Onion Samosa Recipe: ఉల్లి సమోసాలు పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ ఇష్టపడి తింటారు. ఇవి క్రిస్పీగా, లోపల స్టఫ్‌తో ఎంతో టేస్టీగా ఉంటాయి. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ సమోసా, కార్న్ సమోసా, పనీర్ సమోసా, చికెన్ సమోసా, ఆలూ సమోసా ఇలా చాలా రకాల సమోసాలు బయట స్వీట్ షాపుల్లో తయారు చేసి అమ్ముతారు. ఇందులో ఉల్లిసమోసా తయారీ ఇప్పుడు తెలుసుకుందాం.
సమోసా తయారీకి కావలసిన పదార్థాలు:
- మైదాపిండి – ఒక కప్పు
- ఉల్లిపాయలు – పావుకిలో
- కారం – ఒక టీ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- పచ్చిమిర్చి – రెండు
- గరం మాసాలా – ఒక టీ స్పూన్
- నూనె – డీ ఫ్రైకి సరిపడా
ఉల్లి సమోస తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరగాలి. ఇలా తరిగిన ఉల్లిపాయలను గంటపాటు కాటన్ క్లాత్‌పై వేసి ఆరనివ్వాలి.
- ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కప్పు మైదాపిండి, కొద్దిగా ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి.
- సమోసా తయారీకి చపాతీ పిండి మాదిరిగానే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా ఉండే విధంగా మెత్తగా కలుపుకోవాలి.
- ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి.
- కొద్దిసేపటి తర్వాత పిండిని మరోసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు చపాతీ ఒత్తుకున్నట్టు కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి.
- ఇలా ఎన్ని ఉండలు చేశామో అన్ని కూడా పూరీల్లా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు సమోసాలో ఉల్లిపాయ స్టఫ్ పెట్టాలి కనుక దీని తయారీకి ముందుగా ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఒక పావు కప్పు మైదాపిండిలో కొన్ని నీళ్లు పోసుకొని చిక్కని పేస్ట్‌గా కలుపుకోవాలి.
- ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న చపాతీలను నాలుగు మూలలను కట్ చేసి స్క్వేర్ షేపులో చేసుకోవాలి. వీటిని ఆరిపోకుండా జాగ్రత్తగా ఏదైనా క్లాత్‌లొ చుట్టి పెట్టాలి.
- ఒక 5 నిమిషాల తర్వాత వాటిని బయటకు తీసి సమోసాలను కోన్ ఆకారంలో సిద్దం చేసుకోవాలి. అందులో తయారు చేసుకున్న ఉల్లిపాయ స్టఫ్‌ను పెట్టుకోవాలి.
- ఇప్పుడు సమోసా అంచులను తయారు చేసుకుని పెట్టుకున్న మైదా పేస్టుతో అతికించుకోవాలి.
- ఇలా మొత్తం అన్ని సమోసాలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఆపై స్టౌ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె వేడెక్కాక ఒక్కోక్కటిగా సమోసాలను వేసి మీడియం మంటపై వేగనివ్వాలి.
- ఇలా మంచి రంగు వచ్చేవరకూ వేగనిచ్చి ఆపై ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
అంతే ఎంతో టేస్టీగా, క్రంచీగా ఉండే ఈ సమోసాలు రెడీ అయిపోయాయి. ఇంత సింపుల్‌గా అయిపోయే సమోసాలను మీరు కూడా ఇంట్లోనే అప్పుడుప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీతో అదిరిపోతుంది.
- లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్