ఈ వేసవిలో తిరుమల తిరుపతికి వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ నడుపనుంది. వేసవిలో తిరుమల తిరుపతి దర్శనానికి రోజూ లక్ష మంది వరకు భక్తులు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని సౌత్‌సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
కాచిగూడ – సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపింది. కావున వేసవిలో తిరుపతి వెళ్లే భక్తులు ఈ స్పెషల్ ట్రైన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీసులు ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అలాగే సికింద్రాబాద్ నర్సాపూర్ మధ్య కూడా స్పెషల్ ట్రైన్స్ నడుపనున్నట్టు తెలిపింది.
ఏప్రిల్ నెలలో 11,18, 25 తేదీలు, మే నెల 2వ తేదీన కాచిగూడ-తిరుపతి (ట్రైన్ నెంబర్ 07653) రైలు భక్తులకు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, గద్వాల, వనపర్తి రోడ్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.
ఇక ఏప్రిల్ 13, 20, 27 తేదీలలో సికింద్రాబాద్-నర్సాపూర్(ట్రైన్ నెంబర్ 07170), ఏప్రిల్ 14, 21, 28 తేదీలలో నర్సాపూర్-సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 07169) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.