పచ్చిబఠానీలతో టేస్టీ వడ గారెలు

green peas vada
Green Peas vada

గ్రీన్ పీస్ వడ గారెలు

పచ్చి బఠానీ గారెలు ఇష్టపడని తెలుగు వాళ్లుంటారా? నిత్యం మినప గారెలు, పప్పు గారెలే తింటే బోరు కొట్టేస్తుంది. కాస్త కొత్తగా పచ్చిబఠానీలతో ప్రయత్నించండి. రుచి అదిరిపోతుంది. వాటిని చేయడం కూడా చాలా సులువు.

తక్కువ క్యాలరీస్, తక్కువ కార్బొహైడ్రేట్స్ కలిగిన గ్రీన్ పీస్‌లో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సీ, థయామిన్, ఫోలేట్స్, మాంగనీస్, ఐరన్, ఫాస్ఫరస్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా, సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవడానికి బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఆహారం ఇది. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లలో ఒకటిగా దీనిని మీరు లిస్ట్ చేసుకోవచ్చు.

  • మిక్సీ
  • డీప్ ఫ్రై కోసం బాణలి
  • 1 కప్పు పచ్చి బఠానీలు
  • 3 టీ స్పూన్లు ఉప్మారవ్వ
  • ½ కప్పు శనగ పిండి
  • 4 పచ్చి మిర్చి
  • ½ కప్పు ఉల్లి తరుగు
  • Ø తగినంత ఉప్పు
  • Ø డీప్ ఫ్రైకి తగినంత నూనె
  • 1 చిటికెడు వంట సోడా
  • ½ టీస్పూన్ జీలకర్ర
  • Ø తగినన్ని నీళ్లు
  1.  ముందుగా పచ్చిబఠానీలు, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. 

  2. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో శెనగపిండి, ఉప్మారవ్వ, ఉల్లితరుగు, వంటసోడా వేసి కాస్త నీళ్లు చేర్చి బాగా కలుపుకోవాలి.

  3. ఆ మిశ్రమాన్ని  మరీ జారేలా కాకుండా, అలాగని గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. 

  4. ఒక పదినిమిషాలు పక్కన వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల ఉప్మారవ్వ నీటిని పిీల్చుకుని మెత్తబడుతుంది. ఆ తరువాత మళ్లీ కలపాలి. 

  5. ఇప్పుడు బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను పోసి వేడెక్కనివ్వాలి. 

  6. గారెల మిశ్రమాన్ని చేతితో గుండ్రంగా గారెల్లా అద్ది నూనెలో వేయాలి. వేగాక తీసి సర్వ్ చేయాలి.

పచ్చిబఠానీలతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది..

 

1. రక్తహీనత సమస్య ఉన్న వారు వీటిని తింటే మంచిది. పచ్చిబఠానీలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ వల్ల రక్తం తయారవుతుంది. 

2. వీటిని తినడం మలబద్ధకం సమస్య ఏర్పడదు. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ వల్లే ఈ లాభం కలుగుతుంది. 

3. వీటిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. కాబట్టి పచ్చిబఠానీలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగుతుంది.

 4. పచ్చిబఠానీలలో ఫైటో అలెక్సిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది పొట్టలో అల్సర్లకు, క్యాన్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా ఏర్పడకుండా కాపాడుతుంది. 

5. వీటిలో లుటీన్ అనే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది కంటి శుక్లాల సమస్య రాకుండా కాపాడుతుంది. 

6. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాల్లో బఠానీలు ఒకటి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని ఆహారం. 

Breakfast
Indian
పచ్చి బఠానీ వడ
Previous articleమానసిక వ్యాధి పోవాలంటే ఏం చేయాలి?
Next articleపెళ్లితో కలిసొస్తుందంటే.. మర్డర్ చేసి..