Drop shipping business: డ్రాప్‌ షిప్పింగ్‌ .. తక్కువ పెట్టుబడితో ఆన్‌లైన్‌‌ బిజినెస్‌

dropshipping
Photo by PhotoMIX Company from Pexels

Drop shipping business in telugu:డ్రాప్‌ షిప్పింగ్‌ .. ట్రెండింగ్‌ బిజినెస్‌ ఇది. తక్కువ పెట్టుబడితో ఈ కామర్స్‌ పోర్టల్‌ రన్‌ చేయడమే ఈ డ్రాప్‌ షిప్పింగ్‌. మనం కేవలం కస్టమర్‌ నుంచి ఆర్డర్‌ తీసుకుంటాం. ఆ ఆర్డర్‌ను ఫుల్‌ఫిల్‌ చేసేది ఇంకొకరు. అంటే ప్రొడక్ట్‌ మనది కాదు. డెలివరీ కూడా మనం చేయం. కానీ మనకు లాభం వస్తుంది. ఇదే డ్రాప్‌ షిప్పింగ్‌ బిజినెస్‌.

Drop shipping business: తక్కువ పెట్టుబడితో డ్రాప్‌ షిప్పింగ్‌

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈకామర్స్‌ పోర్టల్స్‌ ఏం చేస్తాయంటే.. అనేకమంది సప్లయర్స్‌కు వారి పోర్టల్‌లో వారి ప్రోడక్ట్స్‌ అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇందుకు గాను సుమారుగా పది శాతం కమిషన్‌ ఛార్జి చేస్తాయి. అలాగే అమెజాన్‌ బ్రాండ్‌ (సోలిమో వంటి పేర్లతో) తో కూడా సరుకులు అమ్ముతుంటుంది. అంటే తయారీదారులు అమెజాన్‌ బ్రాండ్‌తో తయారుచేసి అమెజాన్‌కు సరఫరా చేస్తారు.

మనం సొంతంగా కూడా ప్రోడక్ట్స్‌ తయారు చేసి మనం ఈకామర్స్‌ పోర్టల్‌ ద్వారా అమ్ముకోవచ్చు. అయితే ప్రోడక్ట్స్‌ తయారీకి, వాటిని షిప్పింగ్‌ చేసేందుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కానీ డ్రాప్‌షిప్పింగ్‌ బిజినెస్‌లో ప్రోడక్ట్స్‌ మనవి కావు. అలాగే షిప్పింగ్‌ కూడా మనం చేయం.

డ్రాప్‌షిప్పింగ్‌ బిజినెస్‌ (Drop shipping business) ఎలా అంటే.. మనం సరుకులు అమ్ముతాం. కానీ ఆ సరుకు మనది కాదు. ఆ సరుకు ఇంకొకరిది. మనం ఆ సరుకును అమ్మేందుకు మనకు ఒక ఈకామర్స్‌ పోర్టల్‌ ఉండాలి. ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సరుకులు ప్రొవైడ్‌చేసే ఒక సంస్థ ఉండాలి. అంతే. అదే డ్రాప్‌షిప్పింగ్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ మోడల్‌.

వూ కామర్స్‌ ద్వారా డ్రాప్‌షిప్పింగ్‌ డ్రాప్‌షిప్పింగ్‌లో ప్రస్తుతం రెండు మోడల్స్‌ పాపులర్‌. అవేంటంటే ఒకటి వూ కామర్స్‌. రెండోది షాపిఫై. వర్డ్‌ప్రెస్‌ పేరు వినే ఉంటారుగా. వెబ్‌సైట్లు రూపొందించేందుకు అవసరమయ్యే కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీఎంఎస్‌).

వర్డ్‌ప్రెస్‌ను రూపొందించిన ఆటోమేటిక్‌ కంపెనీ వూకామర్స్‌ అనే ప్లగ్‌ ఇన్‌ కూడా అందిస్తోంది. ఇది ఉచితం. దీంతోపాటు ఆలీబాబా కంపెనీకి చెందిన అలీడ్రాప్‌షిప్పింగ్‌ ప్లగ్‌ ఇన్‌కు 89 డాలర్ల వెచ్చించాల్సి ఉంటుంది. ఈ అలీడ్రాప్‌షిప్పింగ్‌ ప్లగ్‌ఇన్‌ను వాడడం ద్వారా ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్‌ను మనం మన సైట్‌లో అమ్ముకోవచ్చు.

