కరోనా వైరస్ ‌పై తొలి సినిమాః లాక్‌డౌన్‌లోనే షూటింగ్‌ చేసిన వర్మ

corona trailer

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. లాక్‌డౌన్‌ కాలంలోనే ‘కరోనా వైరస్‌’ పేరుతో తెలుగు సినిమా నిర్మించారు. ఆగస్త్య మంజు దర్శకత్వంలో లాక్‌డౌన్‌ కాలంలోనే తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం సాయంత్రం తన యూట్యూబ్‌ ఛానల్‌ ఆర్జీవీలో రిలీజ్‌చేశారు.

4.06 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం భయపెట్టేలా ఉంది. ఈ సినిమాపై రాంగోపాల్‌ వర్మ ఓ ట్వీట్‌ చేశారు. ‘మా పనిని ఆ దేవుడితోపాటు కరోనా కూడా ఆపలేదని నిరూపించాలనుకున్నాం. ప్రపంచంలోనే కరోనా వైరస్‌పై తీసిన తొలి సినిమా ఇదే. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సృజనను ఆవిష్కరించారు. లాక్‌డౌన్‌లో మా వాళ్లు లాక్‌డౌన్‌ కాలేదు..’ అంటూ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ దేశంలో ప్రవేశించిన తొలి నాళ్లలో మన భయాందోళనలు ఎలా ఉండేవో ఈ ట్రైలర్‌లో ప్రతిబింబించాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటించగా డీఎస్సార్‌ సంగీతం అందించారు.

 

Previous articleపవన్‌ కళ్యాణ్‌ బలగం బండి సంజయ్‌కు బలమవుతుందా?
Next articleఈ 4 స్ట్రెస్‌ లక్షణాలు.. ఏ వ్యాధులకు దారితీస్తాయి?