Ashwagandha uses in telugu: అశ్వగంధతో ఈ 10 ఉపయోగాలు తెలుసా?

Ashwagandha
Formulatehealth.com, CC BY 2.0 , via Wikimedia Commons

Ashwagandha uses in telugu: అశ్వగంధ ఉపయోగాలు అన్నీఇన్నీ కావు. దీనినే వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. సర్వరోగ నివారిణిగా కూడా దీనికి పేరుంది. ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఔషధ మొక్క ఇది.

Ashwagandha uses in telugu: అశ్వగంధతో ప్రయోజనాలు ఇవే

అశ్వగంధలోని ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. ఏయే వ్యాధులను అశ్వగంధ నయం చేస్తుందో ఒక్కొక్కటిగా చెప్పుకుందాం.

  1. నిద్ర రావట్లేదని బాధపడే వారికి అశ్వగంధ ఒక చక్కటి ఔషధం. పాలల్లో అశ్వగంధ చూర్ణం (Ashwagandha churnam) కలిపి తీసుకుంటే నిద్ర తన్నుకుంటూ వస్తుంది. గాఢ నిద్ర కూడా వస్తుంది.
  2. అధిక ఒత్తిడిని (stress) ఎదుర్కొంటున్న వారికి అశ్వగంధ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. శారీరక, మానసిక ఒత్తిళ్లను ఇది దూరం చేస్తుంది.
  3. మారిన జీవనశైలి కారణంగా మన బయోలాజికల్ ఏజ్ పెరుగుతూ వస్తుంది. అందువల్ల వృద్ధాప్య సమస్యలు త్వరితగతిన వస్తాయి. దీనిని ఎదుర్కోవడానికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది
  4. మనం జలుబు, దగ్గుతో బాధపడడం సర్వ సాధారణం. అశ్వగంధ చూర్ణం ఒక మూడు గ్రాముల మేర తీసుకుంటే చలికాలంలో ఆయా బాధల నుంచి రిలీఫ్ ఉంటుంది.
  5. ఆకలి లేకపోయినా, అజీర్తి సమస్యలు ఎదురైనా, సత్తువ లేనట్టు అనిపించినా, నీరసంగా ఉంటున్నా అశ్వగంధ చూర్ణం బాగా పనిచేస్తుంది.
  6. కీళ్ల నొప్పులతో బాధపడేవారు అశ్వగంధ మూల చూర్ణం తీసుకుంటే ఆయా నొప్పులు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
  7. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి, అలాగే వారికి శక్తిమంతమైన ఆహారం ఇవ్వడానికి మార్కెట్లో దొరికే కంపెనీల పొడులు డబ్బాలకు డబ్బాలు తెచ్చిపెడతాం. కానీ అశ్వగంధ చూర్ణం, అతి మధురం చూర్ణం, సమాన భాగాలుగా తీసుకుని వాటికి పటిక బెల్లం పొడి కలిపి స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పొడిని ఒకటి రెండు చెంచాలు పాలలో కలపి ఉదయం పరగడపున, రాత్రి నిద్రకు ముందు ఇవ్వాలి.
  8. వృద్ధాప్య సంబంధిత వ్యాధులు ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వాత సంబంధిత వ్యాధులు తగ్గడానికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అశ్వగంధ గడ్డలను మెత్తగా నూరి గంధంలాగా ఒక కిలో తయారు చేసుకోవాలి. ఆవు పాలు నాలుగు లీటర్లు, నెయ్యి ఒక కిలో కలిపి సిమ్‌లో మరిగించాలి. కేవలం నెయ్యి మాత్రమే మిగిలేవరకు మరిగించాలి. ఆ తరువాత వడపోసి స్టోర్ చేసుకోవాలి. ఈ ద్రవాన్ని రోజూ రెండు పూటలు 10 గ్రాముల చొప్పున సేవించాలి.
  9. చాలా మంది మహిళలు, యువతుల్లో రుతుస్రావం (menstruation) సమయంలో అధిక రక్తస్రావం తీవ్ర ఇక్కట్లను తెచ్చిపెడుతుంది. అశ్వగంధ చూర్ణం, పటిక బెల్లం సమపాళ్లలో కలుపుకుని స్టోర్ చేసుకుని రెండు పూటలా తీసుకోవాలి. చెంచెడు మంచినీటితో కలిపి తీసుకుంటే సరిపోతుంది. అధిక రక్తస్రావ బాధలు తగ్గుతాయి.
  10. అశ్వగంధతో పురుషుల లైంగిక శక్తి మెరుగవుతుందని పేరుంది. వీర్యం పెరగడం, వీర్య కణాల్లో నాణ్యత పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు.

Side Effects of Ashwagandha: అశ్వగంధతో సైడ్ ఎఫెక్ట్స్

అశ్వగంధను మూడు నెలల పాటు తీసుకోవచ్చు. కాస్త విరామం ఇచ్చి మళ్లీ తీసుకోవచ్చు. అలాగే అధిక పరిమాణంలో అశ్వగంధ తీసుకుంటే విరేచనాలు, వాంతులు, కాలేయ సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల వైద్యుడిని సంప్రదించి తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.

Previous articleHome loan interest rates: బ్యాంకు వారీగా హోం లోన్ వడ్డీ రేట్లు ఇలా
Next articleknee pain remedies: మోకాళ్ల నొప్పులకు ఏ మందులు వాడాలి