అధిక రక్తపోటు (హైబీపీ) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ హైపర్‌టెన్షన్ సమస్యను పరిష్కరించడంలో పలు సహజమైన పద్ధతులు, జీవనశైలి మార్పులను అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా మార్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
1. తక్కువ సోడియం గల ఆహారం:
అధిక రక్తపోటును నియంత్రించడంలో సోడియం తగ్గించడం కీలకమైన దశ. మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో సోడియం రోజుకు 2,300 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి.
2. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు:
అరటిపండ్లు, నారింజలు, చిలగడదుంపలు, బచ్చలికూర వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం ప్రభావాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
3. ఆహార మార్పులు
హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తులు వినియోగించాలి. ఇవి ఉప్పు తీసుకోవడాన్ని పరిమితం చేస్తాయి.
4. రక్తపోటును తగ్గించడానికి వ్యాయామం
సాధారణ శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల మీ రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
5. బరువు నిర్వహణ – రక్తపోటు
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం లేదా అదనపు పౌండ్లను తగ్గించడం రక్తపోటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
6. ఒత్తిడి తగ్గించే పద్ధతులు
ఒత్తిడిని నిర్వహించడానికి లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది అధిక రక్తపోటుకు గణనీయమైన దోహదపడుతుంది.
7. ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం
మీరు ఆల్కహాల్ తీసుకునేవారైతే పరిమితం చేయండి. స్త్రీలైతే రోజుకు ఒక డ్రింక్, పురుషులైతే రోజుకు రెండు డ్రింక్స్ మించరాదు.
8. దూమపానం వదిలేయండి
ధూమపానం రక్తపోటును పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం మానేయడం రక్తపోటును నిర్వహించడంలో కీలకమైన దశ.
9. మూలికలు
మందార టీ, వెల్లుల్లి, అల్లం వంటి కొన్ని మూలికలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. మీరు ఇప్పటికే మందులు వాడుతున్నట్టయితే ఈ మూలికలు వాడే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
10. మీ రక్తపోటును పర్యవేక్షించండి
బ్లడ్ ప్రెజర్ మానిటర్ని ఉపయోగించి ఇంట్లో మీ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. మీకు, మీ డాక్టర్‌కు మీ బీపీ పరిస్థితిని ట్రాక్ చేయడంలో ఇది సహాయపడుతుంది.
జీవనశైలి మార్పులు, సహజ మార్గాలు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడినప్పటికీ.. మీకు హైబీపీ ఉన్నట్టయితే తప్పనిసరిగా నిత్యం వైద్యుడిని సంప్రదిస్తూ ఉండండి.