దేశవ్యాప్తంగా మే 31 వరకూ లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. లాక్డౌన్ 4.0 గైడ్‌లైన్స్ ను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా జారీచేశారు. లాక్డౌన్ 4.0లో నిషేధం దేనికి వర్తిస్తుంది? వేటికి సడలింపు ఉంటుందో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రాలు తాజా పరిస్థితిని అంచనా వేసి, విభిన్న జోన్లలో కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చని, అవసరమైన మేరకు ఇతర ఆంక్షలు విధించవచ్చని స్పష్టం చేసింది.
లాక్డౌన్ 4.0 గైడ్‌లైన్స్ : నిషేధం వీటిపై..
1. విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుంది. వైద్య సేవలు, ఎయిర్ అంబులెన్స్ సేవలకు మినహాయింపు ఉంది.
2. మెట్రోరైలు సర్వీసులు పనిచేయవు.
3. విద్యా సంస్థలు మూసి ఉంటాయి.
4. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు ఉండవు. అయితే ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది, యాత్రికులు, క్వారంటైన్ కోసం ఉండిపోయినవారు, బస్సు డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో నిర్వహిస్తున్న క్యాంటీన్ సిబ్బందికి ఈ సేవలు అందించవచ్చు.
5. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమింగ్ పూల్స్, ఎంటర్టయిన్మెంట్ పార్క్స్, థియేటర్స్, బార్స్, ఆడిటోరియమ్స్, అసెంబ్లీ హాల్స్, మొదలైనవి. స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరిచేందుకు అనుమతి ఉంది. అయితే ఇందులోకి ప్రేక్షకులను అనుమతించరు.
6. సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, అకడమిక్, సాంస్కృతికం, మతపరమైన వేడుకలు, సమావేశాలపై నిషేధం.
7. అన్ని మతపరమైన స్థలాలు, ప్రార్థనా మందిరాలు మూసి ఉంటాయి. మతపరమైన సమావేశాలు ఉండరాదు.
8. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధం. అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది. సీఆర్పీసీ సెక్షన్ 144 కింద స్థానిక యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేస్తుంది.
9. కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సేవలనే అనుమతిస్తారు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువల సరఫరాకు తప్ప వ్యక్తుల రాకపోకలపై నిషేధం ఉంటుంది.
10. 65 ఏళ్ల వయస్సు పైబడి ఉన్నవారు, ఇతర వ్యాధులు ఉన్న వారు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరాలు, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది.
లాక్డౌన్ 4.0 గైడ్‌లైన్స్ : అనుమతి వీటికి(కంటైన్మెంట్ జోన్లకు వర్తించదు)
1. రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో ప్రయాణికుల వాహనాలు, బస్సుల అంతర్రాష్ట్ర రాకపోకలకు అనుమతి ఉంది.
2. ప్రయాణికుల వాహనాలు, బస్సులు తిరిగేందుకు అనుమతి ఉంది. అయితే ఆయా రాష్ట్రాలు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.
3. వివిధ వర్గాల వ్యక్తుల తరలింపునకు సంబంధించి ఇదివరకే జారీచేసిన ప్రామాణిక నియమావళి అమల్లో ఉంటుంది.
4. కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను రాష్ట్రాలే నిర్ణయిస్తాయి.
5. నిర్ధిష్టంగా నిషేధించిన వాటికి మినహా ఇతర అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
6. వైద్య నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, అంబులెన్స్‌ల రాకపోకలపై ఎక్కడైనా ఎలాంటి నిషేధం లేదు.
7. ఖాళీ ట్రక్కులు సహా అన్నిరకాల వస్తు రవాణా వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
కరోనాను అరికట్టేందుకు గైడ్‌లైన్స్
1. పబ్లిక్ ప్లేసెస్, వర్క్ ప్లేసెస్‌లో మాస్కులు ధరించడం తప్పనిసరి.
2. పబ్లిక్ ప్లేసెస్, వర్క్ ప్లేసెస్‌లో ఉమ్మి వేస్తే శిక్ష.
3. పబ్లిక్ ప్లేసెస్‌లలో, ప్రయాణంలో భౌతిక దూరం పాటించాలి.
4. పెళ్లిల్లో భౌతిక దూరం పాటించాలి. 50 మంది కంటే ఎక్కువ అతిథులు ఉండరాదు.
5. అంతిమ సంస్కారాల్లో భౌతిక దూరం పాటించాలి. 20 మంది కంటే ఎక్కువ ఉండరాదు.
6. పబ్లిక్ ప్లేసెస్‌లో లిక్కర్, పాన్, పొగాకు, గుట్కా వినియోగం అనుమతించరు.
7. షాపుల వద్ద రెండు గజాల దూరం నియమాన్ని పాటించాలి.
8. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతివ్వాలి.
9. కార్యాలయాలు, పని ప్రదేశాలు, షాప్స్, మార్కెట్లు, పరిశ్రమలు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నిర్ధిష్ట పనివేళలు పాటించకుండా.. విభిన్న వేళలు పాటించాలి.
10. థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ వాష్, శానిటైజర్ వంటి వసతులు ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్లో ఉండాలి.
11. వర్క్ ప్లేసెస్‌లో తరచుగా శానిటైజ్ చేయాలి.
12. స్టాఫ్ సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలి. లంచ్ బ్రేక్ అందరికీ ఒకేసారి ఉండరాదు.
ఇవీ చదవండి