ఈ టూల్స్ ఉంటే మీ డిజిటల్ వర్క్ సులువు

digital tools
Photo by Firmbee.com on Unsplash

పీడీఎఫ్ నుంచి వర్డ్‌కు మార్చాలన్నా, వర్డ్‌ నుంచి పీడీఎఫ్‌కు మార్చాలన్నా, పీడీఎఫ్‌ మెర్జ్‌ చేయాలన్నా, పీడీఎఫ్‌ నుంచి జేపీజీ మార్చాలన్నా.. ఏం చేయాలో తెలియక ఒక్కోసారి చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది.

అలాగే ఫాంట్‌ కన్వర్ట్‌ చేయడం, ఇమేజ్‌ కన్వర్ట్‌ చేయడం, డాక్యుమెంట్‌ కన్వర్ట్‌ చేయడం అవసరం రావొచ్చు. దీని వల్ల మన పని సులువయ్యేందుకు అవకాశం ఉంటుంది.

వీటన్నింటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో చాలా టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో 123యాప్స్‌ డాట్‌ కామ్‌ ఒకటి.

ఇందులో వీడియో టూల్స్‌, ఆడియో టూల్స్‌, పీడీఎఫ్‌ టూల్స్‌, కన్వర్టర్స్‌, యుటిలిటీస్‌ పేరుతో నాలుగు సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

వీడియో ట్రిమ్, క్రాప్‌, రొటేట్‌, వీడియో రీసైజ్‌, వాల్యూమ్‌ పెంచడం, స్పీడ్‌ పెంచడం, లోగో రిమూవ్‌ చేయడం, టెక్స్ట్‌ యాడ్‌ చేయడం, వీడియో రికార్డర్‌ వంటి అనేక అవసరాలకు 123 యాప్స్ వెబ్ సైట్లోని వీడియో టూల్స్‌ ఉపయోగపడుతాయి. ఈ వెబ్ సైట్ అన్ని రకాల డిజిటల్ అవసరాలను తీరుస్తుంది.

అలాగే ఆడియో టూల్స్‌ లోనూ ఇలాంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇక కన్వర్టర్స్‌ లో కూడా ఈ బుక్‌ కన్వర్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డిజిటల్‌ క్రియేటర్లకు, యూట్యూబర్లకు, వెబ్‌ సైట్‌ అవసరాలకు ఈ వెబ్‌ సైట్‌ చాలా ఉపయోగపడుతుంది.

Previous articlemuthyala dhara waterfalls: ముత్యాల ధార జలపాతం .. తెలంగాణ టూరిజంలో ఓ ఆణిముత్యం
Next articleకళారాః కళాత్మక వస్తువులు అంతర్జాతీయ మార్కెట్‌కు