వైరస్‌లు, బ్యాక్టీరియా లేకుండా కూరగాయలు వాష్ చేసేందుకు మార్కెట్లో అనేక ద్రావణాలు అందుబాటులోకి వచ్చాయి. ఏది ముట్టుకున్నా సానిటైజర్‌తోనో, హాండ్ వాష్‌తోనో చేతులు శుభ్రం చేసుకుంటున్నా… కూరగాయల దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది ఎదురవుతోంది.
చాలా మంది వేడి నీళ్లలో వేసి కడిగి ఆరబెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుని వాడుకుంటున్నారు. అయితే వెజిటేబుల్ క్లీనర్స్ కూడా ఒకసారి వాడి చూస్తే వాటి వల్ల ఉపయోగం ఉంటే కొనసాగించవచ్చు.
వెజ్‌టేబుల్ క్లీనర్లు మార్కెట్లో చాలావరకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో పారాష్యూట్ కొబ్బరి నూనె తయారు చేసే మారికో కంపెనీ ‘వెజ్జీక్లీన్’ ను అందుబాటులోకి తెచ్చింది. 400 మిల్లీలీటర్ల ద్రావణం గల బాటిల్ ధర అమెజాన్ లో రూ. 190గా ఉంది. కంపెనీ ఇచ్చిన సూచన ప్రకారం.. రెండు లీటర్ల నీటిలో కూరగాయలు, ఒక క్యాప్ (మూత) ద్రావణాన్ని వేసి 5 నిమిషాలు ఆగాలి. ఆ తరువాత బాగా కడగాలి. ఆ తరువాత టాప్ వాటర్ కింద మరోసారి కడగాలి. పాకెట్ తో వచ్చే సూచనలు పాటిస్తే మంచింది.
ప్రముఖ ఆయుర్వేద ఔషధ కంపెనీ డాబర్ ‘వెజ్జీ వాష్’ను అందుబాటులోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల ద్రావణం ధర రూ. 179లకు అమెజాన్‌లో దొరుకుతోంది.
ఇంకా నేచురిజ్ కంపెనీ ఆల్ నేచురల్ వెజ్జీ ఫ్రూట్ అండ్ బేబీ టాయ్స్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఇంకా క్యూరా, సాఫూ తదితర కంపెనీలు కూడా వెజిటేబుల్ వాష్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ ఉత్పత్తి అయినా వాటి సూచనలకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు కడిగితే మెరుగైన ఫలితం ఉంటుంది.
ఓజోనైజర్లు కూడా అందుబాటులోకి..
వెజిటేబుల్స్ వాష్ చేసేందుకు మరో ప్రక్రియ ఓజోనైజేషన్. ఇందుకు మార్కెట్లో అనేక ఓజోనైజర్లు అందుబాటులో ఉన్నాయి. అల్ట్రావయోలెట్, ఓజోనైజేషన్ ప్రక్రియల ద్వారా కూడా కూరగాయలను బ్యాక్టీరియా, వైరస్ లేకుండా శుద్ధి చేయవచ్చు.
ప్రెస్టీజ్ కంపెనీ క్లీన్ హోమ్ ఓజోనైజర్ పేరుతో అందిస్తోంది. దీని ధర అమెజాన్‌లో రూ. 3,385గా ఉంది.
కెంట్ ఓజోన్ ప్లాస్టిక్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ ప్యూరిఫయర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ. 6,199గా ఉంది.
ఇంకా అనేక రకాల వెజిటేబుల్ ఫ్యూరిఫయర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ డిస్‌ఇన్ఫెక్టెంట్ పేరుతో కెంట్ మరొక రకమైన పరికరాన్ని అందిస్తోంది. దీని ధర అమెజాన్‌లో రూ. 5,890గా ఉంది.
కరోనా భయపెడుతున్న ఈరోజుల్లో అందరం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెజిటేబుల్స్ వాష్ కోసం లిక్విడ్ ను కూడా అందుబాటులో పెట్టుకుంటే వాటి ద్వారా కలిగే భయం కూడా పోతుందోమో.. ట్రై చేయండి.