Cauliflower Pickle recipe: కాలీఫ్లవర్‌తో పెట్టే నిల్వ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. కాలీఫ్లవర్ అవకాయ పచ్చడి రెసిపీ చేయడం చాలా సులువు. కాలీఫ్లవర్‌తో ఎప్పుడూ కూరలే కాదుగా అప్పడప్పుడు ఇలా పచ్చడి చేస్తేనే కదా.. దాని రుచేంటో తెలిసేది. మీ కోసం ఈ రెసిపీని అందిస్తున్నాం. ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో కమ్మగా ఉంటుంది. కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి రెసిపీ తయారీ విధానం ఇక్కడ చూసేయండి.
కాలీఫ్లవర్ నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు:
- కాలీఫ్లవర్ – మూడు
- ఆవాలు – ఒక టేబుల్ స్పూన్
- మెంతులు – ఒక టేబుల్ స్సూన్
- వెల్లులి రెబ్బలు – పది రెబ్బలు
- కారం – పావు కప్పు
- వేరుశెనగ నూనె లేదా ఆవనూనె – అర కప్పు
- ఉప్పు – రెండు స్సూన్లు
- నిమ్మరసం – రెండు స్సూన్లు
కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి తయారీ విధానం
- ముందుగా కాలీఫ్లవర్‌ను మీడియం సైజు ముక్కలుగా తీసుకుని ఒక గిన్నె నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి నీటిని వడగట్టి 3 గంటల పాటు ఎండలో ఆరనివ్వండి.
- ఇప్పుడు ఆవాలు, మెంతులను దోరగా వేయించి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
- వెడల్పాటి పాన్‌లో కావలసిన మొత్తంలో నూనెను వేడి చేసి, అందులో ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి, మీడియం నుంచి అధిక మంటపై 2 నుండి 3 నిమిషాలు వేయించాలి. దోరగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఆపై వేయించిన కాలీఫ్లవర్ ముక్కలలో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతి పొడిని వేయాలి.
- ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, వేసి మళ్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత పావు కప్పు నూనెను వేడి చేసి చల్లారిన తర్వాత ఆ మిశ్రమంలో వేయాలి. అందులోనే నిమ్మరసం కూడా కలుపుకోవాలి.
- అంతే కాలీఫ్లవర్ అవకాయ రెడీ. ఈ పచ్చడిని రెండు రోజులు ఊరబెట్టిన తర్వాత తింటే భలే మజాగా ఉంటుంది. కమ్మని విందుభోజనం తిన్నట్టే ఉంటుంది. అంతేకాదు ఇది నెలరోజుల వరకూ కూడా తాజాగా ఉంటుంది. ఇంత సులువుగా చేసుకునే పచ్చడిని మీరూ కూడా ట్రై చేసేయండి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్