విడుదలకు సిద్ధంగా ఉన్న ‘అసలేం జరిగింది’ మూవీ సాంగ్స్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఇటీవలే విడుదలయ్యాయి. హీరో శ్రీరాం, హీరోయిన్ సంచితా పదుకొనే నటిస్తున్న ఈ చిత్రానికి వీరరాఘవ దర్శకత్వం వహించారు. ఎక్సోడస్ మీడియా అధినేత కింగ్ జాన్సన్ సమర్పణలో కె.నీలిమ నిర్మించారు. యేలేందర్ మహవీర్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు శ్రోతలకు బాగా నచ్చేశాయి. ఐదు గీతాలు ఉన్న ఈచిత్రంలో మూడు మెలోడీ సాంగ్స్ కావడం, మూడూ బాగుండడం విశేషం. ఇక ఒకటి మాస్ నెంబర్ కాగా.. మరొకటి ఐటమ్ సాంగ్. చక్కటి ట్యూన్లు ఇచ్చిన యేలేందర్ మహవీర్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.
అలరిస్తున్న వెన్నెలా చిరునవ్వై.. గుండెల్లోకొచ్చావే..
‘వెన్నెలా చిరునవ్వై గుండెల్లోకొచ్చావే
అంతులేని ఆనందం తోడు నాకు ఇచ్చావే
నాలోకొచ్చీ నీవే.. నన్నేదే చేసేశావే
మనసే లాగేశావే నను నన్నే కాజేశావే
చిట్టీ గుండెల్నే పట్టి గిలిగింత పెట్టావే
ఊపిరి ఆగేలా చూసే మత్తు కళ్లు నీవే
ఎట్టా ఉండాలే పిల్లా నిన్నిట్ట చూస్తుంటే
పిచ్చెక్కిపోతుందే పిల్లా నీవట్ట చూస్తుంటే
ఎవరిని చూసినా.. ఏ పనిచేసినా..
ఎదురుగ నువ్వలా కనబడతావే
పారాణీ పాదాలే.. కదిపావా కళ్లంటూ
కుదురేలేక కునుకే రాక
క్షణమొక యుగమే
యాలో యాలో యాలో
నువ్వంటే ఎంతో ఇష్టం
యాలో యాలో యాలో
కాదంటే చాలా కష్టం
చిట్టీ గుండెల్నే పట్టి గిలిగింత పెట్టావే
ఊపిరి ఆగేలా చూసే మత్తు కళ్లు నీవే..
ఎట్టా ఉండాలే పిల్లా నిన్నిట్ట చూస్తుంటే
పిచ్చెక్కిపోతుందే పిల్లా నీవట్ట చూస్తుంటే
కనులకు కాటుకే రాసిన వేళలో
చిలిపి చూడకే చిరునవ్వులతో
ఓసారీ అవునంటూ
ఓసారీ కాదంటూ
కోపంలోనూ నచ్చేస్తూ
తికమక పెడుతూ
ప్రియాప్రియా ప్రియా నువ్వంటే ఎంతో ఇష్టం
ప్రియా ప్రియా ప్రియా మనసంతా నువ్వే నువే
కళ్లోకొస్తావే… కానీ కౌగిలింత రాదే
ముద్దుగా ఉంటావే.. కానీ ముద్దు పెట్టనీవే
ఎట్టా ఉండాలే పిల్లా నిన్నిట్ట చూస్తుంటే
పిచ్చెక్కిపోతుందే పిల్లా నీవట్ట చూస్తుంటే..’
అంటూ సాగే ప్రేమికుడి విరహగీతం శ్రోతలను బాగా ఆకట్టుకుంది. దీనిని విజేయ్ ప్రకాష్ పాడారు. చిర్రావూరి విజయ్‌కుమార్ రాశారు.
వీనుల విందు చేసే నిను చూడకుండా.. మనసు ఆగదే..
ఇక మాళవిక, యాజీన్ పాడిన మరో మెలోడీ సాంగ్ ‘నిను చూడకుండా.. మనసు ఆగదే..’ వీనుల విందు చేస్తుంది. మాళవిక గొంతు నుంచి వెలువడిన మరో మధురమైన పాట ఇది. ఈ గీతాన్ని డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి రాశారు. పాటలో ఎలాంటి గజిబిజి లేకుండా మధురంగా సాగుతూ మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ ఇది.
