నెట్‌ఫ్లిక్స్‌ న్యూ రిలీజెస్ సూన్: 12 న్యూ మూవీస్, 5 వెబ్‌ సిరీస్‌

netflix new releases

నెట్‌ఫ్లిక్స్‌ న్యూ రిలీజెస్ అనౌన్స్ చేేసింది. 12 న్యూ మూవీస్‌ నేరుగా రిలీజ్ చేయడంతో పాటు 5 వెబ్‌ సిరీస్‌లు కూడా తేనుంది. అభిషేక్‌ బచ్చన్‌ నటించిన లూడో, సంజయ్‌ దత్‌ మూవీ తోర్బాజ్, మీరానాయర్‌ దర్శకత్వంలో టాబూ నటించిన ఎ సూటబుల్‌ బాయ్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

లాక్‌డౌన్‌ కాలంలో అమెజాన్‌ ప్రైమ్‌ పలు ప్రాంతీయ చిత్రాలు విడుదల చేసి ఓటీటీ అంటే ఇదేరా అన్న రీతిలో మంచి ఊపు కనిపించింది. పెంగ్విన్, పొన్మగల్‌ వంధల్, సూఫియుం.. సుజాతయుం.. వంటి సినిమాలు విడుదల చేసి హల్‌చల్‌ చేసింది. అలాగే డిస్నీ హాట్‌స్టార్, ఆహా ఓటీటీలు కూడా ఒకటి రెండు సినిమాలతో ఆదరణ పొందాయి.

నెట్‌ఫ్లిక్స్‌ న్యూ రిలీజెస్ : న్యూ మూవీస్

1. గుంజన్‌ సక్సేనా– ది కార్గిల్‌ గర్ల్‌ : నెట్‌ఫ్లిక్స్‌ న్యూ రిలీజెస్ లో మోస్ట్ అవేయిడెట్ మూవీ ఇది. జాన్వీ కపూర్, పంకజ్‌ త్రిపాఠి, వినీత్‌ కుమార్, అంగద్‌ బేడీ నటిస్తున్న ఈ మూవీ ఒక బయోపిక్‌.

2. త్రిభంగా – తేడీ మేరీ క్రేజీ : కాజల్, తన్వి ఆజ్మీ, మిథిలా పాల్కర్‌ నటిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాతో రానుంది.

3. కాలీ ఖుహీ : షబానా ఆజ్మీ, సత్యదీప్‌ మిశ్రా, రీవాకపూర్‌ నటిస్తున్న ఈ చిత్రం హారర్‌ మూవీ.

4. సీరియస్‌ మెన్‌ : నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, నాజర్, శ్వేత బసు ప్రసాద్‌ నటిస్తున్న ఈ చిత్రం కామెడీ డ్రామా జానర్‌లో వస్తోంది.

5. క్లాస్‌ ఆఫ్‌ ‘83 : బాబీ డియోల్, భూపేంద్ర జదావత్, హితేష్‌ మలుకనీ, అనూప్‌ సోని నటిస్తున్నారు.
6. ఏకే వర్సెస్‌ ఏకే  అనిల్‌కపూర్‌ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇది.

7. లూడో : అభిషేక్‌ బచ్చన్, ఆదిత్యారాయ్‌ కపూర్, రాజ్‌కుమార్‌ రావ్, తదితరులు నటిస్తున్న ఈ ఈ మూవీ కామెడీ, డ్రామా జానర్‌తో కూడినది.

8. తోర్బాజ్‌ : సంజయ్‌దత్‌ ప్రధాన పాత్ర. డ్రామా జానర్‌. గిరీష్‌మహీక్‌ దర్శకత్వంలో వస్తోంది.

9. రాత్‌ అకేలీ హై : మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌ అయిన ఈ మూవీలో రాధికా ఆప్టే, నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటిస్తున్నారు.

10. డాలీ కిట్టీ ఔర్‌ ఓ ఛమక్‌తే సితారే : కొంకణా సేన్‌ శర్మ, భూమి పెడ్నేకర్‌ నటిస్తున్న ఈ సినిమా కామెడీ, వ్యంగ్యంతో కూడిన జానర్‌లో ఉంటుంది.

11. గిన్నీ వెడ్స్‌ సన్నీ: యామీ గౌతమ్, విక్రాంత్‌ మాసే ప్రధాన పాత్రల్లో వస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఇది.

12. బాంబే రోస్: రొమాన్స్‌ మూవీ, యానిమేటెడ్‌ మూవీ..

నెట్‌ఫ్లిక్స్‌ న్యూ రిలీజెస్: వెబ్‌ సిరీస్‌

1. మిస్‌మ్యాచ్‌డ్‌ : ప్రజక్త కోలీ, రోహిత్‌షరాఫ్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న సిరీస్‌ ఇది. సంధ్యా మీనన్‌ రాసిన వెన్‌ డింపుల్‌ మెట్‌ రిషి నవల ఆధారంగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ కామెడీ వెబ్‌ సిరీస్‌ ఇది.

2. ఎ సూటబుల్‌ బాయ్‌ : నెట్‌ఫ్లిక్స్‌ న్యూ రిలీజెస్ లో మోస్ట్ అవేయిడెట్ వెబ్ సిరీస్ ఇది. విక్రమ్‌ సేత్‌ రాసిన ఎ సూటబుల్‌ బాయ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్‌సిరీస్‌ ఇది. ఇషాన్‌ కట్టర్, టాబూ, తాన్యా మనిక్తలు ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాన్స్‌ జానర్‌తో ఉండే ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ ఇప్పటికే ఆకట్టుకుంది. సయీదాబాయ్‌ అనే వేశ్య పట్ల వ్యామోహం పెంచుకున్న మాన్‌ కపూర్‌ అనే అబ్బాయి కథ ఇది.

3. మసాబా మసాబా : మసాబా గుప్తా, నీనా గుప్తా నటించిన వెబ్‌సిరీస్‌ ఇది. మసాబా జీవితంలో ఎదురైన సంఘటనలతో తీస్తున్న సిరీస్‌. ఆమె అద్వితీయమైన నేపథ్యం, భిన్న ప్రపంచాలు, ఫ్యామిలీ, ఫ్యాషన్, డేటింగ్‌ వంటి అంశాలతో ఈ సిరీస్‌ రూపొందుతోంది.

4. బాంబే బేగమ్స్‌ : అమృతా సుభాష్, ప్లబితా, ఆధ్యాఆనంద్, పూజాభట్, షహానా గోస్వామి నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ఒక ఫిక్షనల్‌ డ్రామా. పురుషాధిక్యత గల ఈ సమాజంలో ఐదు తరాల మహిళలు తమ వ్యక్తిగత జీవితాలు, నైతిక విలువలు, కోరికలను ఎలా బాలెన్స్‌ చేసుకున్నారో చెప్పే వెబ్‌సిరీస్‌ ఇది.

5. భాగ్‌ బేనీ భాగ్‌ : స్వర భాస్కర్, రవి పటేల్‌ నటించిన డ్రామా, కామెడీతో కూడిన వెబ్‌ సిరీస్‌ ఇది.

Previous articleప్రశాంతంగా ఉండు సుశీ.. నిన్ను జీవితకాలం ప్రేమిస్తూనే ఉంటా
Next articleరియల్‌ ఎస్టేట్‌ అమ్మకాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి..!