అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్ : మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు

amazon freedom sale

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగనుంది. ఈసారి కూడా మొబైల్‌ ఫోన్స్, లాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్స్, అమెజాన్‌ డివైజెస్‌పై అమెజాన్‌ బంపర్‌ ఆఫర్లను ప్రకటించింది.

ఆఫర్లు చాలా ఉన్నప్పటికీ వీటిలో మనకేవి బెటరో ఒక్కోసారి అర్థం కాదు. ముఖ్యంగా తాజా గాడ్జెట్స్‌ విషయంలో ఈ సమస్య ఎదురవుతుంది. ఈనేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్స్, యాక్సెసరీస్, ఇతర గాడ్జెట్లలో కొన్ని మెరుగైన ఆఫర్లను మీ దృష్టికి డియర్‌ అర్బన్‌ తెస్తోంది.

అమెజాన్‌ ఈసారి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై గరిష్టంగా రూ. 1,750 వరకు వర్తించేలా 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. గత నెలలో ప్రైమ్‌ మెంబర్ల కోసం ప్రైమ్‌ డే డీల్స్‌ ఇచ్చిన అమెజాన్‌ ఈసారి అందిస్తున్న మెరుగైన డీల్స్‌లో కొన్ని మీకోసం..

మొబైల్‌ ఫోన్స్‌పై బెస్ట్‌ ఆఫర్స్‌ ఇవే..

ఐఫోన్‌ 11, 12

ఆపిల్‌ ఐఫోన్‌ 11 గరిష్ట ధర రూ. 54,900 ఉండగా ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ 2021 సేల్‌లో ఈ వారం రూ. 49,999కే అందిస్తోంది. ప్రైమ్‌ డీల్‌లో దీని కంటే తక్కువకే అమ్మినప్పటికీ ఈ ధర కూడా పరవాలేదు. ఈసారి ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్‌ ద్వారా రూ. 13,400 వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఎలాంటి వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందిస్తోంది. అన్ని ప్రధాన క్రెడిట్‌ కార్డులపై ఈ సౌకర్యం ఉంది.

ఇక ఐఫోన్‌ 12 గరిష్ట ధర రూ. 79,900 ఉండగా.. తాజా సేల్‌లో రూ. 67,999కే అందిస్తోంది. పాత స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్ఛేంజీ చేసుకుంటే రూ. 13,400 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

వన్‌ ప్లస్‌ 9 5జీ

వన్‌ ప్లస్‌ 9 5 జీ ధర ఈ సేల్‌లో రూ. 45,999గా ఉంది. రూ. 4 వేల మేర కూపన్‌ లభించడం వల్ల ఈ డిస్కౌంట్‌ అందుతుంది. పాత స్మార్ట్‌ ఫోన్‌ మార్పిడి చేసుకుంటే రూ. 13,400 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 20

8 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉన్న సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 20 ఎమ్మార్పీ రూ. 86 వేల ఉండగా సేల్‌లో రూ. 54,999కే లభిస్తోంది. వడ్డీ లేని ఈఎంఐ, ఎక్స్ఛేంజీ డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.

వన్‌ప్లస్‌ 8టీ

65 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సౌకర్యంతో వస్తున్న వన్‌ ప్లస్‌ 8టీ రూ. 38,999కే లభిస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌తో నడిచే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 30 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్‌ అవుతుంది.

షియోమి ఎంఐ 10ఐ 5జీ

షియోమి ఎంఐ 10ఐ 5జీ 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో వస్తోంది. దీని ధర రూ. 21,999గా ఉంది. 33డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 4820 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఆక్టా కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750 జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిస్‌ప్లే కూడా పెద్దదిగా ఉంటుంది. 6.67 ఇంచుల డిస్‌ప్లే ఉంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ 51

సామ్‌సంగ్‌ గెలాక్సీ 51 భారీ బ్యాటరీ సామర్థ్యం (7000 ఎమ్‌ఏహెచ్‌)తో వస్తోంది. రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో మంచి ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నవారు దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చు. దీని ధర రూ. 19,999గా ఉంది. 25డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే రెండు రోజులు వాడుకోవచ్చని సామ్‌సంగ్‌ చెబుతోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

షియోమీ రెడ్‌మీ నోట్‌ 10 ప్రో

షియోమీ రెడ్‌మీ నోట్‌ 10 ప్రో రూ. 17,999గా ఉంది. 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 33డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ ఉంటుంది. 64 మెగాపిక్సెల్‌ కెమెరాతో లభ్యమయ్యే ఈ స్మార్ట్‌ ఫోన్‌.. 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

