Munnar tour: మున్నార్ టూర్.. కొండ కోనల్లో విహారం

munnar tourist places

Munnar tour: మున్నార్‌ కేరళలోని ప్రముఖ టూరిస్ట్‌ ప్లేస్‌. ఈ మున్నార్‌ టూర్‌లో హిల్ స్టేషన్లు (munnar hill station) , జలపాతాలు, కొండలు, కోనలు, డ్యామ్‌లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ట్రెక్కింగ్ స్పాట్లు, పిక్నిక్ స్పాట్లు మరెన్నో విశేషాలు చూడొచ్చు.

మున్నార్ హిల్‌ స్టేషన్‌ బ్రిటిష్‌ కాలంలో వారికి సౌత్‌ ఇండియాలో వేసవి రిసార్ట్‌గా పేరుగాంచింది. మూతిరపుళా, నల్లతన్ని, కుండాల అనే మూడు నదుల సంగమంలో ఉంది. సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో టీ తోటలతో అందమైన రిసార్ట్‌ టౌన్‌గా అలరిస్తోంది.

12 ఏళ్లకోసారి పూసే నీలకురింజి పుష్పం ఇక్కడే కనిపిస్తుంది. సౌత్‌ ఇండియాలో అతి ఎల్తైన పర్వత శిఖరం ఆనముడి మున్నార్‌లోనే ఉంది. 2,695 మీటర్ల ఎత్తులో ఉండి ట్రెక్కింగ్‌కు అనకూలంగా ఉంటుంది. మున్నార్‌ హిల్‌ స్టేషన్‌ చుట్టూ చూడాల్సిన ప్రదేశాలపై డియర్‌ అర్బన్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

మున్నార్‌ టూర్ (Munnar tour) ఇలా..

రైల్వే మార్గంలోః సమీప రైల్వే స్టేషన్‌ అలువా. మున్నార్‌కు 108 కి.మీ. దూరంలో ఉంటుంది. అలాగే ఎర్నాకులం రైల్వే స్టేషన్‌ 125 కి.మీ., మదురై రైల్వే స్టేషన్‌ 160 కి.మీ. దూరంలో ఉంటాయి. అక్కడి నుంచి మున్నార్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 12.20కి ట్రైన్‌ బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.33 కు అలువా చేరుకుంటుంది. టికెట్‌ ధర థర్డ్‌ ఏసీ రూ. 1,895, సెకెండ్‌ ఏసీ రూ. 2,630, స్లీపర్‌ క్లాస్‌ రూ. 735గా ఉంది.

విమాన మార్గంలోః సమీప విమానాశ్రయం కొచ్చిన్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌. 110 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి కొచ్చి విమానాశ్రయానికి నెల రోజులు ముందుగా బుక్‌ చేసుకుంటే టికెట్‌ ధర రూ. 2,500కు అటుఇటుగా ఉంటుంది.

మున్నార్‌ టూర్‌ (Munnar tour)లో ఎక్కడ బస చేయవచ్చు?

మున్నార్‌లో హోటళ్లు, హోమ్‌ స్టే వసతి సౌకర్యాలు ఉన్నాయి. టీ కంట్రీ రోడ్‌లో గ్రీషమ్‌ హాలిడే ఇన్, కన్నన్‌దేవన్‌ హిల్స్‌లో హోటల్‌ ఎస్‌.ఎన్‌.అనెక్స్, ఈటీ సిటీ రోడ్‌లో ది ఫాగ్‌ రిసార్ట్‌ అండ్‌ స్పా హోటళ్లు ఉన్నాయి. ఈటీ సిటీలో గోకులమ్‌ హోమ్‌ స్టే కూడా ఉంది.

మున్నార్‌లోని ఇతర హోటళ్లు, హోమ్‌ స్టేలతో కూడిన వివరాలు ఈ పేజీ లో లభిస్తాయి.