‘నిన్ను చూడకుండా.. మనసు ఆగదే ఏంటలా..
కుదురుగా ఉండనివ్వదే.. అసలెలా..
ఊరుకోదులే నా ప్రాణం నువ్ చెప్పే మాట వినకుంటే
ఊపిరాడదే నీ నుంచి అడుగైనా అడుగిటు వేస్తే
నిజమా నిజమా.. నువు అన్నది నిజమా
ప్రేమొక వరమా.. ఎద విన్నది నిజమా…
నిన్ను చూడకుండా.. మనసు ఆగదే ఏ పిల్లా
కంటి మీదే కునుకు వాలదే.. నీ వల్లా..
ఏ చోటున్నా నీవే గుర్తుకొస్తుంటావే
ఎవరేమన్నా నీ మాట వినిపిస్తాదే
నీతోనే నేనుంటే నన్ను నేను మరిచాలే
ఈమధ్య తెలిసేలా ప్రేమంటే ఇంతేలే
గాలి తాకినా నీ మాటే తలచేనా కలవరమాయే
ఉన్నపాటుగా నీ దూరం గుర్తొచ్చి ఎదబరువాయే
నిజమా నిజమా నీవన్నది నిజమా..
ప్రేమొక వరమా.. ఎద విన్నది నిజమా..
నిన్ను చూడకుండా.. మనసు ఆగదే ఏంటలా..
కుదురుగా ఉండనివ్వదే.. అసలెలా
హా గుడి గంటల్లో వింటున్నాలే నీ పేరే
నలుదిక్కుల్లో చూస్తున్నాలే నీ ప్రేమే
గుప్పెడెంత గుండెల్లో సవ్వడే నీదని
ఏ మాటకా మాటే నేనంటే నీవని
బ్రహ్మదేవుడే ఏనాడో రాశాడే
మనమొకటంటూ
జన్మజన్మకీ నీతోనే ఉంటానే
జతపడమంటూ
నిజమా నిజమా.. నువు అన్నది నిజమా
ప్రేమొక వరమా.. ఎద విన్నది నిజమా..
నిన్ను చూడకుండా.. మనసు ఆగదే ఏ పిల్లా
కంటి మీదే కునుకు వాలదే.. నీ వల్లా..’ అంటూ సాగే ఈ సాంగ్ శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటుంది.
విజయ్ ఏసుదాస్ సాంగ్ హైలైట్..
’నింగిలోని చందమామ ఒంటరైపోయినే..
నన్ను కన్న తల్లి దూరమై పోయెనే..
బ్రహ్మదేవుడా.. అమ్మ ప్రేమనే తుంచి వేస్తివా..’ అంటూ విజయ్ ఏసుదాస్ పాడిన గీతం హృదయాన్ని తాకుతుంది. ఈ సాంగ్ వెంకటేష్ రాశారు. లిరిక్ బాగుంది.
ఇక రాంకీ ఆలపించిన మామారే కల్లు పాటను చిర్రావురి విజయ్‌కుమార్ రాశారు. మామారే కల్లు మతెక్కింది.. మామారే కల్లు మతిపోతోంది.. ఫారిన్ స్కాచ్‌కు బాసు ఇదీ.. అంటూ సాగే ఈ గీతం మాస్ నెంబర్. మిక్స్డ్ ట్యూన్స్‌తో అదరగొట్టే ఫాస్ట్ బీట్ సాంగ్. తాటి కల్లు గురించి ఈ సాంగ్‌లో చెప్పే ప్రయత్నం చేశారు.
‘అక్కడా ఇక్కడా ఎక్కడైనా ఫేమస్సు నేను.. రికార్డు డాన్సుల్లో ఫేమస్..‘ అంటూ సాగే ఐటమ్ సాంగ్ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రికార్డ్ డాన్స్. ఈ సాంగ్‌ను భార్గవి, శివప్రియ ఇందారపు పాడారు. పూర్తి మసాలా సాంగ్. చిర్రావూరి విజయ్‌కుమార్ రాశారు.
త్వరలో విడుదల కానున్న ఈ మూవీ సాంగ్స్ ఆదిత్యామ్యూజిక్ జూక్ బాక్స్ ద్వారా వినొచ్చు. అలాగే అమెజాన్ మ్యూజిక్, జియో సావన్, స్పాటిఫై వంటి మ్యూజిక్ ఓటీటీ యాప్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి