Clean Makeup Brushes : తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి చాలా మంది మేకప్ వేసుకుంటారు. అయితే మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారో.. మేకప్ వేసుకోవడానికి వినియోగించే బ్రష్‌లను కూడా శుభ్రం చేసుకోవాలంటున్నారు నిపుణులు.
రోజు రోజుకి మేకప్ వినియోగించేవారి సంఖ్య పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఆడ, మగ తేడా లేకుండా మేకప్ వేసుకుంటున్నారు. నలుగురిలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే మేకప్ వేసుకునే సమయంలో ముఖంపై ఎంత శ్రద్ధ తీసుకుంటామో.. మేకప్ వేసుకోవడానికి వినియోగించే బ్రష్‌లపై కూడా అంతే శ్రద్ధ చూపించాలంటున్నారు.
ఓ మేకప్ బ్రష్ మీద బ్రాతూంలో ఉండేంత బ్యాక్టీరియా ఉంటుందట. కాబట్టి మనం వినియోగించే మేకప్ బ్రష్‌లపై కచ్చితంగా కేర్ తీసుకోవాలి. లేదంటే మీరు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చర్మ సమస్యలు తప్పవు. మీరు తరచుగా మేకప్ బ్రష్‌లు వినియోగించేవారైతే.. కచ్చితంగా వాటిని తరచుగా శుభ్రం చేసుకోవాలి. డర్టీ మేకప్ బ్రష్‌లు అనేక బ్యాక్టీరియాలు, సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. అవి మొటిమల నుంచి చర్మ ఇన్ఫ్క్షన్ల వరకు కారణమవుతాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మేకప్ బ్రష్‌లను ఎలా శుభ్రం చేయాలి? ఎప్పుడు శుభ్రం చేయాలి వంటి విషయాలపై అవగాహన ఉండడం చాలా ముఖ్యం. ప్రతి వినియోగం తర్వాత మేకప్ బ్రష్‌ను కడగడం లేదా శుభ్రం చేయడం కష్టమే. కాబట్టి కనీసం వారానికోసారి మేకప్ బ్రష్‌లను కడగాలి. మీరు ఎక్కువ క్రీమ్, ద్రవ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటే మీరు ప్రతి వినియోగం తర్వాత వాటిని టిష్యు వైప్స్‌తో తుడిచివేయండి. ముఖ్యంగా మీ స్నేహితులు లేదా మీ కుటుంబ సభ్యులతో మీ మేకప్ బ్రష్‌లను షేర్ చేసుకోకండి.
బ్రష్‌లను ఎలా కడగాలి?
మీ దగ్గర బ్లష్ క్లీనర్స్ ఉంటే మంచిదే. లేదంటే బేబీ సోప్ లేదా షాంపూలను మీరు మేకప్ బ్రష్‌లను క్లీన్ చేయడానికి వినియోగంచవచ్చు. ఇవే వాటిని శుభ్రం చేయడంలో బాగా పనిచేస్తాయి. వీలైతే బ్రష్ క్లీనింగ్ మ్యాట్ తీసుకోండి. ఇది కూడా మీ మేకప్ బ్రష్‌పై బ్యాక్టీరియాను తొలిగిస్తాయి.
మీ బ్రష్‌లను మగ్‌లో లేదా గ్లాస్లో పెట్టి నానబెట్టకూడదు. అలా చేస్తే అది బ్రష్‌కు ముళ్లను పట్టుకునే జిగురు వదిలి.. బ్రష్ నుంచి విడిపోతాయి. కాబట్టి మేకప్ వదిలించుకోవడానికి బ్రష్‌పై నీటిని వేసి కడగండి. మీ వేళ్లను ఉపయోగించి.. సున్నితంగా బ్రష్‌ను కడిగి పిండండి. మేకప్ బ్రష్‌లను బాగా శుభ్రం చేసిన తర్వాత మీరు వాటిని టవల్ లేదా ట్రేలో ఉంచి.. శుభ్రమైన, పొడి ప్రదేశంలో ఎండబెట్టాలి. మీ గదిలోకి ఎక్కువ దుమ్ము వచ్చే అవకాశం ఉంది అనుకుంటే.. మీ బ్రష్‌లను బ్రష్ హోల్డర్స్‌లో కాకుండా వార్డ్ రోబ్‌లో ఉంచి.. సందర్భానుసారంగా బయటకు తీసి వినియోగించుకోవచ్చు.