Weekly horoscope: ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కుటుంబ సభ్యల అనారోగ్యంతో ఒత్తిడి

horoscope
ఈ వారం రాశి ఫలాలు Image by pexels

Weekly horoscope: ద్వాదశ రాశులకు ఈ వారం రాశి ఫలాలు ఇక్కడ చదవొచ్చు. మే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విభిన్న రాశుల వారికి వార ఫలాలు ఇక్కడ చదవండి.

ఈ వారం మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశి వారికి ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే నారింజ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోండి. ఆర్థిక విషయాల్లో ఈ వారం మెరుగ్గా ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆకస్మిక ధన లాభం పొందవచ్చు. శని పదకొండో ఇంట్లో ఉన్నందువల్ల మీరు పనిలో విజయం సాధిస్తారు. పనిలో ఒత్తిడి ఉండదు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల్లో విద్యాభ్యాసానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభ రాశి వార ఫలాలు

ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా, తేలికపాటి వ్యాయామాలతో పాటు పోషకాహారం తీసుకోవడంపై దృష్టిపెట్టండి. ఈ వారం ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చు పెరుగుతుంది. ఆఫీసులో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ శత్రువులు మీ శ్రేయోభిలాషులుగా మారుతారు. విద్యాభ్యాసం నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉండేందుకు మీరు శాంతియుతంగా ఉండాలి.

ఈ వారం మిథున రాశి ఫలాలు

గురు, రాహువులు పదకొండో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మిథున రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. పనికి రాని పనులకు దూరంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంటుంది. మీ కెరీర్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికి కష్టపడాలి. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు.

ఈ వారం కర్కాటక రాశి ఫలాలు

ఎనిమిదో ఇంట శని ఉండడం వల్ల మీరు అనారోగ్యానికి గురికావొచ్చు. ఆహారంపై నియంత్రణ అవసరం. యోగా, వ్యాయామం చేయడం మరవవద్దు. అప్పు అడిగే వారికి ఆమడ దూరం ఉండండి. మీ బంధువులు, మిత్రులు, సహోద్యోగులతో ఘర్షణ పడొచ్చు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. 

సింహ రాశి వార ఫలాలు

9వ ఇంట గురువు ఉండడం వల్ల సింహ రాశి వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులు శుభవార్త వింటారు. ఉద్యోగులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.

కన్యా రాశి వార ఫలాలు

ఈ వారం కన్యా రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. 8వ ఇంట గురు, రాహువులు ఉండడం వల్ల మీ పెట్టుబడులు నష్టపోవచ్చు. మిత్రులు, కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన బాగుండాలని సూచన. తప్పులను పునరావృతం చేయరాదు. పెద్లల సలహాలు మేలు చేస్తాయి.

ఈ వారం తులా రాశి ఫలాలు

తులా రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులతో సానుకూలంగా సంభాషిస్తారు. సామాజిక జీవితం మెరుగుపడుతుంది. పిల్లల చదువు కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలు గడిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ మీ వ్యాపారాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుంది. విద్యార్థులు విహార యాత్రల్లో జాగ్రత్తగా ఉండాలి.

వ‌ృశ్చిక రాశి వార ఫలాలు

వృశ్చిక రాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. గురువు ఆరో ఇంట్లో ఉన్నందున మీ స్నేహితుల రూపంలో మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. రుణాలు తిరిగి చెల్లించే స్థితికి వస్తారు. వ్యాపార రహస్యాలను కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించాల్సిన అవసరం లేదని సూచన. కార్యాలయంలో మీ శత్రువులు మీతో సానుకూలంగా ఉంటారు. 

ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు

గురువు ఐదో ఇంట్లో ఉండడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కుటుంబం పట్ల మక్కువతో ఉంటారు. వారితో ప్రేమగా ఉంటారు. వ్యాపారులు శుభవార్తలు వింటారు. భాగస్వామితో సానుకూలంగా వ్యవహరించాలి. విద్యార్థులు తగిన ప్రణాళికతో ముందుకు సాగాలి. 

ఈ వారం మకర రాశి ఫలాలు

హీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మీ నైపుణ్యాలకు సానబెడగతారు. సృజనాత్మక ఆలోచనలతో దూసుకెళతారు. విహార యాత్రలు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు ప్రేమ విషయాలకు దూరంగా ఉండాలి. 

కుంభ రాశి వార ఫలాలు

బలవర్థకమైన ఆహారం తినడంపై దృష్టిపెడతారు. యోగా, ధ్యానం, నడకలను కొనసాగిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ మీరు పనిలో ముందంజలో ఉంటారు. విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాలి. అందివచ్చిన సమయాన్ని వృథా చేసుకోరాదు.

ఈవారం మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. మనస్సు నిలకడగా ఉండదు. అయితే గురు బలం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆఫీసు పనులు, ఇంటి పనులతో కాస్త ఒత్తిడి ఎదురవుతుంది. విద్యార్థులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. 

Previous articleDiabetes effects on organs: డయాబెటిస్ ఉందా? అదుపులో లేకపోతే ఈ అవయవాలకు ముప్పు తప్పదు
Next articlefenugreek seeds water benefits: మెంతి గింజల నీటితో 5 అద్భుత ఉపయోగాలు.. షుగర్ ఉన్న వాళ్లు తాగాల్సిందే