ఎన్ని ప్రోడక్ట్స్‌ అయినా మనం అమ్ముకోవచ్చు. మనకు లభ్యమయ్యే ధరకు మనం కొంత లాభం చూసుకుని అమ్మొచ్చు. షిప్పింగ్, ట్రాకింగ్‌ అంతా అలీడ్రాప్‌షిప్పింగ్‌ వ్యవస్థ చూసుకుంటుంది. అలీడ్రాప్‌షిప్పింగ్‌ ప్లగ్‌ఇన్‌ అలీఎక్స్‌ప్రెస్‌ పోర్టల్‌ ద్వారా సరుకులు సరఫరా చేస్తుంది.

షాపిఫై డ్రాప్‌షిప్పింగ్‌ మోడల్‌..(shopify model dropshipping)

షాషిఫై డ్రాప్‌షిప్పింగ్‌లో షాఫిఫైకి మనం కొంత నామమాత్రంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. షాఫిఫై ద్వారా ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ రూపొందించిన తరువాత షాఫిఫైకి చెందిన ఒబెర్‌లో యాప్‌కు మనం కొంత రుసుము చెల్లిస్తే ఒబెర్‌లో మనకు వారి ప్రోడక్ట్స్‌ అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ కూడా ఆయా ప్రోడక్ట్స్‌కు మనం కొంత లాభం జోడించి అమ్మాల్సి ఉంటుంది. షాపిఫైకి ప్రత్యామ్నాయాలు కూడా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి.

డ్రాప్‌షిప్పింగ్‌కు పెట్టుబడి ఎంతవుతుంది? (How much investment needs)

పెట్టుబడి అతితక్కువే అని చెప్పొచ్చు. నాణ్యమైన వెబ్‌సైట్‌ రూపొందించేందుకు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈకామర్స్‌ పోర్టల్‌ రెడీ చేసేముందు వెబ్‌సైట్‌కు ఎలాంటి థీమ్‌ ఉండాలి? ఏ హోస్టింగ్‌ బాగుంటుంది? వంటివన్నీ శోధించాలి. నెలానెలా రికరింగ్‌ ఖర్చులు కూడా తక్కువే. వెబ్‌ హోస్టింగ్‌కు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా స్వల్పంగానే ఉంటుంది.

అయితే మనం ఫలానా ప్రోడక్ట్స్‌ అమ్ముతున్నామని జనానికి ఎలా తెలియాలి? అడ్వర్టయిమెంట్‌ ద్వారా తెలుస్తుంది. ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌ కోసం గూగుల్‌ యాడ్స్, ఫేస్‌బుక్‌ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ యాడ్స్‌.. లేదా టీవీ యాడ్స్, పేపర్‌ యాడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

సక్సెస్‌ అవ్వాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి..(Drop shipping business success secrets)

పటిష్టమైన వెబ్‌సైట్‌తోపాటు మనం ఎంచుకునే ప్రోడక్ట్స్‌ కూడా నాణ్యమైనవి ఉండాలి. మనం ఎంచుకునేటప్పుడు 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్నవాటిని లేదా 4 స్టార్‌ రేటింగ్‌ కంటే ఎక్కువ రేటింగ్‌ ఉన్న ప్రోడక్ట్స్‌ను ఎంచుకోవాలి. అలాగే ఏ ప్రోడక్ట్స్‌ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో గమనించి వాటిని మనం సెలెక్ట్‌ చేసుకోవాలి. తక్కువ ప్రోడక్ట్స్‌తో స్టార్ట్‌ చేయడం ద్వారా నెమ్మదిగా అనుభవాలు తెలుసుకుని విస్తరించవచ్చు.

ఈ బిజినెస్‌ స్టార్టప్ ఐడియా బాగుంది కదా.. నచ్చితే ఈ కథనం మీ స్నేహితులు, బంధువులకు షేర్‌ చేయండి.

Previous articleగుంజన్ సక్సేనా : నేను మిమ్మల్ని ఎప్పుడూ ఓడిపోనివ్వను డాడీ
Next articleక్లాసిక్‌ మూవీ : ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హాపీనెస్‌ : మనల్ని మార్చేసే మూవీ