మున్నార్‌ సందర్శించాల్సిన సమయం :

కేరళలోని టూరిస్ట్‌ ప్రాంతాలు ఆగస్టు నుంచి మార్చి వరకు బిజీగా ఉంటాయి. అయితే మున్నార్‌ హిల్‌ స్టేషన్‌ కాబట్టి సమ్మర్‌లోనూ బిజీగా ఉంటుంది. అందుకే దీనిని సౌత్‌ కశ్మీర్‌ అంటారు.

మున్నార్‌ టూర్‌లో చూడాల్సిన ప్రదేశాలు:

టీ మ్యూజియం

తేయాకు తోటల ఆవిర్భావం, అభివద్ధికి సంబంధించిన పూర్వ చరిత్ర, కేరళలోని ఎల్తైన ప్రాంతాల్లో సాగయ్యే తేయాకు తోటలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలను తెలిపేందుకు మున్నార్‌లో టాటా టీ కంపెనీ ఈ ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేసింది. నల్లతన్ని ఎస్టేట్‌లో ఈ మ్యూజియం ఉంది.

టాప్‌ స్టేషన్‌

munnar topstation
munnar topstation

మున్నార్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌– కొడైకనాల్‌ రోడ్డులో ఉంటుంది. తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. నీలకురింజి పుష్పాలను చూసేందుకు అనుకూల ప్రదేశం ఇది.

ఎరవికులం నేషనల్‌ పార్క్‌

మున్నార్‌ సమీపంలో బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌ ఎరవికులం నేషనల్‌ పార్క్‌. నీలగిరి తార్‌కు ఫేమస్‌ ఇది. 97 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పార్కు అరుదైన సీతాకోక చిలుకలు, పక్షులు, జంతువులకు నిలయం.

ట్రెక్కింగ్‌ చేసే వారికి ఆకర్షణీయ స్థలం. పార్కు నుంచి టీతోటలు, మంచు దుప్పటి కప్పుకున్న కొండలు చూడొచ్చు.

నీలకురింజి పుష్పాల సీజన్‌లో టూరిస్ట్‌లు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఫిబ్రవరి–మార్చి మధ్య కొద్ది రోజులు పార్కు మూసి ఉంటుంది. పార్క్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.

ఆనముడి పర్వతశిఖరం

ఆనముడి పర్వత శిఖరం ఎరవికులం నేషనల్‌ పార్కు లోపలే ఉంటుంది. 2700 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత శిఖరం సౌత్‌ ఇండియాలోనే అతి పెద్దది. దీనిపై ట్రెక్కింగ్‌ చేసేందుకు ఎరవికులంలోని అటవీ, వన్య సంరక్షణ అధికారుల అనుమతి తీసుకోవాలి.

చోక్రముడి పర్వత శిఖరం

చోక్రముడి పర్వ శిఖరం కూడా ఎరవికులం నేషనల్‌ పార్కులోనే ఉంటుంది. సముద్ర మట్టానికి 2400 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వత శిఖరం ట్రెక్కింగ్‌ ప్రియులను అలరిస్తుంది.

మట్టుపెట్టి డామ్‌

మున్నార్‌ టౌన్‌ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్టుపెట్టి సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మట్టుపెట్టిలో స్టోరేజీ డ్యామ్, చెరువు ఉన్నాయి. ఇక్కడ బోటు రైడింగ్‌ మరిచిపోలేని అనుభూతి. బోట్‌ రైడింగ్‌లో చుట్టూ కొండలు, లాండ్‌ స్కేప్‌ ఆహ్లాదపరుస్తాయి. మట్టుపెట్టిలో ఇండో స్విస్‌ లైవ్‌ స్టాక్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని డైరీ ఫామ్‌ ఆకట్టుకుంటుంది.

పల్లివాసల్‌

మున్నార్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే పల్లివాసల్‌లో హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఇది కేరళలోనే మొదటిది. పిక్నిక్‌ స్పాట్‌లలో బాగా పాపులర్‌ ఇది.

