉంటారు. అందానికి, ఆరోగ్యానికి కొరియన్లు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మీకు అర్థమైందా? హెల్దీ లైఫ్ స్టైల్ అనుసరించడంలో కొరియన్లు ప్రపంచ ప్రసిద్ధి చెందారు. అందానికి, ఫిట్‌నెస్‌కు కొరియన్లు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. వరల్డ్ ఫేమస్ మేకప్ ప్రొడక్ట్స్ కూడా కొరియాలోనే తయారవుతాయి. కొరియన్ల ఫుడ్ కూడా ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది.

ఆహారమే ఔషధం

కొరియన్లు ఆహారాన్ని ఔషధంగా చూస్తారు. సాంప్రదాయ ఆహారానికే వాళ్లు ఓటు వేస్తారు. కొరియన్లు కూరగాయలు, సూప్స్, రైస్, సీ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. కొరియన్ల వంటకాలన్నీ ఫెర్మెంటేషన్, గ్రిల్లింగ్, బాయిలింగ్ వంటి ప్రక్రియలతో కూడినవై ఉంటాయి. వీళ్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా, ముడి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు.

ఏవి తినొచ్చంటే..

కూరగాయలు: కొరియన్ డైట్లో కూరగాయలు ఏవైనా తినొచ్చు. అయితే అవి పచ్చిగా అయినా ఉండాలి. లేదా  లైట్ గా కుక్ చేసినవై ఉండాలి.

ఫ్రూట్స్: ఫ్రూట్స్‌కు కొరియన్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్ని రకాల ఫ్రూట్స్ తింటారు. తియ్యగా ఏదైనా తినాలనిపిస్తే కొరియన్లు ఫ్రూట్స్ ఎంచుకుంటారు.

ప్రొటీన్స్: ప్రొటీన్స్ కోసం కొరియన్లు గుడ్లు, చేపలు, మాంసాన్ని తీసుకుంటారు. అయితే మాంసాహారం విషయంలో క్వాంటిటీ ముఖ్యం. కొరియన్లు తినే మీట్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్లు మాంసాన్ని ఎంతో మినిమల్ గా తింటారు.

వెజిటేరియన్స్: మాంసం ముట్టని కొరియన్లు మాంసానికి ఆల్టర్నేటివ్‌గా ఆయ్ స్ట‌ర్‌ మష్రూమ్స్, టోఫూ తీసుకుంటారు. 

బియ్యం: కొరియన్ల  ఆహారంలో రైస్ కూడా ఉంటుంది. వైట్ రైస్ నేరుగా తినొచ్చు. రైస్ నూడిల్స్‌, పాన్ కేక్స్ లో కూడా బియ్యాన్ని వాడతారు.

డైట్ నుంచి మిన‌హాయింపు వీటికే..

కొరియన్ల డైట్ లో గోధుమ, మైదా సంబంధిత ఆహారాలైన బ్రెడ్, పాస్తా లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. పాలు, యోగర్ట్, చీజ్, ఐస్ క్రీమ్ వంటి పాల పదార్థాలు కూడా ఎంతో అరుదుగా తీసుకుంటారు. అలాగే క్యాండీస్, బేక్డ్ ఫుడ్, ఎనర్జీ డ్రింక్స్ కూడా కొరియన్లు ఇష్టపడరు.

కొరియన్స్ డైట్ లో  భోజ‌నానికి భోజ‌నానికి మధ్యలో స్నాక్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. స్నాక్స్ తినడాన్ని కొరియన్లు ప్రొత్సహించరు. అలాగే ఎక్కువ ఫ్యాట్ ఉండేవి, హై షుగర్ ఫుడ్స్ వీళ్లు అస్సలు ముట్టరు.

డైట్ ఫార్ములా ఇదీ…

వీలైనంత తక్కువ కేలరీలు తినాలి.
క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి.
వీలైనంత ఎక్కువగా నడుస్తూ ఉండాలి.
ఫ్యాట్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి.
షుగర్స్ ను పూర్తిగా తగ్గించాలి.
స్నాక్స్ అనే కాన్సెప్ట్ ను మర్చిపోవాలి.

ఆరోగ్యానికే ఓటు

కొరియన్లు ఆహారం విషయంలో చాలా పర్ఫెక్ట్ గా టారు. అందుకే మిగతా దేశాల్లో పోలిస్తే ఇక్కడ దీర్ఘకాలిక రోగాలు, ఒబెసిటీ, డయాబెటిస్ వంటివి తక్కువ. పైగా వీళ్లు నడకకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. కొద్దికొద్ది దూరాలకు నడుస్తూనే వెళ్తారు తప్ప వాహ‌నాలు ఎంచుకోరు. రోజూ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.

Previous articlediabetes: డయాబెటిస్‌ను జయించి ఒంట్లో కొవ్వు కరిగించాలంటే .. నా అనుభవం ఇదీ
Next articleSquid Game review: స్క్విడ్ గేమ్ రివ్యూ : అవసరం ఆడించే ఆట