Operation Valentine OTT: ఆపరేషన్ వాలంటైన్ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. రీసెంట్గా మార్చి 1న థియేటర్లో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ విడుదల అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా సర్ప్రైజ్గా ఓటీటీలోకి రావడాన్ని హాట్ టాపిక్‌గా చెప్పుకోవచ్చు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ఓటీటీలోకి అడుగుపెట్టేసింది.
వరుణ్‌తేజ్ హీరోగా, మానుషీ చిల్లర్ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. వరుణ్‌తేజ్ అభిమానులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ యాక్షన్ డ్రామా చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీని థియేటర్లో చూడలేని వారు ఓటీటీలో చూసేయొచ్చు.
అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే… ఈ సినిమాను చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా అదనంగా 279 రూపాయలు చెల్లించాలట. థియేటర్లలో రిలీజై కేవలం 20 రోజులే అయినందున ఈ రుసుం చెల్లించకతప్పదంటోంది.
ఆపరేషన్ వాలంటైన్ కథ ఇదే
అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర (వరుణ్‌తేజ్) పుల్వామా అటాక్, బాలాకోట్ వైమానిక దాడుల అధారంగా ఈ చిత్రం సాగుతుంది. భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్. ధైర్య సాహసాలతో ఏం జరిగినా పర్వాలేదు అన్నట్టు అడుగు ముందుకు వేస్తాడు. ఆ దళంలోనే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్ (మానుషి చిల్లర్) ను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఓ చేదు అనుభవాన్ని ఎదర్కోవలసి వస్తుంది.
ప్రాజెక్ట్ వజ్ర కోసం పని చేస్తున్న సమయంలో ఈ సమస్య ఎదురవుతుంది. ఈ క్రమంలో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆ ఆపరేషన్ వెనక నడిచిన కథేంటి? అసలు ఆ ప్రాజెక్ట్ వజ్ర ఏంటి? దాని లక్ష్యాలేంటి? ఇలా మరెన్నో అంశాలతో ముడిపడి ఈ చిత్రం తెరకెక్కింది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్