Irctc tour package: ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి లేహ్ టూర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. మొత్తం ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు సాగే ఈ హైదరాబాద్ – లేహ్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇవీ..
టూర్ ఆగస్టు 25, సెప్టెంబరు 8, సెప్టెంబరు 23 తేదీల్లో ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్‌లో తీసుకెళతారు. అక్కడి నుంచి మళ్లీ లేహ్ వరకు విమానంలో తీసుకెళతారు. తిరుగు ప్రయాణంలో కూడా లేహ్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో తీసుకొస్తారు.
ట్రిపుల్ ఆక్యుపెన్సీలో అయితే ఒక్కో వ్యక్తికి రూ. 41,360 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్ కోసం వాట్సాప్ 9701360701 నెంబరులో సంప్రదించవచ్చు.
ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
ప్యాకేజీలో రిటర్న్ ఎయిర్‌ఫేర్ కలిసి ఉంటాయి. అంటే రానూపోనూ విమాన ఛార్జీలు కూడా ప్యాకేజీలో కలిసి ఉంటాయి. లేహ్‌లో 3 రాత్రులు గడిపేందుకు లాడ్జీలో వసతి ఏర్పాటు చేస్తారు. మరో రెండు రాత్రులు నుబ్రాలో, ఒక రాత్రి పాంగాంగ్ సరస్సు వద్ద బస ఏర్పాటు చేస్తారు.
నాన్ ఏసీ వెహికిల్‌లో సైట్ సీయింగ్ తీసుకెళతారు. ఈ వెహికిల్‌లో షేరింగ్ పద్ధతిలో అరేంజ్ చేస్తారు. అంటే ముగ్గురు నలుగురికి కలిపి ఒక నాన్ ఏసీ వెహికిల్ అరేంజ్ చేస్తారు.
ప్యాకేజీలో భాగంగా 6 రోజులు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్, ఐదు రోజులు మధ్యాహ్న భోజనం, ఆరు రోజులు రాత్రిపూట డిన్నర్ అరేంజ్ చేస్తారు. ప్రతిరోజూ రోజుకొక బాటిల్ చొప్పున డ్రింకింగ్ వాటర్ బాటిల్ ఇస్తారు. అత్యవసర సమయాలకు పనికొచ్చేలా వెహికిల్‌లో ఆక్సిజన్ సిలిండర్ కూడా సమకూరుస్తారు.
లేహ్‌లో సంప్రదాయపద్ధతిలో స్వాగత కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా సమకూరుస్తారు. అలాగే అవసరమైన చోట ఇన్నర్‌లైన్ పర్మిట్స్ కూడా ఇప్పిస్తారు. వివిధ సందర్శనీయ స్థలాలకు ఎంట్రెన్స్ ఫీజు కూడా ప్యాకేజీలో భాగంగా సమకూరుస్తారు. మీ వెంట ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ కూడా ఉంటారు. జీఎస్టీ, ఇతర పన్నులు కూడా ప్యాకేజీలో కలగలిపి ఉంటాయి. అంటే అవన్నీ ఐఆర్‌సీటీసీ భరిస్తుంది.
రెండో రోజు నుంచి ఆరో రోజు వరకు గైడ్ కూడా వెంట ఉంటారు. ఒకరోజు కల్చరల్ షో కూడా ఉంటుంది.
లేహ్ కేంద్ర పాలిత ప్రాంతం. కచ్చితంగా చూడాల్సిన ప్రాంతం. అయితే సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉన్నందున కాస్త ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల శ్వాస ఇబ్బందులు ఉన్న వారు ఇక్కడికి వెళ్లకపోవడమే మంచిది. పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది.
3 ఇడియట్స్ సినిమాలో చూసిన ప్యాంగాంగ్ లేక్ జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. ఇక్కడి నీరు రకరకాల రంగుల్లో కనిపిస్తోంది. ఈ లేక్ భారత, చైనా సరిహద్దులను కలుపుతోంది. అంటే ఈ లేక్ రెండు దేశాల్లోనూ విస్తరించి ఉంది.
లేహ్‌లో ముఖ్య పట్టణం లద్దాఖ్. ఇక్కడ పండే ఆప్రికాట్లు అమోఘమైన రుచి కలిగి ఉంటాయి. ఇంకా రకరకాల డ్రైఫ్రూట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నుబ్రా వ్యాలీ కూడా తప్పకచూడాల్సిన ప్రదేశం.
ప్యాకేజీలో భాగంగా మీరు ప్రయాణించే విమాన సర్వీసుల వివరాలు, షెడ్యూలు ఈ కింది విధంగా ఉంటుంది.
Flight Details: | |||||
---|---|---|---|---|---|
From | To | Flight No. | Departure | Arrival | |
Onward Journey | Hyderabad | Delhi | 6E 2011 | 07:05 Hrs | 09:15 Hrs |
Delhi | Leh | 6E 2797 | 10:45 Hrs | 12:30 Hrs | |
Return Journey | Leh | Delhi | 6E 2029 | 13:40 Hrs | 15:10 Hrs |
Delhi | Hyderabad | 6E 6823 | 18:00 Hrs | 20:10 Hrs |