నోకియా జీ20

నోకియా జీ 20 రూ. 11,990కే లభిస్తోంది. వెయ్యి రూపాయల కూపన్‌ డిస్కౌంట్‌ ఆటోమేటిగ్గా చెక్‌ అవుట్‌ సమయంలో వర్తిస్తుంది. కూపన్‌ చెక్‌బాక్స్‌ను టిక్‌ చేయాల్సి ఉంటుంది. 6.5 ఇంచుల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌ 48 మెగాపిక్సల్‌ క్వాడ్‌ రేర్‌ కెమెరాతో వస్తోంది.

ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌.. ఎలక్ట్రానిక్స్‌పై బెస్ట్‌ ఆఫర్స్‌

అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌

ఫైర్‌ టీవీ స్టిక్‌ మీ టీవీని స్మార్ట్‌ టీవీగా మారుస్తుంది. పెన్‌ డ్రైవ్‌ మాదిరిగా ఉండే ఈ స్టిక్‌ను టీవీకి పెడితే యూ ట్యూబ్, ఓటీటీ.. ఇలా అన్ని సర్వీసులు స్ట్రీమ్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌లో భాగంగా అమెజాన్‌ తన సొంత డివైజ్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ (థర్డ్‌ జనరేషన్, 2021)ను రూ. 2,799కే అందిస్తోంది. వాస్తవ ధర రూ. 4,999గా ఉంది. దీనిని కొనుగోలు చేస్తే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై రూ. 2 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ

ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ గరిష్ట ధర రూ. 29 వేలు ఉండగా తాజా సేల్‌లో రూ. 25,900లకే లభిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా మరో పది శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6తో పాటు లాంచ్‌ అయిన ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ ఆపిల్‌ ఎస్‌5 ప్రాసెసర్‌తో నడుస్తుంది.

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా డిస్కౌంట్‌ ఇస్తూ ధరను రూ. 41900గా నిర్ధారించింది. గరిష్ట ధర రూ. 52,900గా ఉండేది. ఈ ఆపిల్‌ వాచ్‌ మీ ఆపిల్‌ ఐఫోన్‌తో పెయిర్‌ చేసి వాడుకోవచ్చు.

సోనీ డబ్ల్యూహెచ్‌–1000ఎక్స్‌ఎం3 వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌

తాజా సేల్‌లో సోనీ డబ్ల్యూహెచ్‌–1000ఎక్స్‌ఎం3 వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ రూ. 17,990లకే లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 29,990గా ఉంది. ఈ పాపులర్‌ గాడ్జెట్‌పై ఫస్ట్‌ టైమ్‌ ఇంత పెద్ద డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ రూ. 17,999కే లభిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ ద్వారా మరో 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఆపిల్‌ ఐపాడ్‌ ఎయిర్‌ 2020

ఆపిల్‌ ఐపాడ్‌ ఎయిర్‌ 2020 ధర ఈ తాజా సేల్‌లో రూ. 47,900గా ఉంది. దీని గరిష్ట ధర రూ. 54,900గా ఉండేది. ఆపిల్‌ ఎ14 బయోనిక్‌ చిప్‌సెట్‌తో ఉంటుంది. 10.9 ఇంచుల డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

హెచ్‌పీ పెవీలియన్‌ 15 ఇంచెస్‌ గేమింగ్‌ లాప్‌టాప్‌

హెచ్‌పీ పెవీలియన్‌ 15 ఇంచెస్‌ గేమింగ్‌ లాప్‌టాప్‌ ధరను రూ. 66,490గా నిర్దేశించింది. దీని గరిష్ట ధర రూ. 77,549గా ఉండేది. ఈ లాప్‌టాప్‌పై ఎక్స్ఛేంజీలో గరిష్టంగా రూ. 18,150 డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఏఎండీ రైజెన్‌ 5–4600హెచ్‌ ప్రాసెసర్‌తో, 8 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. 1 టీబీ హార్డ్‌ డ్రైవ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ కాన్‌ఫిగరేషన్‌తో వస్తోంది.

Previous articleపిల్లలకు సెప్టెంబర్‌ నుంచి వాక్సిన్లుః ఎయిమ్స్‌ చీఫ్‌
Next articleMunnar tour: మున్నార్ టూర్.. కొండ కోనల్లో విహారం