summer destinations in northeast: సమ్మర్ వెకేషన్‌ ప్లాన్ చేస్తున్నారా? నార్త్ ఈస్ట్ డెస్టినేషన్స్ ఇవిగో

tawang
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో సుందర దృశ్యం (image: AP tourism)

summer destinations in northeast: సమ్మర్ వెకేషన్‌లో భాగంగా చల్లని వాతావరణంతో కూడిన టూరిస్టు ప్లేసెస్‌కు అలా ఓ వారం రోజులు వెళ్లి వస్తే బాగుంటుందనిపిస్తుంది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఈశాన్య భారతదేశంలో కాస్త చల్లగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైవిధ్యం కూడా ఉంటుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య, పచ్చని అడవుల్లో, గంభీరమైన పర్వతాలలో, నిర్మలమైన సరస్సులతో, అద్భుతమైన జలపాతాలతో ఈశాన్య భారతదేశం వేసవి వేడిని మరిపించేస్తుంది. ఈశాన్య భారతదేశంలో మీరు విహరించడానికి 13 ఉత్తమ ప్రాంతాలు ఇవే. ఇది మీకు శాంతిని, అందమైన అనుభవాలను మిగులుతాయి. ఆ పదమూడు ప్రాంతాల జాబితా ఇదే. ఆ ప్రాంతంలో విహరించేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా ఇక్కడ ఇచ్చాం. ఎక్కడికి వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి.

సమ్మర్ వెకేషన్‌కు నార్త్ ఈస్ట్ ఇండియా (ఈశాన్య రాష్ట్రాలు) టూరిస్ట్ ప్లేసెస్

పెల్లింగ్, సిక్కిం 2-3 రోజులు
మోకోక్‌చుంగ్, నాగాలాండ్ 1-2 రోజులు
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ 3-4 రోజులు
జిరో, అరుణాచల్ ప్రదేశ్ 2-3 రోజులు
Dzukou వ్యాలీ, నాగాలాండ్ 2-4 రోజులు
హఫ్లాంగ్, అస్సాం 3-4 రోజులు
మజులి, అస్సాం 2-3 రోజులు
షిల్లాంగ్, మేఘాలయ 3-4 రోజులు
చిరపుంజి, మేఘాలయ 1-2 రోజులు
త్సోమ్గో సరస్సు, సిక్కిం 1-2 రోజులు
కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం 2-3 రోజులు
కోహిమా, నాగాలాండ్ 2-3 రోజులు
గాంగ్టక్, సిక్కిం 1-2 రోజులు

పెల్లింగ్ (సిక్కిం)

సిక్కింలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ పెల్లింగ్. ఈశాన్య భారత దేశంలో ఉత్తమ సమ్మర్ డెస్టినేషన్స్‌లో ఇది ఒకటి. పెల్లింగ్ కు వెళ్లడానికి లోయ పక్కగా ప్రయాణించాల్సి ఉంటుంది. అప్పుడు కాంచనజంగా జలపాతం చాలా అందంగా కనిపిస్తుంది. ఆ జలపాతం సవ్వడిని కూడా వినవచ్చు. పెల్లింగ్‌కు కేవలం కిలోమీటర్ దూరంలో ప్రసిద్ధ పెమయాంగ్ట్సే మొనాస్టరీ ఉంది. ట్రెక్కింగ్ ద్వారా ఆ ప్రదేశాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి మీలో కొత్త ఉత్సాహం నింపుతుంది.

మోకోక్‌చుంగ్ (నాగాలాండ్)

మోకోక్‌చుంగ్ ఒక జిల్లా. ఆ జిల్లాలో పచ్చని కొండలపై ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అక్కడ అయోనాగా తెగ ప్రజలు జీవిస్తారు. వారు ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటారు. అక్కడున్న గ్రామాల్లో లాంగ్‌ఖుమ్ ఒకటి. చాలా చల్లగా ఉండే గ్రామం ఇది. ఈ గ్రామంలోని రోడ్డుకు రెండు వైపులా రంగురంగుల రోడోడెండ్రాన్‌ పూలతో నిండి ఉంటుంది. ఇక ఉండే ప్రజలు యానిమిస్ట్ మతాన్ని అనుసరిస్తారు. వారు లాంగ్లాన్పా సుంగ్రేమ్ అనే దేవతను ఆరాధిస్తారు. ఇక్కడ మండే సమ్మర్‌లో కూడా ఉష్ణోగ్రత 22 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఈ గ్రామానికి వెళితే గిరిజన వంటకాలు రుచి చూడవచ్చు. ఆదివాసీ తెగల గురించి తెలుసుకోవచ్చు. అక్కడ జరిగే పండుగలను చూడొచ్చు. ట్రెక్కింగ్ చేయచ్చు. వన్యప్రాణులను చూడొచ్చు.

తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్)

తవాంగ్ ఓ అందమైన ప్రాంతం. సుందరమైన బౌద్ధ ఆరామాలు, మెరిసే సరస్సులు, జలపాతాలు ఈ సమ్మర్ వెకేషన్‌లో స్వర్గాన్ని తలపిస్తాయి. అక్కడి భూమి తెలుపు, గోధుమ, ఆకుపచ్చ రంగుల్లో అందమైన కాన్వాసులా ఉంటుంది. ఇక్కడ రెండు బౌద్ధ మఠాలు ఉంటాయి. వాటిని చూసేందుకు జనాలు బారులు తీరి ఉంటారు. ఇక్కడి ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ దాటదు. అక్కడ వార్ మెమోరియల్ కచ్చితంగా చూడాలి. పిక్నిక్ వెళ్లడానికి ఇది అందమైన స్పాట్. ట్రెక్కింగ్‌కు వెళ్లవచ్చు.

జిరో (అరుణాచల్ ప్రదేశ్)

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక లోయ ప్రాంతం జిరో. వరి పొలాలు, వాగులతో నిండి ఉన్న ప్రశాంతమైన ప్రదేశం ఇది. సమ్మర్ వెకేషన్‌లో ప్రకృతితో మమేకమయ్యేందుకు మీరు ఒక చిన్న కొండ అంచున కూర్చుంటే చాలు, ఊరు మొత్తాన్ని చూడవచ్చు. కనుచూపు మేరలో విస్తరించి ఉన్న పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే హాంగ్, దత్తా, బామిన్, హిజా వంటి గ్రామాలకు వెళ్లవచ్చు. ఇక్కడి వాతావరణం గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అక్కడ విపరీతంగా చేపలను పెంచుతారు. చక్కటి దేవాలయాలు ఉన్నాయి.

Dzukou వ్యాలీ (నాగాలాండ్)

మీ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ గడిపేందుకు ఉత్తమ ప్రదేశం Dzukou వ్యాలీ. ఇది నాగాలాండ్‌లోని ఈ సుందరమైన హిల్ స్టేషన్. వేసవిలో అడవి పూలతో తివాచీలు వేసినట్టు భూమి అందంగా ఉంటుంది. అందుకే దీన్ని పుష్పాల లోయ అని కూడా పిలుస్తారు. Dzukou వ్యాలీ… మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. అనేక కొండలు, సహజ గుహలు, శిలలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. 16 సెల్సియస్ నుంచి 31 డిగ్రీల మధ్య వరకు ఉంటుంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్, పక్షులను చూడడం, విలేజ్ టూర్స్ ఇక్కడ చేయవచ్చు.

హఫ్లాంగ్ (అస్సాం)

సమ్మర్ డెస్టినేషన్‌గా అస్సాంలోని హిల్ స్టేషన్ హఫ్లాంగ్‌ ఆకట్టుకుంటుంది. దీన్నే “తెల్ల చీమల కొండ” అని పిలుస్తారు. గౌహతి నుండి 310 కి.మీ దూరంలో ఉంటుంది ఈ హిల్ స్టేషన్. ఉత్తమ వేసవి సెలవుల గమ్యస్థానంగా దీన్ని చెప్పుకోవచ్చు. బ్రిటన్ కాలం నాటి ఎన్నో చారిత్రక భవనాలు ఈ గ్రామంలో కనిపిస్తాయి. పర్వత శ్రేణులు, చిన్న కొండలు, దట్టంగా వ్యాపించిన పచ్చదనం చాలా అందంగి ఉంటాయి. ఇక్కడ పైనాపిల్ తోటలు ఉంటాయి. ఇక్కడి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్.

చిరపుంజి (మేఘాలయ)

మండే ఎండల్లో నుంచి మేఘాల్లోకి వెళ్లినట్టు ఉంటుంది చిరపుంజి. ఈ వేసవిలో భూమిపై అత్యంత తేమగా ఉండే ప్రదేశాలలో ఒకటి ఇది.షిల్లాంగ్ నుండి 58 కి.మీ దూరంలో ఉన్న ఈ అద్భుతమైన పర్యాటక ప్రదేశం చిరపుంజి. జలపాతాలు, పచ్చని పచ్చిక భూములు, ఆహ్లాదకరమైన వాతావరణం మీ వేసవికి తగిన అనుభూతిని కలిగిస్తాయి. నోహ్కలికై జలపాతం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. చిరపుంజిలో ఇది చూడొచ్చు. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌కు మించదు.

Also Read: వేసవిలో సందర్శించాల్సిన టూర్లు ఇవే

Previous articleకల్లు గీత కార్మికులకూ రూ. 5 లక్షల బీమా సాయం.. కేసీఆర్ నిర్ణయం
Next articleనానబెట్టిన వాల్‌నట్స్ తింటే త్వరగా బరువు తగ్గుతారు.. మరో 6 ఉపయోగాలూ తెలుసుకోండి