mysore bonda: మైసూర్ బోండా రెసిపీ .. మళ్లీ మళ్లీ తినేలా చేద్దామిలా

mysore bonda

మైసూర్ బోండ

మైసూర్‌ బోండ.. ఏ హోటల్‌లో కనిపించినా ఇట్టే నోరూరిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే మైసూర్‌ బోండ తినేందుకు ఇష్టపడతారు. ఆయిల్‌ ఫుడ్‌ అని, మైదా పిండి అని కొందరు దూరం పెట్టేందుకు ప్రయత్నించినా… దానిని చూడగానే టెంప్ట్‌ అవుతారు. అయితే ఇంట్లో మనం ఫ్రెష్‌ ఆయిల్స్‌ వాడతాం కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పైగా రోజూ తినం కదా.. అప్పుడప్పుడు మైసూర్‌ బోండా తింటే రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది.

  • కడాయి
  • జల్లి గంట
  • సర్వింగ్ బౌల్
  • 2 కప్పులు మైదా పిండి
  • 2 కప్పులు పెరుగు
  • 1/2 టీ స్పూన్ జీలకర్ర
  • 1 1 ఉల్లిపాయ
  • 1/2 టీ స్పూన్ వంట సోడ
  • 250 మి.లీ. నూనె (డీప్ ఫ్రైకి సరిపడా)
  • 1/2 టీ స్పూన్ అల్లం తురుము
  • 1/2 టీ స్పూన్ పచ్చి మిర్చి తురుము
  • 1/2 టీ స్పూన్ ఉప్పు
  1. ముందుగా రెండు కప్పుల పెరుగును ఒక బౌల్‌లో తీసుకుని ఒక నిమిషం పాటు బీట్‌ (పెరుగు గడ్డల్లేకుండా) చేసుకోవాలి.

  2. ఈ పెరుగులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఒక టీస్పూన్‌ నూనె వేసి మైదా పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి. పిండి మరీ వదులుగా కాకుండా చూసుకోవాలి.

  3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అరగంట నుంచి గంట వరకు నానబెట్టాలి.

  4. ఇలా నానిన పిండిలో కాస్త వంట సోడా, అల్లం తురుము ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరోసారి పిండిని బాగా బీట్‌ చేసుకోవాలి.

  5. ఇలా పిండిని బీట్‌ చేసుకోవడం వల్ల పిండి మధ్యలో ఎయిర్‌ బబుల్స్‌ వచ్చి బోండాలు చక్కగా వస్తాయి.

  6. స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని పిండిని చిన్న చిన్న బోండాలుగా వేయాలి.

  7. వేసిన తరువాత మధ్యమధ్యలో జల్లిగంటతో కదిలిస్తూ అవి ఎర్రటి రంగులోకి వచ్చేంతవరకు వేగనివ్వాలి. అంతే ఎంతో రుచికరమైన మైసూర్‌ బోండా రెడీ.

Breakfast, Snack
Indian, South Indian
mysore bonda recipe, మైసూర్ బోండ

Previous articleHarnaaz sandhu: హర్నాజ్‌ కౌర్‌ సంధు .. మిస్‌ యూనివర్స్‌గా మెరిసిన భారతీయ అందం…
Next articlepalak chutney: పాలకూర చట్నీ.. పావుగంటలో రెడీ