పాపులర్ సోషల్ మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ను మించింది లేదు. ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్‌కూ ఓ వాట్సాప్ అకౌంట్ ఉంది. జియో ఫోన్ పుణ్యమాని.. సాధారణ ఫీచర్ ఫోన్ వాడే వాళ్ల దగ్గరికి కూడా ఈ వాట్సాప్ చేరింది. ఇక యూత్ అయితే ఈ వాట్సాప్‌కు బానిసలైపోయారు. నిమిషానికోసారి తమ మొబైల్ చూసుకుంటున్నారంటే దానికి కారణం ఈ వాట్సాపే. పర్సనల్ చాట్స్, గ్రూప్ చాట్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే వాట్సాప్‌ను ఇంతలా వాడుతున్నా.. కొంత మందికి వాట్సాప్ సీక్రెట్ ఫీచర్స్ ఇప్పటికీ తెలియదు. మెసేజ్‌లు పంపడం, వచ్చిన మెసేజ్‌లను చదవడం తప్ప.. చాలా మంది ఇందులోని ఫీచర్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. అలాంటి వాళ్ల కోసమే ఈ ఆర్టికల్. వాట్సాప్‌లోని ఈ సీక్రెట్ ఫీచర్స్‌ను తెలుసుకోండి.. ఈ యాప్‌లోని ఫన్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయండి.
టెక్ట్స్‌ను ఫార్మాట్ చేసుకోండి
ప్రతి రోజూ వాట్సాప్‌లో మెసేజ్‌లు టైప్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ మీరు పంపే టెక్ట్స్‌ను ఫార్మాట్ చేయొచ్చని మీకు తెలుసా? అంటే టెక్ట్స్‌ను బోల్డ్‌గా లేక ఇటాలిక్స్‌గా మార్చుకోవడం, లేదంటే రాసిన టెక్ట్స్‌ను కొట్టేయడంలాంటివి చేయొచ్చు.
♦ బోల్డ్‌గా మార్చాలని అనుకుంటే.. మీరు టైప్ చేసిన టెక్ట్స్‌కు ముందు వెనుక ‘*’ను యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ మెసేజ్‌ను సెండ్ చేస్తే.. మీ ఫ్రెండ్‌కు అది బోల్డ్ లెటర్స్‌లో కనిపిస్తుంది.
♦ మీ టెక్ట్స్‌ను ఇటాలిక్స్‌లోకి మార్చాలని అనుకుంటున్నారా? అయితే మీరు టైప్ చేసే టెక్ట్స్‌కు ముందు, వెనుక ‘_’ (అండర్‌స్కోర్) సింబల్‌ను యాడ్ చేస్తే సరిపోతుంది.
♦ ఇక మీరు పంపే టెక్ట్స్‌ను కొట్టేయాలని అనుకుంటే.. ‘~’ సింబల్‌ను ఆ టెక్ట్స్‌కు ముందు, వెనుక యాడ్ చేయాలి. మీ ఫ్రెండ్‌కు ఆ మెసేజ్.. కొట్టేసినట్లుగా కనిపిస్తుంది.
జిఫ్స్‌ను క్రియేట్ చేయొచ్చు
వాట్సాప్‌లో ఈ మధ్య కొత్త కొత్త ఫీచర్లు చాలానే వచ్చి చేరాయి. వివిధ డాక్యుమెంట్లు అంటే.. పీడీఎఫ్, డాక్, పీపీటెక్ట్‌లాంటి వాటిని పంపడానికి.. జిఫ్స్ లేదా మీ ప్రస్తుత లొకేషన్‌ను షేర్ చేసే ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ అటాచ్‌మెంట్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీకు కనిపిస్తాయి. ఇక అన్నింటికంటే ఆసక్తి కలిగించేది ఏంటంటే.. మీరు జిఫ్స్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఆరు సెకన్లు లేదా అంతకు తక్కువ వ్యవధి వీడియో రికార్డు చేయాలి. వీటికి వాట్సాప్ ఆటోమెటిగ్గా ట్రిమ్ క్లిప్ ఆప్షన్ ఇస్తుంది. ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్‌కు వెళ్లి ఫార్మాట్‌ను వీడియో నుంచి జిఫ్‌కు మార్చుకోవచ్చు.
ఫ్రెండ్ వాట్సాప్‌పై నిఘా పెట్టొచ్చు
సరదాగా మీ ఫ్రెండ్ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాక్ చేయాలని అనుకుంటున్నారా? లేదంటే ఆ అకౌంట్‌పై నిఘా పెట్టాలని అనుకుంటున్నారా? దీనికీ ఓ ట్రిక్ ఉంది. సింపుల్‌గా ముందు మీ ఫోన్‌లోని వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. మీ ఫ్రెండ్ ఫోన్ మ్యాక్ అడ్రెస్ తెలుసుకోండి. సెట్టింగ్స్‌లోని అబౌట్ ఫోన్ ఆప్షన్‌లో ఉన్న స్టేటస్‌లోకి వెళ్తే వైఫై మ్యాక్ అడ్రెస్ తెలుస్తుంది. ఆ అడ్రెస్‌ను రాసుకోండి. స్పూఫింగ్ మ్యాక్ ద్వారా మీ ఫోన్ మ్యాక్ అడ్రెస్ మార్చుకోవచ్చు. ఈ మ్యాక్ అడ్రెస్ మార్చుకోవడానికి వివిధ పద్ధతులు ఉంటాయి. ముందు వాటిని తెలుసుకోండి. ఇక అడ్రెస్ మార్చిన తర్వాత వాట్సాప్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్‌కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే.. అదే వాట్సాప్ అకౌంట్ మీ ఫోన్లోనూ ఉంటుంది. అప్పుడు మీ ఫ్రెండ్ వాట్సాప్‌ను మీరూ ఎప్పటికప్పుడు ఫాలో కావచ్చు.
ఎవరూ హ్యాక్ చేయకూడదు అంటే..
మీ ఫ్రెండ్ వాట్సాప్ అకౌంట్‌ను ఎలా హ్యాక్ చేయొచ్చో తెలుసుకున్నారు. మరి మీ వాట్సాప్ అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? దీనికీ ఓ సింపుల్ ట్రిక్ ఉంది. మీ వాట్సాప్ అకౌంట్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా మీ అకౌంట్‌ను హ్యాక్ చేయాలన్నా.. మీ చాట్ రికార్డులు చోరీ చేయాలన్నా.. ఓ సిక్స్ డిజిట్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అయితే ఎలాగోలా తెలుసుకుంటారు. కానీ ఈ కోడ్ ఎవరికీ తెలియదు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది.
మీ స్టేటస్‌ని ఎవరు చూడాలి?
వాట్సాప్ స్టేటస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మీ మూడ్‌ను తెలుసుకునేందుకు ఈ స్టేటస్ అవతలి వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ స్టేటస్‌ను ఎవరు చూడాలి, ఎవరు చూడొద్దు అనేది కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. మీ కాంటాక్ట్స్‌లో ఉన్న కొందరు మాత్రమే చూడాలన్నా అందుకు తగినట్లు సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లోకి వెళ్లి ప్రైవసీ సెలక్ట్ స్టేటస్‌లో మై కాంటాక్ట్స్ ఎక్‌సెప్ట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఏ కాంటాక్ట్స్ చూడొద్దు అని మీరు అనుకుంటారో వాటిని ఎంపిక చేసుకోవాలి. ఓన్లీ షేర్ విత్ అనే మరో ఆప్షన్ కూడా ఉంటుంది.
బ్లూ టిక్స్ రాకుండా ఉండాలంటే..
మీరు పంపిన మెసేజ్ అవతలి వాళ్లు చూశారో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ తెచ్చిన అద్భుతమైన ఫీచర్.. బ్లూ టిక్స్. సింగిల్ టిక్ ఉంటే మెసేజ్ చేరలేదని, రెండు టిక్స్ ఉంటే చేరిందని, అవి బ్లూ కలర్‌లోకి మారితే మెసేజ్ చూశారని అర్థం. అయితే అవతలి వాళ్లు మీకు పంపిన మెసేజ్‌ను ఈ బ్లూ టిక్స్ రాకుండా సీక్రెట్‌గా చూడాలన్నా కొన్ని మార్గాలు ఉన్నాయి.
♦ సెట్టింగ్స్‌లోని ప్రైవసీలో రీడ్ రీసీట్స్‌ను ఆఫ్ చేయడం దీనికి శాశ్వత పరిష్కారం. ఇలా చేస్తే మీరు మెసేజ్ చూసినట్లు అవతలి వాళ్లకు తెలియదు.. అలాగే మీరు పంపిన మెసేజ్ వాళ్లు చూశారా లేదా అన్నది కూడా మీకు తెలియదు.
♦ ఇలా శాశ్వతంగా వద్దు అనుకుంటే.. ఓ సీక్రెట్ ట్రిక్ కూడా ఉంది. అదేంటంటే.. మీకు ఓ మెసేజ్ వచ్చిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయకుండా.. ముందు మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ చూసిన తర్వాత మళ్లీ ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా బ్లూ టిక్స్ అవతలి వాళ్లకు కనిపించవు.
డిలీట్ చేసిన మెసేజ్‌లు చదవాలంటే..
