కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు భారత దేశంలో ప్రతి లక్షకు కేవలం 7.6 మాత్రమే. అదే ప్రపంచంలో ప్రతి లక్షకు 62.3 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇండియాలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి రేటు కూడా 39.6 శాతానికి పెరిగింది.
వివిధ స్థాయిలలో ముందస్తు సానుకూల చర్యల ద్వారా భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలసి కోవిడ్ -19 వ్యాధి నిరోధం, వ్యాప్తిని అరికట్టడం, నిర్వహణకు పలు చర్యలు తీసుకుంటున్నది. వీటిని ఉన్నత స్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.
కోవిడ్ -19 వ్యాప్తి వేగం ఇతర దేశాలతో పోల్చినపుడు ఇండియాలో తగ్గుముఖం పడుతున్నది. దీని ప్రభావాన్ని కోవిడ్ -19 కేసుల గణాంకాలలో గమనించవచ్చు. అతర్జాతీయ స్థాయిలో డాటాను పరిశీలించినపుడు అక్కడ ప్రతి లక్షకు 62.3 కేసులు ఉండగా, ఇండియాలో ఇప్పటికీ లక్షకు కేవలం 7.9 కేసులు మాత్రమే ఉన్నాయి.
అలాగే మరణాల రేటు ప్రతి లక్ష జనాభాకు అంతర్జాతీయ సగటు రేటు 4.2 కాగా, భారతదేశంలో ఇది 0.2 మాత్రమే. ప్రపంచ స్థాయిలో మరణాల సంఖ్యను, భారత్ లో మరణాల సంఖ్యను గమనించినపుడు సత్వరం కేసుల గుర్తింపు, ఆయా కేసులకు సక్రమంగా అందున్న చికిత్సను సూచిస్తున్నాయి.
చికిత్సపై దృష్టిపెట్టడం, రికవరీపై దృష్టి పెట్టడం వల్ల రికవరీ రేటు పెరగడానికి దారి తీసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 39.6 శాతానికి పైగా నిర్ధారిత కేసుల వారు వ్యాది నయమై ఇంటికి వెళ్ళారు. దీనితో దేశంలో కోలుకున్నవారి సంఖ్య ఈ రోజుకు 45,300కి చేరింది.
వ్యాధినుంచి కోలుకున్న వారి గణాంకాలను గమనిస్తే 2.9 శాతం మంది యాక్టివ్ కేసులకు సంబంధించిన వారు. వీరికి ఆక్సిజన్ మద్దతు అవసరం. చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసులలో 3 శాతానికి ఐసియు సౌకర్యం అవసరం. చురుకుగా ఉన్న కేసులలో 0.45 శాతానికి వెంటిలేటర్ సదుపాయం అవసరం.
డబ్ల్యూహెచ్వో వివరాల ప్రకారం ప్రతి లక్ష మందికి ఏ దేశంలో ఎన్ని కేసులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ఇటీవలి విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఏదేశంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో చూద్దాం. ప్రపంచంలో పది లక్ష జనాభాకు 62.3 మందికి కరోనా వైరస్ సోకింది.
అలాగే ప్రతి లక్ష జనాభాకు అమెరికా (431), రష్యా (195), యుకె (361), స్పెయిన్ (494), ఇటలీ (372), బ్రెజిల్ (104), జర్మనీ (210), టర్కీ (180), ఫ్రాన్స్ (209), ఇరాన్ (145), ఇండియా (7.9) మందికి కరోనా వైరస్ సోకింది.