రూ. 15 వేల రేంజ్ లో బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్ ఇవే

SAMSUNG GALAXY A50

బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అంటే.. రూ. 14 వేల నుంచి రూ. 20 వేల లోపు అయితే ఓకే అనుకునేవాళ్లు ఇప్పుడు మేము చెప్పబోయే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ట్రై చేయండి. కచ్చితంగా ప్రీమియం ఫోన్‌ వాడిన ఫీలింగ్‌ మీకు కలుగుతుంది.

అందులోనూ విపరీతమైన కాంపిటీషన్‌ ఉన్న ఈ సమయంలో.. సాధ్యమైనంత తక్కువ ధరకు బెస్ట్‌ ఫీచర్స్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వడానికి అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. పాప్‌ అప్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌లాంటి అత్యాధునిక ఫీచర్స్‌ కూడా ఇప్పుడు 20 వేల లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో వస్తున్నాయి. 

మార్కెట్‌లో ఉన్న టాప్‌ కంపెనీలు షియోమీ, రియల్‌మి, ఒప్పో, వివో, శామ్‌సంగ్‌, నోకియా.. ఇలా అన్నింట్లో 20 వేల లోపు సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫోన్లు ఉన్నాయి. అవేంటో డియర్ అర్బన్ డాట్ కామ్ మీకు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది… మీకు నచ్చిన ఫీచర్స్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనేయండి. 

1. రియల్‌మి 5 ప్రొ

మార్కెట్‌లో షియోమీలాంటి కంపెనీకి చెమటలు పట్టిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి. అతి తక్కువ ధరకు అత్యుత్తమ ఫీచర్స్‌ అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో 48 మెగాపిక్సెల్‌ క్వాడ్‌ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను 15 వేల లోపు ధరకే అమ్ముతోంది. రియల్‌మి 5 ప్రొ ధర రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బేస్‌ వేరియంట్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఉంటుంది. ఇక 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.14,999గా.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.16,999గా ఉంది. 

realme 5 pro

రియల్‌మి 5 ప్రొ ఫీచర్స్‌

  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 712 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 6.3 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే.. గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
  • 4035 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫేస్‌ అన్‌లాక్‌, రియల్‌ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌   

2. రియల్‌మి X

రియల్‌మి నుంచి వస్తున్న మరో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి X. ఈ సెగ్మెంట్‌లో బెస్ట్‌ కెమెరా ఉన్న ఫోన్‌ ఇదే. డ్యుయల్‌ రియర్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. రియర్‌ కెమెరా 48 ఎంపీ + 5 మెగాపిక్సెల్‌తో వస్తుండగా.. 16 ఎంపీ పాపప్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇందులో అమర్చారు. రియల్‌మి X ధర రూ. 16,999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ వేరియంట్‌లో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉంటుంది. ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999గా ఉంది. 

realme X

రియల్‌మి X ఫీచర్స్‌

  • 6.5 ఇంచ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే.. గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
  • స్నాప్‌డ్రాగన్‌ 710 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 3765 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

3. ఒప్పొ కే3

రూ. 20 వేల లోపు సెగ్మెంట్‌లో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో ఒప్పొ కే3 కూడా ఒకటి. కెమెరాతోపాటు VOOC ఫాస్ట్‌ చార్జింగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత. ఒప్పొ కే3 ధర కూడా రూ. 16990 నుంచి ప్రారంభమవుతోంది. 16 ఎంపీ పాపప్‌ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది. ఇక VOOC (ఓల్టేజ్‌ ఓపెన్‌ లూప్‌ మల్టీస్టెప్‌ కాన్‌స్టాంట్‌ కరంట్‌ చార్జింగ్‌) ద్వారా ఫాస్ట్‌ చార్జింగ్‌ చేసుకోవచ్చు. 

oppo K3

ఒప్పొ కే3 ఫీచర్లు

  • స్నాప్‌డ్రాగన్‌ 710 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 6.5 ఇంచ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
  • 3765 ఎంఏహెచ్‌ బ్యాటరీ విత్‌ VOOC ఫాస్ట్‌ చార్జింగ్‌
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

4. వివో జడ్‌1 ప్రొ

ప్రిమియం స్మార్ట్‌ఫోన్‌లో ఉండే టచ్‌ క్వాలిటీ, మెగా బ్యాటరీ వివో జడ్ 1 ప్రో ఫోన్‌ ప్రత్యేకతలు. రూ.14990 ధరకు ప్రారంభమయ్యే స్మార్ట్‌ఫోన్స్‌లో ఈ క్వాలిటీస్‌ ఉన్న ఏకైక మొబైల్‌. ఇక 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌కున్న మరో అసెట్‌. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండటంతో ఎక్కువ కాలం చార్జింగ్‌ లేకుండా పని చేస్తుంది. మూవీస్‌, గేమ్స్‌కు బాగా అలవాటు పడిన యూత్‌కు ఈ మాత్రం బ్యాటరీ ఉండాల్సిందే. ఇందులోనే 6 జీబీ వేరియంట్‌ ధర రూ. 17990గా ఉంది.

vivo z1 pro
వివో జడ్‌1 ప్రొ ఫీచర్స్‌

  • 6.53 ఇంచ్‌ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 712 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌

5. షియోమీ పోకో ఎఫ్‌1

క్వాల్‌కామ్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 845తో వచ్చిన చీపెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇది. దీని ధర రూ. 17990 నుంచి ప్రారంభమవుతుంది. సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్‌ కావడంతో సహజంగానే యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ కూడా అందుబాటులో ఉంది. 

