Ice Apple health benefits: వేసవిలో తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. వేసవి తాపం నుంచి బయటపడేందుకు చల్లని పానీయాలు, చలువ చేసే పదార్థాలు తీసుకోవడం ఎంతో అవసరం. అలాంటి వాటిలో తాటిముంజులు ముఖ్యమైనవి.
తాటి ముంజల్లో విటమిన్స్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిని, బీ కాంప్లెక్స్ వంటి పోషకాలు, ఖనిజ లవణాలు ఉండి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలాగే తాటి ముంజల్లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉండటం వల్ల అవి వడదెబ్బ తగలకుండా శరీరాన్ని కాపాడుతాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా సంరక్షిస్తాయి. తాటి ముంజలతో ఉండే మరిన్ని ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
తాటి ముంజలతో ఉపయోగాలు
- సుమారు వంద గ్రాముల తాటిముంజుల్లో 43 గ్రాముల కేలరీలు ఉంటాయి. తాటి ముంజలు తినేటప్పుడుపై పొట్టు తీసేస్తారు. కానీ ఆ పొట్టులోనే అనేక రకాల పోషకాలు నిక్షిప్తమై ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
- మనిషి శరీరంలో ఉష్ణోగ్రతలను తగ్గించేలా జీవక్రియను బాగుపరుస్తుందని, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చిన్న పిల్లలకు, వృద్ధులకు తాటిముంజలు ఔషధంగా పనిచేస్తాయి.
- ముంజలూ వేసవిలో వచ్చే దాహార్తిని తగ్గిస్తాయి. తాటి ముంజల గుజ్జు కాలిన గాయాలు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలను పోగొడతాయి.
- వేసవిలో అందరూ ఎదుర్కునే సమస్య శరీరం అంతా పేలి పోవడం, చెమట కాయలు రావడం. అయితే ఒక్కసారి తాటి ముంజలతో ఆ గుజ్జుని శరీరం అంతా పట్టిస్తే కేవలం రెండు రోజుల్లో ఈ సమస్యలు మాయం అయిపోతాయి.
- అంతేకాదు వడదెబ్బ తగిలినప్పుడు ముంజలని జ్యూస్‌గా చేసి తాగిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్