చిన్నకనాల్‌ వాటర్‌ ఫాల్స్‌

మున్నార్‌కు దగ్గరల్లో చిన్నకనాల్‌లో వాటర్‌ ఫాల్స్‌ అలరిస్తాయి. పశ్చిమ ఘాట్‌ శ్రేణిలోని అందమైన దృశ్యాలకు కేంద్రం ఇది. చిన్నకనాల్‌ నుంచి ఏడు కిలోమీటర్ల ప్రయాణిస్తే ఆనయీరంగల్‌ చేరుకుంటారు. మున్నార్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆనయీరంగల్‌ తేయాకు తోటలతో అలరిస్తుంది. ఆనయీరంగల్‌ డ్యామ్‌ చుట్టుపక్కల తేయాకు తోటలు, అటవీ ప్రాంతం ఆకట్టుకుంటుంది.

అట్టుకాడ్‌ వాటర్‌ ఫాల్స్‌

కొండలు, అటవీ ప్రాంతం మధ్య ఉండే ఆకర్షణీయ టూరిస్ట్‌ ప్లేస్‌ అట్టుకాడ్‌ జలపాతం. మున్నార్, పల్లివాసల్‌ మధ్య ఉంటుంది.

కుందాల లేక్‌

కుందాల లేక్‌లో పెడల్‌ బోటింగ్‌ సదుపాయం ఉంది. ఒక జంట రూ. 150 చెల్లించి బోటింగ్‌ చేయొచ్చు. స్పీడ్‌ బోటింగ్‌ కూడా అందుబాటులో ఉంది. చుట్టూ కొండల మధ్య బోటింగ్‌ మరిచిపోలేని అనుభూతి.

చిన్నార్‌ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం

పశ్చిమ కనుమల్లో ఉండే చిన్నార్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏనుగులు, పులులతో కూడి ఉంటుంది. మున్నార్‌–ఉడుమల్‌పేట్‌ మార్గంలో ఉంటుంది.

మీసప్పులిమల ట్రెక్కింగ్‌

పశ్చిమ కనుమలలో రెండో ఎత్తైన శిఖరం మీసప్పులిమల. రోడో వ్యాలీ మీదుగా ట్రెక్కింగ్‌ మార్గం చేరుకోవచ్చు. మున్నార్‌ నుంచి మట్టుపెట్టి మీదుగా అరువిక్కాడ్‌ ఎస్టేట్‌ మీదుగా 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మీసప్పులిమల బేస్‌ క్యాంప్‌కు చేరుకుంటారు.

బేస్‌ క్యాంప్‌ నుంచి రోడో వ్యాలీకి ప్రయాణం జీప్‌లో ఉంటుంది. ఫోర్‌ వీలర్‌ ద్వారా వాహనదారులు ఇక్కడి వరకు మాత్రమే చేరుకోవచ్చు. మార్గంలో మీరు పాండవ గుహ చూడొచ్చు.
neelakurinji flowers
రాత్రి సమయంలో రోడో మాన్షన్‌ వద్ద టెంట్లలో క్లౌడ్‌ టాప్‌ మధ్యలో ఉండి, మరుసటి రోజు రోడో డెండ్రాన్‌ చెట్ల మధ్య శిఖరానికి చేరుకోవచ్చు.

ఇది కఠినమైన ట్రెక్కింగ్‌. ప్యాకేజీలో గైడ్‌ సర్వీస్, అల్పాహారం, భోజనం, సాయంత్రం టీ – డిన్నర్‌ ఉంటాయి.

బేస్‌ క్యాంపులో కేరళ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ బస సౌకర్యాలు అందిస్తోంది. టెంట్లలో ఉండడానికి ఇద్దరు వ్యక్తులకు రూ. 4 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

కేరళ టూరిజం సంస్థ అందిస్తున్న ప్యాకేజీలు ఇతర వివరాల కోసం ఆ సంస్థ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

మరిన్ని టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇక్కడ

కూర్గ్ టూర్

హంపి టూర్

గోవా టూర్

భద్రాచలం టూర్

కులు మనాలి టూర్ .. మంచులో విహరిద్దాం ఇలా..

నైనితాల్‌ టూర్ .. ఆహ్లాదం.. ఆధ్యాత్మికం

 

Previous articleఅమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్ : మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు
Next articleBhimashankar jyotirlinga: భీమశంకర జ్యోతిర్లింగం.. జ్యోతిర్లింగ దర్శన యాత్ర