షియోమీ పోకో ఎఫ్‌1 ఫీచర్స్‌

  • 6.18 ఇంచ్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
  • 12 ఎంపీ + 5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
  • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

6. మొటొరొలా వన్‌ యాక్షన్‌

యాక్షన్‌ కెమెరాలాంటి ఫీచర్లతో వస్తున్న ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా మొటొరొలా కంపెనీ దీనిని అభివర్ణించింది. గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ మొటొరొలా వన్‌ యాక్షన్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు. ఇది వెనకాల మూడు కెమెరాలతో వస్తోంది. 12 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 16 ఎంపీ అల్ట్రావైడ్‌ వీడియో కెమెరా, 5 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌ ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభమవుతోంది. 

మొటొరొలా వన్‌ యాక్షన్‌ ఫీచర్స్‌

  • 6.3 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్‌, శామ్‌సంగ్‌ ఎగ్జినోస్‌ 9 ఆక్టా ప్రాసెసర్‌
  • 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

7. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎ50

రూ. 20 వేల లోపు ఉన్న బెస్ట్‌ శామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇది. దీని ధర రూ. 18490 నుంచి ప్రారంభమవుతుంది. శామ్‌సంగ్‌ లవర్స్‌కు ఇది బెస్ట్‌ ఆప్షన్‌. ఇది మూడు రియర్‌ కెమెరాలతో వస్తోంది. 25MP + 5MP + 8MP ఎల్‌ఈడీ ఫ్లాష్‌ సెటప్‌తో అదిరిపోయే ఫొటోలు తీసుకోవచ్చు. ఇక 25 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా దీనికి అదనపు అసెట్‌. 

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎ50 ఫీచర్స్‌

  • 6.4 ఇంచ్‌ ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్‌, శామ్‌సంగ్‌ ఎగ్జినోస్‌ 7 ఆక్టా ప్రాసెసర్‌
  • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

8. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం40

శామ్‌సంగ్‌ నుంచి రూ. 20 వేల ధరలోపు పంచ్‌ హోల్‌ కెమెరాతో వస్తున్న ఏకైక స్మార్ట్‌ఫోన్‌ ఇది. ఈ సంస్థ ఈ మధ్యే రిలీజ్‌ చేసిన తమ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ గెలాక్సీ నోట్‌ 10లో ఉన్న పంచ్‌ హోల్‌ కెమెరా శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం40లోనూ ఉండటం విశేషం. ఈ ఫోన్‌ ధర రూ. 19,990. ఇందులోనూ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలు ఉన్నాయి. 

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం40 ఫీచర్స్‌

  • 6.3 ఇంచెస్‌ పీఎల్‌ఎస్‌ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్‌, స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌
  • 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 32 MP + 8 MP + 5 MP ఎల్‌ఈడీ ఫ్లాష్‌ రియర్‌ కెమెరా సెటప్‌
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

9. నోకియా 8.1

నోకియాలో వస్తున్న బెస్ట్‌  మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇది. యూత్‌ను ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్‌ ఈ మొబైల్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ కావడంతో.. మరో రెండేళ్లపాటు రెగ్యులర్‌గా ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌ అందుకోనుంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 17999గా ఉంది. డ్యుయల్‌ రియర్‌ కెమెరా (12MP + 13MP), 20 ఎంపీ సెల్ఫీ కెమెరా  ఈ నోకియా 8.1లో ఉన్నాయి. నోకియా బ్రాండ్‌ను ఇష్టపడేవాళ్లు, మంచి డిజైన్ కోరుకునే వాళ్లు ఈ మొబైల్‌ను కొనొచ్చు. 

నోకియా 8.1 ఫీచర్స్‌

  • 6.18 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
  • 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫాస్ట్‌ బ్యాటరీ చార్జింగ్‌
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
 

10. హువాయీ వై9 ప్రైమ్‌

పాపప్‌ సెల్ఫీ కెమెరా ఇష్టపడే వాళ్లకు ఈ స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్‌ చాయిస్‌. ఎందుకంటే అతి తక్కువ ధరకు పాపప్ సెల్ఫీ కెమెరా అందిస్తున్న ఫోన్‌ ఇదే. దీని ధర రూ. 15,990 నుంచి ప్రారంభమవుతోంది. ఇక ట్రిపుల్‌ రియర్‌ కెమెరా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత. 

హువాయీ వై9 ప్రైమ్‌ ఫీచర్స్‌

  • 6.59 ఇంచ్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్‌, కిరిన్‌ 710 ప్రాసెసర్‌
  • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో ఉత్తమ ఫోన్లు చూశారు కదా.. ఈ స్టోరీ మీకు నచ్చితే షేర్ చేయడం మరిచిపోకండి..

ఇవి కూడా చదవండి..

రూ. 300 లోపు ఆసక్తికర గాడ్జెట్స్ ఇవీ..

Previous articleరెరా చట్టం .. ఇల్లు కొనేవాళ్ల చేతిలో ఆయుధం
Next articleవెజ్ బిర్యానీ చేయడం చాలా సింపుల్