OTT New Releases: ఓటీటీలో లేటెస్ట్ రిలీజెస్.. తెలుగు సినిమాల నుంచి హిందీ వెబ్ సిరీస్‌ల వరకు..

khupiya
నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తున్న ఖూఫియా

OTT New Releases: ఓటీటీలో ఈ ఆదివారం చూసేందుకు కొత్త తెలుగు సినిమాలు, అనేక కొత్త వెబ్‌సిరీస్ రిలీజెస్ అందుబాటులో ఉన్నాయి. తెలుగులో అయితే మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి వంటి క్రేజీ చిత్రం నుంచి హిందీలో ఖూఫియా వరకు పలు చిత్రాలు ఈ ఆదివారం మిమ్మల్ని అలరించనున్నాయి. ఇప్పటికే గత వారంలో విడుదలైన ఖుషీ మూవీ చూసే ఉంటారు. ఈవారం ఓటీటీలో చూడదగిన చిత్రాల జాబితా ఇక్కడ మీకోసం..

మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి మొన్న అక్టోబరు 5న విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. మంచి క్రేజ్ సంపాదించుకుంది. మాస్టర్ ఛెఫ్‌గా పని చేసే అనుష్క శెట్టి తన తల్లి మరణానంతరం తోడు కోసం పిల్లల్ని కనాలనుకుంటుంది. ఇందుకోసం తాను చేసిన ప్రయత్నాల చుట్టూ తిరిగే కథ ఈ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ. మధ్యలో కొంత బోరింగ్ అనిపించినా, చూడదగిన మూవీ.

ఖూఫియా

నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబరు 5న రిలీజైన ఈ మూవీలో ప్రధాన పాత్ర టబుది. రీసెర్చ్ అనాలసిస్ వింగ్ అధికారిగా టబు అద్భుతమైన పాత్ర పోషించారు. మన దేశానికి విదేశీ శక్తులతో ఉన్న ముప్పును తొలగించడం ఇతివృత్తంగా ఉన్న ఈ మూవీ ఎక్కడా బోర్ కొట్టించదు. పిల్లలతో కలిసి చూడలేం. కొన్ని సీన్లు పెద్దలకు మాత్రమే.

గదర్ 2

కలెక్షన్స్ లో రికార్డులు తిరగరాసిని గదర్ 2 మూవీ జీ 5 ఓటీటీలో అక్టోబరు 6న విడుదలైంది. సన్నీడియోల్, అమీషాపాటిల్ ప్రధాన పాత్రధారులు. తప్పక చూడాల్సిన మూవీ.

మిస్టర్ ప్రెగ్నెంట్

సొహైల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో అక్టోబరు 6న రిలీజైంది. పురుషుడికి ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది.

ఓటీటీలో మరిన్ని ముఖ్యమైన షోలు

నెట్‌ఫ్లిక్స్ రిలీజెస్ – వెబ్ సిరీస్

  1. ఎవ్రీథింగ్ నో – అక్టోబరు 5 విడుదల
  2. బెకమ్ – అక్టోబరు 4 విడుదల
  3. స్ట్రాంగ్ గర్ల్ – అక్టోబరు 7 విడుదల

నెట్‌ఫ్లిక్స్ మూవీ రిలీజెస్

  1. ఖూఫియా – అక్టోబరు 5 విడుదల
  2. లుపిన్ పార్ట్ 3 – అక్టోబరు 5 విడుదల
  3. ఎ డెడ్లీ ఇన్విటేషన్ – అక్టోబరు 6 విడుదల

అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్

  1. ముంబై డైరీస్ సీజన్ 2: అక్టోబర్ 6 విడుదల: ముంబై వరదల ఇతివృత్తం
  2. డెస్పరేట్ సీకింగ్ సోల్‌మేట్: అక్టోబరు 6 విడుదల

అమెజాన్ ప్రైమ్ మూవీస్

  1. మిస్టర్ ప్రెగ్నెంట్ – అక్టోబరు 6 విడుదల
  2. టోటల్లీ కిల్లర్ – అక్టోబరు 6 విడుదల
Previous articleWeekly Horoscope: అక్టోబర్ 9 -15 రాశి ఫలాలు.. ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి
Next articleHealthy Drinks for Diabetes: డయాబెటిస్ ఉన్న వారికి ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఇవే