Home న్యూస్ Gold Rate: భ‌గ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 70 వేలు దాటేసిన పసిడి

Gold Rate: భ‌గ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 70 వేలు దాటేసిన పసిడి

0
Gold Rate: భ‌గ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 70 వేలు దాటేసిన పసిడి
బంగారం ధరలు

Gold price: దేశంలో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప‌సిడికి చాలా డిమాండ్ ఉండ‌డంతో ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వస్తున్న వార్తలతో మదుపరులు బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం తాజా గ‌ణాంకాల ప్ర‌కారం  పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా హైదరాబాద్‌లో రూ. 70 వేల మార్క్‌ను చేరింది. 24 క్యారట్ల బంగారం ధర 70,470గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. 

ఇక వెండి ధరలు కూడా  భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 82,000 చేరింది. దేశంలోనే కాక తెలుగు రాష్టాలలో వెండి ధ‌ర‌లు కూడా  చుక్కలు చూపించే ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో వెండి ధ‌ర‌లు 81, 000 మార్క్ దాటింది. చెన్నైలో వెండి ధ‌ర రూ. 84,000గా ఉంది. అలాగే బెంగుళూరులో కిలో వెండి ధ‌ర రూ. 79,000గా ఉంది. 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,744 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 70,682గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,450 కాగా, 24 క్యారెట్ల పసిడి రూ.71,400గా ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 70,470 పలుకుతోంది.
  • బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో బంగారం ధరలు ఒకేరకంగా ఉన్నాయి. ఈ రెండు మెట్రో నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,470కి చేరింది.
  • గురుగ్రామ్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620 గా ఉంది.
  • లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620గా ఉంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article Black Circles under Eye: క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు శాశ్వతంగా తొలగించడం ఎలా?
Next article ఎయిర్ పోర్టులో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. 10 పాసైన వారు కూడా దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.