కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28 నుంచి ప్రారంభం కానుంది. మే 1 నుంచి 18–45 ఏళ్ల వయస్కులకు మే 1 నుంచి వాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాక్సిన్ పొందేందుకు ఏప్రిల్ 28 నుంచి కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నమోదు ప్రక్రియ ఇలా..
1. కోవిన్ వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత అందులో రిజిస్టర్ / సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే బటన్ ఉంటుంది. కోవిన్ వెబ్ సైట్ చిరునామా https://www.cowin.gov.in/home
2. ఈ బటన్‌ను క్లిక్ చేసి 10 అంకెల మొబైల్ నంబరు లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
3. ఎంటర్ చేసిన వెంటనే మన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
4. మీ పేరు, వయసు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పాస్‌బుక్, ఎన్పీఆర్ స్మార్ట్‌కార్డు, వంటి డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుంది.
5. వాక్సినేషన్ సెంటర్లలో మీకు దగ్గరగా ఉన్నదేదో తెలుసుకోవాలంటే కోవిన్ వెబ్సైట్లో ఫైండ్ యువర్ నీయరెస్ట్ వాక్సినేషన్ సెంటర్ శీర్షికన మీ పిన్ కోడ్ నెంబర్ ఇస్తే మీకు దగ్గరలో ఉన్న వాక్సినేషన్ సెంటర్ల చిరునామాలన్నీ ప్రత్యక్షమవుతాయి.
6. ఇప్పుడు మీ అపాయింట్మెంట్, వాక్సిన్ వేయించుకోవాల్సిన రోజు, సమయాన్ని షెడ్యూల్ చేయండి. అంటే స్లాట్ బుక్ చేసుకోవడమన్నమాట. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్.ఎం.ఎస్. ద్వారా మీ అపాయింట్మెంట్ సమయం కూడా వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది.
7. ఒక మొబైల్ నెంబర్‌ను నలుగురి రిజిస్ట్రేషన్ కోసం వినియోగించవచ్చు.
8. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తరువాత ఒకవేళ ఆ సమయానికి మీరు వెళ్లలేని పరిస్థితి ఉంటే, అపాయింట్మెంట్ను రీషెడ్యూలు చేసుకోవచ్చు. అంతేకాదు.. అపాయింట్మెంట్ కాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
9. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే.. మొదటి డోస్ తీసుకున్న కేంద్రంలోనే రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
10. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి చేసుకున్న అనంతరం మీకు ఒక రెఫరెన్స్ ఐడీ వస్తుంది. దీని ఆధారంగా మీరు కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ పొందవచ్చు.
కోవిడ్ వాక్సిన్ పొందే సమయం
– టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్ ఇస్తారు. పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో 24 గంటలపాటు వాక్సినేషన్ తెరిచి ఉంచుతున్నారు.
– మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది. కోవాక్సిన్ అయితే మొదటి డోసు అనంతరం 4 నుంచి 6 వారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ అయితే 4 నుంచి 8 వారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ వాక్సిన్ను 6 నుంచి 8 వారాల్లో తీసుకుంటే మెరుగ్గా పనిచేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
– రెండో డోస్ వాక్సీన్ కోసం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. నేరుగా వెళితే పొందడానికి వీలుండదు.
– రెండో డోసు తీసుకోవడం ద్వారా కోవిడ్ టీకా పొందినట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
వాక్సిన్‌పై మరింత సమాచారం కోసం..
– కోవిడ్ వాక్సినేషన్‌కు సంబంధించి, కోవిన్ పోర్టల్‌కు సంబంధించి ఏదైనా సమాచారం కోసం 1075 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
– వాక్సీన్ తీసుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలి. 1075 లేదా +91 11 23978046 నెంబర్‌కు ఫోన్ చేయాలి. లేదంటే వాక్సినేషన్ చేయించుకున్న కేంద్రాన్ని సంప్రదించాలి.