పర్సనల్ లేదా గ్రూప్ చాట్స్‌లో పంపిన మెసేజ్‌లను డిలీట్ చేసే అవకాశం వాట్సాప్ కలిగించిన సంగతి తెలుసు కదా. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేస్తే.. గ్రూప్‌లో ఎవరికీ ఆ మెసేజ్ కనిపించదు. మెసేజ్ డిలీటెడ్ అనేదే కనిపిస్తుంది. కానీ ఆ డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా మీరు చూడొచ్చు. అయితే దీనికోసం మరో యాప్‌ను మీరు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నోటిఫికేషన్ లాగ్ యాప్స్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి. అందులో ఏదో ఒక దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. మీ నోటిఫకేషన్లంటినీ ఇది దాచి ఉంచుతుంది. డిలీట్ చేసిన మెసేజ్‌లు కూడా ఇందులో కనిపిస్తాయి.
తర్వాత రిప్లై ఇవ్వచ్చు..
మీరు ఓ మెసేజ్‌ను చూశారు.. కానీ రిప్లై ఇవ్వడానికి టైమ్ లేదు.. తర్వాత ఇద్దామనుకొని మరచిపోతారు. కానీ ఇలా కాకుండా మీరు చదివిన మెసేజ్‌కు తర్వాత గుర్తు పెట్టుకొని రిప్లై ఇవ్వడానికి ఓ ఆప్షన్ ఉంది. ఆ చాట్‌పై లాంగ్ ప్రెస్ చేసి చాట్ ట్యాబ్‌లోని మార్క్ యాస్ అన్‌రీడ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ చాట్‌పై ఓ గ్రీన్ డాట్‌లాంటిది వస్తుంది. ఇది మీకు రిమైండర్‌లాగా పని చేస్తుంది.
ఓ చాట్‌ను హైడ్ చేయాలంటే..
మీరు లేటెస్ట్‌గా చాట్ చేసే నంబర్లు లిస్ట్‌లో పైన ఉంటాయన్న సంగతి తెలుసు కదా. అయితే కొన్ని చాట్స్ ఇలా కనిపించొద్దని మీరు అనుకుంటే.. వాటిని హైడ్ చేసుకునే వీలు కూడా ఉంది. ఆ చాట్‌పై లాంగ్ ప్రెస్ చేసి పైన ఉండే ఆర్కైవ్ బటన్‌ను ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే ఆ చాట్ పై నుంచి మాయమైపోయి.. పూర్తిగా కిందికి వెళ్తుంది.
యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు
వాట్సాప్ వాడుతూనే మీ ఫ్రెండ్‌కు పేమెంట్ చేసే అద్భుతమైన ఫీచర్‌ను కూడా ఈ సోషల్ మీడియా యాప్ మీకు అందిస్తోంది. యూపీఐ పేమెంట్స్ ద్వారా డబ్బు పంపించే అవకాశం ఉంటుంది. అటాచ్‌మెంట్ బటన్ ప్రెస్ చేస్తే.. అందులో మీకు పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్‌లోనూ మీరు ప్రత్యేకంగా యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ప్రతిసారీ పేమెంట్స్ పంపించే వీలుంటుంది.
హెడ్‌ఫోన్స్ లేకపోయినా..
మీరు బయట పబ్లిక్ ప్లేస్‌లో ఉంటారు. మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. ఇయర్ ఫోన్స్ మీ దగ్గర లేవు. మరి ఆ మెసేజ్‌ను సీక్రెట్‌గా ఎలా వినాలి? దీనికోసం వాట్సాప్ మంచి ఆప్షన్ ఇచ్చింది. ఫోన్ వచ్చినపుడు స్పీకర్‌ను చెవి దగ్గర ఎలా పెట్టుకొని మాట్లాడతారో అలాగే మెసేజ్ వినొచ్చు. మీరు వినాలనుకుంటున్న వాయిస్ మెసేజ్‌ను ప్లే చేసి సింపుల్‌గా మీ చెవి దగ్గర స్పీకర్ పెట్టుకోండి. ఆ మెసేజ్ కేవలం మీకు మాత్రమే వినిపిస్తుంది.
స్టికర్ ప్యాక్స్
యూత్‌కు ఎమోజీలు, జిఫ్‌లు, స్మైలీస్ వాడటం అంటే ఎంతో సరదా. దీనికితోడు కొత్తగా స్టికర్లు కూడా వచ్చి చేరాయి. వాట్సాప్‌లో వివిధ రకాల స్టికర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు సొంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పర్సనల్‌వి యాడ్ చేసుకోవచ్చు. ఇవి చాలవనుకుంటే.. పర్సనల్ స్టికర్స్ ఫర్ వాట్సాప్‌లాంటి థర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా కొత్త స్టికర్స్‌ను యాడ్ చేసుకునే వీలుంటుంది.
వాట్సాప్ సీక్రెట్ ఫీచర్స్ చూశారు కదా.. మీరు వాడేందుకు ప్రయత్నించండి.. ఈ కథనం నచ్చితే షేర్ చేయండి..