Conjunction: బుధుడు, కుజుడు, సూర్యుల కలయిక.. ఈ 4 రాశులకు శుభ ఫలాలు

zodiac signs
ఈవారం రాశి ఫలాలు (Pixabay)

Conjunction: బుధుడు, కుజుడు, సూర్యుల కలయిక వల్ల 4 రాశుల జాతకులకు అక్టోబరు 19 నుంచి కలిసొస్తుంది. ఈ మూడు గ్రహాలు తమ రాశులు మార్చుకుంటూ తులా రాశిలో కలుస్తారు. ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల 4 రాశుల భవితవ్యం బాగుంటుంది. అక్టోబరు 19 నుంచి ఏయే రాశులకు బాగుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి జాతకులు ఉత్సాహంగా పని చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లి నుంచి సహకారం లభిస్తుంది. తల్లి తరపు వారి నుంచి ధన సాయం అందుతుంది. స్నేహితులను కలుస్తారు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.

మిథున రాశి

వ్యాపార విస్తరణ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. సోదరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది.

తులా రాశి

మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి ఉద్యోగంలో చేరుతారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. సౌఖ్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శ్రమభారం ఉంటుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. పై అధికారులను మచ్చిక చేసుకుంటారు.

ధనుస్సు రాశి

స్వీయ నిగ్రహం అవసరం. ఉద్యోగంలో స్థానచలనం ఉండే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అధికారుల సహకారం లభిస్తుంది. వస్త్రాలు, నూతన వస్తువులపై ఖర్చు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని సూచన.

Previous articleరిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
Next articleHindu Baby Boy Names: హిందూ బేబీ బాయ్ నేమ్స్.. సరికొత్త పేర్లు ఇక్కడ తెలుసుకోండి