Chicken Liver: చికెన్‌ లివర్‌తో హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయా?

chicken liver

Chicken Liver health benefits: చికెన్‌ లివర్‌ ఐరన్, ఫొలేట్, ప్రొటీన్, విటమిన్‌ బి 12 వంటి పోషకాల గని. కానీ చాలా మందికి దీని టెస్ట్‌ నచ్చదు. వెయిట్‌ లాస్‌ కోసం ప్రయత్నించేవాళ్లు తినకపోవడం సమర్థనీయమే కానీ, ఇతరులు దీనిని చిన్నచూపు చూడాల్సిన పనిలేదు.

చూడ్డానికి ఇది భిన్నంగా ఉన్నా, సరిగ్గా వండితే దాని టేస్టే వేరు. ధర కూడా తక్కువే. వండడం చాలా తేలిక కూడా. విటమిన్స్, మినరల్స్‌తో కూడిన చికెన్‌ లివర్‌ను ఇష్టంగా తినడం ప్రారంభిస్తే మీ శరీరానికి మీరు మేలు చేసినట్టే.

చికెన్‌ లివర్‌లో ఎలాంటి పోషకాలు ఉంటాయి?

చికెన్‌ లివర్‌లో ఐరన్, ఫొలేట్, విటమిన్‌ బి 12, విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ, నియాసిన్, రైబో కాపర్, కొలైన్‌ వంటి పోషకాలు ఉంటాయి. చికెన్‌ లివర్‌లో ప్రొటీన్‌ బాగానే ఉంటుంది. అయితే చికెన్‌ లివర్‌ను బాగా ఫ్రై చేయకుండా మామూలుగా ఉడికించి తింటే కేలరీస్‌ తక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతామన్న భయమూ ఉండదు.

రక్త హీనత నుంచి కాపాడుతుంది..

ఎర్ర రక్త కణాలు శరీరంలో ఆక్సిజన్‌ మోసుకెళ్లేందుకు ఐరన్, ఇతర పోషకాలు అవసరం. ఎర్ర రక్తకణాలు లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల ఆక్సిజన్‌ తగ్గి శరీరంలో నిస్తత్తువ ఆవరిస్తుంది.

చికెన్‌ లివర్‌లో ఉండే ఐరన్, ఇతర పోషకాలు విటమిన్‌ బి 12 లోపం లేకుండా కాపాడుతాయి. రక్తం ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేందుకు చికెన్‌ లివర్‌లో దొరికే బి 12 దోహదం చేస్తుంది.

ఇక గుండె జబ్బులపై పోరాడే సెలీనియం అనే మినరల్‌ ఈ చికెన్‌ లివర్‌లో ఉంటుంది. అధిక కొలెస్టరాల్‌ స్థాయిలను కూడా ఇది అదుపు చేస్తుంది.

చికెన్‌ లివర్‌లో ఉండే విటమిన్‌ ఏ కంటి చూపును కాపాడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మూత్ర పిండాలు, గుండె సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.

ఇక బి2, రైబోఫ్లావిన్‌ శరీరం శక్తిని తయారుచేసుకునేందుకు ఉపయోగపడుతాయి.

అయితే చికెన్‌ లివర్‌లో ఉండే విటమిన్‌ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో తినకపోవడం మంచిది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఈ కాలంలో బాయిలర్ కోళ్లు బరువు పెరగడానికి రకరకాలా హార్మోన్లు, ఇంజెక్షన్లు ఇస్తున్నందున వీలైతే నాటు కోడి లివర్ తీసుకోవడం మంచిది. చికెన్ లివర్ అంటే పెద్దగా ఇష్టపడని వాళ్లు నేరుగా చికెన్ లివర్ కొనుగోలు చేయకుండా, చికెన్‌లో భాగంగా వచ్చే చికెన్ లివర్‌ను అవాయిడ్ చేయకుండా నెమ్మదిగా అలవాటు చేసుకోండి. ఆ తరువాత నేరుగా చికెన్ లివర్ కొనుగోలు చేసుకుని ఫ్రై చేసి తినడం అలవాటు చేసుకోవచ్చు.

Previous articleThe Coalition Years 1996-2012 : ప్రణబ్ ముఖర్జీ అక్షరీకరణ
Next articleకోవిడ్‌ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌‌లో 10 ముఖ్యమైన పాయింట్లు