వి మూవీ రివ్యూ : మెప్పించిన నాని

v movie review
Image Source: Instagram
[yasr_overall_rating size=”–” postid=”2371″]

ఓటీటీ ద్వారా నేరుగా విడుదలైన భారీ చిత్రం వి మూవీ. చాలా రోజులుగా హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ సెప్టెంబరు 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. యాక్షన్, సస్పెన్స్, డ్రామా జానర్‌లో మోహన కృష్ణ ఇంద్రగంటి అందించిన ఈ వి మూవీ ఆకట్టుకుందా లేదా చూద్దాం.

మూవీ : వి
రేటింగ్‌ : 3/5
నటీనటులు : నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌
నిర్మాణం : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
మెచ్యూరిటీ రేటింగ్ : 16 ప్లస్‌

వి కథ :

ఆదిత్య (సుధీర్‌ బాబు) సౌత్‌జోన్‌ డీసీపీ. టప్పాచబూత్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మతకలహాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకుని అల్లరి మూకను మట్టుపెడతాడు. ఒక్కరాత్రిలో హీరో అయిపోతాడు. గ్యాలంటరీ మెడల్‌ అందుకుంటాడు.

ఆదిత్య ఈమెడల్‌ అందుకున్న రోజు అదే ప్రాంతంలోని సీఐ ప్రసాద్‌ హత్యకు గురవుతాడు. ప్రసాద్‌ నుదుటిపై డీసీపీ ఆదిత్య నాకు కావాలంటూ రాసిన ఓ కాగితం అంటించి హంతకుడు వి (నాని) సవాలు విసురుతాడు. అంతేకాకుండా ఫోన్‌ చేసి మరో నలుగురినీ చంపుతానంటాడు. చంపిన ప్రతిచోట క్లూ ఇస్తూ పట్టుకో చూద్దాం అంటూ సవాలు విసురుతాడు. హంతకుడు ఇచ్చిన పొడుపు కథల ఆధారంగా డీసీపీ వి ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ వెంట్రుకవాసిలో మిస్‌ అవుతుంటాడు.

హంతకుడు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ హత్యలు చేస్తున్నాడని గ్రహించిన డీసీపీ ఆదిత్య .. వి ప్రతీకారానికి కారణాలు కనుక్కుంటాడు. చివరకు హంతకుడు విసిరిన సవాలులో నెగ్గిందెవరు? వి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? వి దొరుకుతాడా? అనేదే కథలో క్లైమాక్స్‌.

పాత కథే అయినా.. ఆకట్టుకున్న వి

ప్రతీకారం ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవస్థల్లోని అక్రమాలను అంతర్లీనంగా చూపుతూ.. వాటి పర్యవసనాల వల్ల ఎంతమంది బలవుతున్నారో దర్శకుడు చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. హంతకుడు ఎవరన్నది ముందే తెలిసిపోతుంది.. ఎందుకు చంపుతున్నాడన్నది కూడా తెలిసిపోతుంది. దీంతో క్లైమాక్స్‌ ముందే ఊహించవచ్చు. అందువల్ల ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్న గ్రిప్పింగ్‌ సెకెండ్‌ హాఫ్‌ వరకు కొనసాగదు. ఇంకాస్త సస్పెన్స్, ట్విస్టులు ఉంటే బాగుండేది. అయినప్పటికీ మూవీని ఎంజాయ్‌ చేయొచ్చు.

విశ్లేషణ :

వి మూవీలో నాని, సుధీర్‌బాబుల నటన బాగుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు పోటీపడి నటించారు. సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న నాని.. ఈచిత్రంలో డైలాగ్‌ డెలివరీతో మరిన్ని మార్కులు సాధించాడు. నివేదా థామస్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్‌ డైలాగులు ఆకట్టుకుంటాయి. ఎస్‌.ఎస్‌.థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది.

Previous articleవర్క్‌ ఫ్రమ్‌ టూరిజం స్పాట్‌ .. మధ్యప్రదేశ్‌ కొత్త కాన్సెప్ట్‌
Next articleఆన్​ లైన్​ లో ఎల్ఆర్ఎస్​ సేవలు ప్రారంభం