Natural face pack for glowing skin: చర్మం మెరిసేందుకు రసాయనాలతో కూడిన క్రీముల కంటే సహజమైన ఫేస్ ప్యాక్‌లు ఉపయోగించడం మంచిది. రసాయనాలు గల ఫేస్ క్రీములు తాత్కాలికంగా మెరుపును ఇస్తాయి కానీ చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండడానికి తోడ్పడవు. పైగా ఖర్చు కూడా. ఇంట్లోనే సహజసిద్దంగా ఫేస్ ప్యాక్‌లు తయారుచేసుకుని చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుకోవచ్చు.
ఎండ, దుమ్ముదూళీ వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. చర్మం దెబ్బతిని మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్, మొదలైన అనేక సమస్యలు చర్మపు కాంతిని పోగొడుతున్నాయి. కనుక ఎల్లప్పుడు సహజమైన ఫేస్ ప్యాక్‌లను వాడడం వల్ల చర్మం అందంగా సహజ మెరుపును సంతరించుకుంటుంది. ముఖ్యంగా సహజమైన ఫేస్ ప్యాక్‌లు వాడడం వల్ల చర్మంపై వచ్చే అనేక రకాల దుష్ప్రభావాలు కూడా తగ్గించుకోవచ్చు. మరి ఇంట్లోనే ఈ సహజమైన ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడ చూద్దాం.
1. అలోవెరా మరియు టమాటో ఫేస్ ప్యాక్:
అలోవెరా చర్మంపై ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో, కాంతిని రెట్టింపు చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది కనుకనే దీనిని సౌందర్య సాధానలన్నింటిలోనూ వాడుతున్నారు. ముఖంపై వచ్చే డార్క్ స్పాట్స్, మొటిమలను పోగొట్టడంలో సహయపడుతుంది. తక్షణ నిగారింపును ఇస్తుంది. టమాటో కూడా చర్మ కాంతిని పెంచడంలో క్లెన్సింగ్ పనిచేస్తుంది.
ఎలా ఉపయోగించాలి:
- 2 టేబుల్ సూన్ల అలోవెరా తీసుకుని ఒక టీ స్పూన్ టమాటో రసం కలపాలి.
- పేస్ట్ చేయడానికి కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు.
- ఈ ప్యాక్‌ను మీ ముఖంపై మరియు మెడపై అప్లయ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.
2. శనగపిండి పెరుగు ఫేస్ ప్యాక్:
శనగపిండి ముఖంపై ఉన్న మొటిమలను, మచ్చలను తగ్గిచడంలో బాగా పనిచేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పెరుగు కూడా చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని క్లెన్సింగ్ చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి:
- రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని ఒక టీస్పూన్ పెరుగును కలపాలి.
- ముఖాన్ని శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకుని తర్వాత ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లయ్ చేయాలి.
- ఒక 15 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.
4. పసుపు మరియు బియ్యం పిండి:
పసుపు సహజసిద్దమైన కాంతిని ముఖానికి అందిస్తుంది. పసుపులో యాంటీ బయాటిక్స్ ఉండడం వల్ల చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును కలిగిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా అందిస్తుంది. పసుపు చర్మంలో ఉన్న మంటను పోగొట్టి చర్మ కణాలను వృద్దాప్య ఛాయలను తగ్గిస్తుంది. బియ్యం పిండి కూడా చర్మం అందానికి మెరుపును అందిచడంలో అద్భుతమైన ఫేస్ ప్యాక్.
ఎలా ఉపయోగించాలి
- రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ పసుపు వేసుకోవాలి.
- కొంచెం పాలు గానీ నీళ్లు గానీ కలపాలి.
- తర్వాత ఈ ప్యాక్‌ని అప్లయ్ చేసుకుని 10 నిమిషాలు ఉంచి మృదువుగా స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్