ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రేజ్ వర్కవుట్ అయిందా

family star review
ఫ్యామిలీ స్టార్ రివ్యూ

ఫ్యామిలీ స్టార్ విజ‌య్ దేవ‌రకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ జంట‌గా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం. ఈ చిత్రం ఈ రోజు (ఏప్రిల్ 5) థియేట‌ర్స్‌లోకి వ‌చ్చేసింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర  క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్ ఎంతో ఆస‌క్తిని రేకెత్తించి ఆడియ‌న్స్‌లో భారీ అంచ‌నాల‌ను పెంచేశాయి. మ‌రి ఆ అంచ‌నాల‌కు మేర‌కు సినిమా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందా? 

గీత‌గోవిందంతో ఆడియ‌న్స్‌ను మెప్పించిన హీరో విజయ్ దేవరకొండ, ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఫ్యామిలీ స్టార్ ఏమేరకు ప్రేక్షకులను మెప్పించిందో ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్వూలో చూద్దాం.

ఫ్యామిలీ స్టార్ క‌థ

మిడిల్ క్లాస్ అబ్బాయిగా గోవర్దన్ (విజ‌య్ దేవ‌ర‌కొండ) కుటుంబ బాధ్య‌త‌ను మోస్తూ ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటాడు. ఆ టైంలో ఇందూ (మృణాల్ ఠాకూర్) గోవర్దన్ ఇంట్లో అద్దెకు దిగుతుంది. ఒక‌రితో ఒక‌రికి ప‌రిచ‌యం ఏర్ప‌డి చివ‌రికి హీరో ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు.

కానీ ఇందూది ప్రేమ కాదు ప‌గ అని గోవర్దన్ త‌ర్వాత తెలుసుకుంటాడు. అయితే అది తెలుసుకున్న విజ‌య్ ఏం చేస్తాడు? కుటుంబంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఎలా ఎదుర్కొంటాడు? కుటుంబ బాధ్య‌త‌లు, ప్రేమ వీట‌న్నింటిని ఎలా డీల్ చేస్తాడు అనేదే త‌ర్వాత క‌థ‌.

ఎవరు ఎలా చేశారు?

విజ‌య్ దేవ‌ర‌కొండ, మృణాల్ ఠాకూర్ వీళ్లిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఆడియ‌న్స్‌ను బాగానే ఆకట్టుకున్నా, గీతాగోవిందం తరహాలో అలరించలేదు. ఇక సీతారామం, హాయ్ నాన్నలో అలరించిన మృణాల్ ఠాకూర్ కథలో బలం లేకపోవడంతో తేలిపోయింది. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీతో ఫ‌న్నీగా సాగుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వారి ఆశలు, ఆకాంక్షలు, వాస్తవాల మధ్య పోరు ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి బాగా క‌నెక్ట్ అయ్యేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి అబ్బాయి కుటుంబంలో క‌ష్టాల‌ను, కుటుంబ విలువలు తెలిపే సందేశాత్మ‌క స‌న్నివేశాలు ఆడియ‌న్స్‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. 

ఫ్యామిలీ స్టార్ సినిమాకు విజ‌య్ న‌ట‌న బాగున్నా కథలో బలం లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. ఈ సినిమాకు గోపి సుంద‌ర్ అందించిన సంగీతం, పాట‌లు ఇంక సినిమాటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి ఫ్ల‌స్ పాయింట్ అయింది. ఇక వెన్నెల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ మూవీలో కొన్ని బోరింగ్ సీన్లు, స్టోరీ, కొన్ని పాటలు, అక్క‌డ‌క్క‌డ స‌న్నివేశాల‌ను సాగ‌దీయ‌డం సినిమాకు మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు. మొత్తానికి ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల‌ను అంతంత‌మాత్రంగానే అల‌రిస్తుందని చెప్పొచ్చు. అయితే వేసవి సెలవుల్లో కుటుంబ కథా చిత్రంగా వసూళ్లకు మంచి ఆస్కారం ఉన్న చిత్రంగా నిలుస్తుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఈ వారం థియేట‌ర్, ఓటీటీలలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
Next articleఈ వారం ఓటీటీలోకి టాప్ 5 సినిమాలు.. అస్స‌లు మిస్ అవ్వొద్దు