Healthy Drinks for Diabetes: డయాబెటిస్ ఉన్న వారికి ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఇవే

diabetes, blood sugar, diabetic
డయాబెటిస్ అదుపులో ఉండాలంటే తీసుకోవాల్సిన పండ్ల రసాలు Photo by stevepb on Pixabay

Healthy Drinks for Diabetes: డయాబెటిస్ పేషెంట్లు హెల్తీ జ్యూసెస్ ద్వారా తమ రక్తంలో గ్లూకోజు స్థాయిను అదుపులో ఉంచుకోవచ్చు. తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవడం ద్వారా తమ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. మధుమేహం కోసం జ్యూసెస్ ఎంచుకోవాల్సి వస్తే షుగర్, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా ఎంచుకోవడం చాలా అవసరం. మధుమేహం ఉన్నవారికి తగిన ఆరోగ్యకరమైన జ్యూస్ ఆప్షన్స్ ఇక్కడ చూడొచ్చు.

1. గ్రీన్ వెజిటబుల్ జ్యూస్:

కాలే, బచ్చలికూర, దోసకాయ, సెలెరీ, బ్రోకలీ వంటి కూరగాయలతో చేసిన గ్రీన్ జ్యూస్‌లు అద్భుతమైన ఆప్షన్ ఈ కూరగాయలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వాటిలో అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

2. టొమాటో జ్యూస్:

టొమాటోలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియంతో సహా విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరు. సోడియం తీసుకోవడం అదుపులో ఉంచుకోవడానికి తక్కువ సోడియం గల టమోటా రసాన్ని ఎంచుకోండి.

3. దోసకాయ, నిమ్మకాయ రసం:

ఇది రిఫ్రెష్ జ్యూస్. కార్బొహైడ్రేట్లు చాలా తక్కువ. దోసకాయలను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి, కాసిన్ని నీళ్లు పోసి, నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలపండి. మీరు అదనపు తాజాదనం కోసం పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు.

4. బెర్రీస్ స్మూతీ:

పండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అరటిపండ్లు లేదా సపోటా వంటి పండ్లతో పోలిస్తే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. రుచికరమైన, తక్కువ కార్బొహైడ్రేట్లు కలిగిన స్మూతీ కోసం వీటిని తియ్యని బాదం పాలు లేదా గ్రీక్ పెరుగు (తీపి లేని)తో కలపండి. బెర్రీస్ స్మూతీ ఎంజాయ్ చేయండి.

5. క్యారెట్ – అల్లం రసం:

క్యారెట్లు సహజంగా తీపిగా ఉంటాయి. వీటిని మితంగా వాడుకోవాలి. క్యారట్ జ్యూస్ లో  కొద్దిగా అల్లం వేసుకోవాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్‌ను అదుపులో ఉంచడానికి క్యారెట్లను తక్కువ పరిమాణంలో ఉపయోగించండి.

6. పాలకూర – యాపిల్ జ్యూస్:

పాలకూరలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. యాపిల్స్ తీపి రుచిని అందిస్తాయి. చిన్న మొత్తంలో యాపిల్ ఉపయోగించి పాలకూర – యాపిల్ జ్యూస్ తయారు చేసి ఎంజాయ్ చేయండి.

7. కాకర కాయ జ్యూస్:

కాకర కాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు సహాయపడే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది చేదు రుచిని కలిగి ఉన్నప్పటికీ, నిమ్మకాయ లేదా దోసకాయ రసం యాడ్ చేస్తే కాస్త చేదు తగ్గుతుంది.

డయాబెటిస్ ఉన్నప్పుడు షుగర్ స్థాయిపై ఆందోళన ఉండడం సహజం. ఏది తినాలన్నా, తాగాలన్నా మనసులో అనేక సందేహాలు వెల్లువెత్తుతాయి. మీరు కొత్త జ్యూసులు, ఆహార పదార్థాలు తీసుకునే ముందు మితంగా తీసుకోవడం వల్ల అది మీ శరీరానికి నప్పుతుందో లేదో పరీక్షించవచ్చు. ఆ తరువాత దానిని క్రమంగా తీసుకోవచ్చు.

Previous articleOTT New Releases: ఓటీటీలో లేటెస్ట్ రిలీజెస్.. తెలుగు సినిమాల నుంచి హిందీ వెబ్ సిరీస్‌ల వరకు..
Next articleFatty Liver Disease diet: ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే ఏం తినాలి? ఏం తినకూడదు?