హెల్త్‌ చెక్‌ అప్‌ .. మహిళలకు ఏ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి

health check up for women
Photo by bruce mars from Pexels

గాళ్లు తరచుగా హెల్త్‌ చెక్‌ అప్‌ ( health check up ) చేయించుకోవడం చూస్తుంటాం. మహిళల విషయానికి వచ్చే సరికి వారికీ అంతగా హెల్త్‌ చెక్‌ అప్‌ చేయించుకోవాలన్న ఉత్సాహం ఉండదు. అలాగే భాగస్వాములు కూడా వారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయించేందుకు ఆసక్తి చూపరు. కానీ కాలం మారుతోంది. మహిళలు గృహిణిగా ఉన్నా.. ఉద్యోగం చేస్తున్నా తప్పనిసరిగా హెల్త్‌ చెక్‌ అప్‌ చేయించుకోవాలి.

మహిళలు ఎలాంటి టెస్ట్‌ చేయించుకోవాలో చెబుతూ యూఎస్‌ ప్రివెంటివ్‌ సర్వీసెస్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఒక నివేదిక ద్వారా పలు సిఫారసులు చేసింది. వాటిపై డియర్‌ అర్బన్‌ డాట్‌ కామ్‌ ప్రత్యేక కథనం అందిస్తోంది. బ్లడ్‌ ప్రెజర్, డయాబెటీస్, లిపిడ్‌ ప్రొఫైల్‌ వంటి టెస్టులు అతి తక్కువ ఖర్చుతో చేయించుకోవచ్చు. కింద సూచించిన పరీక్షలే కాకుండా థైరాయిడ్, ఎనీమియా, కిడ్నీ పానెల్‌ వంటి పరీక్షలు కూడా మహిళల ఆరోగ్య పరీక్షల్లో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

బ్లడ్‌ ప్రెజర్‌

తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల్లో ఇదొకటి. నార్మల్‌ రేంజ్‌ (120/80) ఉన్న వాళ్లు రెండేళ్లకోసారి, కాస్త ఎక్కువ తక్కువగా ఉన్న వాళ్లు కనీసం ఏడాదికోసారి ఈ పరీక్ష చేయించుకోవడం మేలు.

డయాబెటీస్‌ స్క్రీనింగ్‌

మీ బ్లడ్‌ ప్రెజర్‌ 135/80 కంటే అధికంగా ఉన్నా, లేక బీపీకి మందులు వాడుతున్నా ఈ పరీక్ష చేయించుకోవాలి.

లిపిడ్‌ ప్రొఫైల్‌

కొలెస్టరాల్‌ టెస్టులు ఇవి. టోటల్‌ కొలెస్టరాల్, ఎల్డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరిడ్స్‌ వంటి పరీక్షలు ఈ ప్రొఫైల్‌ లో ఉంటాయి.

బోన్‌ డెన్సిటీ

ఎముకల సాంధ్రత పరీక్ష ఇది. మారుతున్న కాలంలో మనం తింటున్న ఆహారం, జీవనశైలి వల్ల ఎముకలు పెళుసుగా మారుతున్నాయి. అందువల్ల 40 ఏళ్లు దాటగానే ఈ పరీక్ష ఓ సారి చేయించుకోవడం మేలు. ఫలితాల్లో తేడా ఉంటే డాక్టర్‌ సలహాను బట్టి మరోసారి చేయించుకోవాలి.

సర్వైకల్‌ కాన్సర్‌

21–65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు ప్రతి మూడేళ్లకోసారి పాప్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. 30 ఏళ్ల వయస్సు తరువాత ప్రతి ఐదేళ్లకోసారి హెచ్‌పీవీ టెస్ట్‌ చేయించుకోవాలని కూడా వైద్యులు సలహా ఇస్తారు. సర్వైకల్ కాన్సర్ ను తెలుగులో గర్భాశయ కాన్సర్ అని పిలుస్తారు. గర్భాశయ ముఖద్వారం అయిన సర్విక్స్ వద్ద కాన్సర్ కణాలు పెరగడం వల్ల ఈ కాన్సర్ వస్తుంది.

బ్రెస్ట్‌ కాన్సర్‌

50 నుంచి 74 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు ప్రతి రెండేళ్లకోసారి మమ్మోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. బ్రెస్ట్ కాన్సర్ నే తెలుగులో రొమ్ము కాన్సర్ అని పిలుస్తారు. రొమ్ము కాన్సర్ సోకి తిరిగి మామూలు జీవితం గడుపుతున్న మహిళల ఉదంతాలు అనేకం చూశాం.

కొలొరెక్టల్‌ కాన్సర్‌

50 నుంచి 75 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు కొలొరెక్టల్‌ కాన్సర్‌ పరీక్ష చేయించుకోవాలి. మలద్వారం, పేగుకు ఏర్పడే కాన్సర్ ను కొలొరెక్టల్ కాన్సర్ గా పిలుస్తారు.

ప్రత్యేక రోజుల్లో హెల్త్ చెక్ అప్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం, లేదా ఇతర ప్రత్యేక రోజుల్లో అనేక ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సర్వీసు కేంద్రాలు తక్కువ రుసుముతో మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తాయి. ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రివెంటివ్ హెల్త్‌ చెకప్‌లకు ఆదాయ పన్ను రాయితీ కూడా పొందవచ్చు. ఈరోజుల్లో డయాగ్నస్టిక్ సర్వీస్ సెంటర్లు ఇంటికే వచ్చి రక్త నమూనా సేకరించి తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఉంది. అందువల్ల చిన్న చిన్న పరీక్షలు నిర్లక్ష్యం చేయకుండా చేయించుకోవడం మేలు.

ఇవి కూడా చదవండి

Previous articleఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు అందిస్తున్న కాలేజీల జాబితా
Next articlenainital tour: నైనిటాల్‌ టూర్ .. ఆహ్లాదం.. ఆధ్యాత్మికం