టిక్‌టాక్, హెల్, న్యూస్‌డాగ్, యూసీ బ్రౌజర్ వంటి ప్రముఖ యాప్‌లతో సహా మొత్తం 59 చైనా యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేధించింది. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత కోసం ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69 ఎ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు– 2009ల పరిధిలో భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా 59 యాప్‌లను నిషేధించినట్టు ప్రకటించింది.
ఈ యాప్‌లు దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశం రక్షణ, ప్రజా భద్రతకు సంబంధించి హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందని కూడా ప్రకటించింది. డేటా భద్రత, గోప్యతలకు సంబంధించి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందినట్టు తెలిపింది.
బ్యాన్ చేసిన 59 చైనా యాప్స్ జాబితా ఇదే..
1. టిక్‌టాక్
2. షేర్‌ఇట్
3. కేడబ్ల్యూఏఐ
4. యూసీ బ్రౌజర్
5. బైదూ మ్యాప్
6. షెయిన్
7. క్లాష్ ఆఫ్ కింగ్స్
8. డీయూ బాటరీ సేవర్
9. హెలో
10. లైకీ
11. యూకెన్ మేకప్
12. ఎంఐ కమ్యూనిటీ
13. సీఎం బ్రౌజర్
14. వైరస్ క్లీనర్
15. ఆపస్ బ్రౌజర్
16. ఆర్వోఎండబ్ల్యూఈ
17. క్లబ్ ఫ్యాక్టరీ
18. న్యూస్ డాగ్
19. బ్యూటీ ప్లస్
20. వీచాట్
21. యూసీ న్యూస్
22. క్యూక్యూమెయిల్
23. డబ్ల్యూఈఐబీవో
24. ఎక్స్‌ఈఎన్డీఈఆర్
25. క్యూక్యూ మ్యూజిక్
26. క్యూక్యూ న్యూస్‌ఫీడ్
27. బీగోలైవ్
28. సెల్ఫీ సిటీ
29. మెయిల్ మాస్టర్
30. పారలల్ స్పేస్
31. ఎంఐ వీడియో కాల్– షియోమీ
32. వీసింక్
33. ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్
34. వీవా వీడియో – క్యూయూ వీడియో ఐఎన్‌సీ
35. ఎంఈఐటీయూ
36. వైగో వీడియో
37. న్యూ వీడియో స్టేటస్
38. డీయూ రికార్డర్
39. వాల్ట్ – హైడ్
40. క్యాచె క్లీనర్– డీయూ యాప్ స్టూడియో
41. డీయూ క్లీనర్
42. డీయూ బ్రౌజర్
43. హాగో ప్లే విత్ న్యూఫ్రెండ్స్
44. కామ్‌స్కానర్
45. క్లీన్ మాస్టర్ – చీతా మొబైల్
46. వండర్ కెమెరా
47. ఫొటో వండర్
48. క్యూక్యూ ప్లేయర్
49. వీ మీట్
50. స్వీట్ సెల్ఫీ
51. బైదూ ట్రాన్స్‌లేట్
52. వీ మేట్
53. క్యూక్యూ ఇంటర్నేషనల్
54. క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్
55. క్యూక్యూ లాంచర్
56. యూ వీడియో
57. వీ ఫ్లై స్టేటస్ వీడియో
58. మొబైల్ లెజెండ్స్
59. డీయూ ప్రయివసీ