ఈ వారం థియేట‌ర్, ఓటీటీలలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

familystar poster
ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్

ఈ వీకెండ్‌ థియేటర్లు, ఓటీటీలలో కొత్త సినిమాల సందడి బాగానే ఉంది. దాదాపు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయ‌డానికి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్, కామెడి క‌థాంశాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. చ‌ల్ల‌ని వినోదాల వెల్లువ‌ను పంచనున్నాయి. ప్ర‌స్తుతం థియేట‌ర్ల సినిమాల్లో ట్రెండింగ్‌గా ఉన్నది విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఫ్యామిలీ స్టార్.

ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. విజ‌య్ దేవ‌ర‌కొండ, మృణాల్ ఠాకూర్ న‌టీన‌టులుగా రొమాంటిక్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్ డ్రామా క‌థాంశంతో దిల్‌రాజు నిర్మాత‌గా ఈ సినిమా ఏప్రిల్ 5న  ఆడియ‌న్స్‌ను అల‌రించ‌డానికి సిద్దంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. గీతాగోవిందంతో మంచి ప్ర‌శంస‌లు అందుకున్న రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను మ‌రోసారి ఆక‌ట్టుకోనుందనే అంచనాలు ఉన్నాయి. అంచ‌నాల‌కు మించి ఉంటుంద‌ని విజ‌య్ పాత్ర‌ని దర్శకుడు అంత అందంగా తీర్చిదిద్ద‌డం ప్రేక్ష‌కుల‌ను ఖ‌చ్చితంగా అల‌రిస్తుందని చిత్ర టీమ్ మొత్తం ధీమా వ్వ‌క్తం చేస్తోంది. ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల అవుతోంది.

ఏప్రిల్ 5న మ‌రో సినిమా విడుదల కాబోతోంది. క్రైమ్, కామెడీ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం భ‌ర‌త‌నాట్యం. ఈ చిత్రం కేవీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో పాయ‌ల్ స‌రాఫ్ నిర్మించారు. క‌థానాయ‌కుడిగా సూర్య‌తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంట‌గా న‌టించ‌నున్నారు. ఇందులో వైవా హ‌ర్ష‌, అజ‌య్ ఘోష్, ఫేకు త‌దిత‌రులు కీల‌క పాత్రలు పోషించారు. 

ఏప్రిల్ 6 న విడుద‌ల అయ్యే సినిమా బ‌హుముఖం. ఇది స‌స్పెన్స్ థ్రిల్లర్‌గా తెర‌కెక్క‌నుంది. అదే రోజున రిలీజ్ అయ్యే మ‌రొక సూప‌ర్ హిట్ మ‌ల‌యాళీ చిత్రం మంజుమ్మ‌ల్‌ బాయ్స్. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మళయాల ఇండ‌స్టీలో మంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. దీనిని తెలుగులో  రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్దం అయ్యింది. అదే రోజున సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన ప్రాజెక్ట్ -జెడ్ విడుదల కానుంది. సందీప్ కిష‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న సినిమా ఏప్రిల్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌లో రిలీజ్‌కు సిద్దంగా ఉన్న మూవీస్

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో:

మ్యూజికా (హాలీవుడ్) – ఏప్రిల్  4, 2024

యే మేరీ ఫ్యామిలీ – సీజన్ 3 (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 4

హౌ టు డేట్ బిల్లీ వాల్ష్ (హాలీవుడ్) – ఏప్రిల్ 5

నెట్‌ఫ్లిక్స్:

టు గెద‌ర్(వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 2

రిప్లే (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 4 

పారాసైట్ – ది గ్రే (కొరియ‌న్ సిరీస్) – ఏప్రిల్ 5

స్కూప్ (హాలీవుడ్) – ఏప్రిల్ 5

ఫైల్స్ ఆఫ్ ది అన్ఎక్స్‌ప్లైన్డ్ (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 3

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్:

లంబ‌సింగి – ఏప్రిల్ 2

భీమా – ఏప్రిల్ 5

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఎయిర్ పోర్టులో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. 10 పాసైన వారు కూడా దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
Next articleఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రేజ్ వర్కవుట్ అయిందా