Heat Stroke: వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు.. ఉపశమన చ‌ర్యలు

heat, summer, excursion
వడదెబ్బ రాకుండా జాగ్రత్తలు తెలుసుకోండి Photo by vargazs on Pixabay

Heat Stroke: మండే ఎండ‌ల‌కు ప్ర‌జ‌లు వడదెబ్బ బారిన పడుతున్నారు. వేడి గాలుల‌కు వ‌డ‌దెబ్బ త‌గిలే ప్రమాదం ఉన్నందున ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలో ఇక్క‌డ తెలుసుకోండి. ఎండ‌లో ప‌నిచేయ‌డం వల్ల శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోయి నీర‌సం, కళ్లు తిర‌గ‌డం, అలాగే డీహైడ్రేషన్‌కు లోనై నిస్సత్తువకు గురవుతుంటారు. 

ఇలాంటి సంద‌ర్భంలో ఎక్కువ‌గా నీరు, మ‌జ్జిగ‌, నిమ్మ‌ర‌సాలు, చ‌ల్ల‌ని ప‌ళ్ల ర‌సాలు తీసుకుంటే శరీరానికి ఎంతో ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించ‌వ‌చ్చు. వేసవిలో చిన్న‌పిల్ల‌ల‌కు, వృద్ధులకు గర్భిణులకు ఎక్కువ‌గా వ‌డ‌దెబ్బ తగిలే ప్ర‌మాదం ఉంటుంది. ఇటువంటప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాపాయం సంభవించవచ్చు.

వ‌డ‌దెబ్బ ల‌క్ష‌ణాలు:

  1. అల‌స‌ట‌కు గురికావ‌డం
  2. త‌ల‌నోప్పి రావ‌డం
  3. గుండె వేగంగా కొట్టుకోవ‌డం
  4. త‌ల‌తిరుగుతూ ఉండ‌డం
  5. వాంతులు
  6. అధిక‌మైన చెమ‌ట
  7. శ‌రీరం పొడిబార‌డం
  8. స్పృహ కోల్పోవ‌డం

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..

వేసవిలో సాధ్యమైనంత వరకు నీడపట్టున ఉండేలా చూసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. లేదంటే వడదెబ్బకు గురవుతారు. ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలో పటికబెల్లం కలిపి తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు కొంచెం కొంచెం సేవించాలి. వదులైన తెల్లని దుస్తులు ధరించాలి. తలపై టోపీ లేదా తలపాగా ధరించాలి. లేదా గొడుగు వెంట తీసుకెళ్లాలి. కళ్లకు చలువ అద్దాలు ధరించాలి. శీతల పానీయాల జోలికి వెళ్లొద్దు. నిమ్మరసం, మజ్జిగ, చెరకు రసం మేలు చేస్తాయి. మద్యానికి దూరంగా ఉండాలి.

వ‌డ‌దెబ్బ త‌గిలితే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి:

  1. వ‌డ‌డెబ్బ‌కి గుర‌యిన వ్యక్తిని వెంట‌నే నీడగా ఉండే చోటుకి తీసుకువెళ్లాలి.
  2. దుస్తుల‌ను కొంచెం వ‌దులు చేసి గాలి వ‌చ్చే విధంగా చూసుకోవాలి.
  3. బాధితుల చుట్టూ గుంపులుగా ఉండ‌కూడ‌దు.
  4. చ‌ల్ల‌ని నీటితో శ‌రీరాన్ని తుడ‌వాలి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleWashing machine cleaning tips: వాషింగ్ మెషిన్‌ శుభ్ర‌ప‌రిచే సులువైన చిట్కాలు..
Next articleHot Lemon Water: ఉద‌యాన్నే వేడినీరు, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతున్నారా! ఈ అద్భుత ప్ర‌యోజ‌నాలు పొందిన‌ట్లే