high cholesterol: హై కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో బాధ పడుతున్నారా? ఇలా తగ్గించుకోండి

high cholesterol
Image credit: Unsplash

high cholesterol: అధిక చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? దీనినే లో డెన్సిటీ లైపోప్రొటీన్(ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ అని అంటారు. చాలా వరకు ఈ పరిస్థితికి కారణం మీ లివరే. మీరు తినే ఫుడ్ కూడా కొంత కారణమవుతుంది. ఈ కొలెస్ట్రాల్ మీ ఆర్టరీల్లో పేరుకుపోతుంది. ఇక హై డెన్సిటీ లైపో ప్రోటీన్ (హెచ్‌డీఎల్) అంటే మంచి కొలెస్ట్రాల్ అని అర్థం. హెచ్‌డీఎల్ ఎల్‌డీఎల్‌ను మీ లివర్‌కు తీసుకెళుతుంది. అక్కడ లివర్ దానిని బయటకు పంపిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ఉంటే అది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

లిపిడ్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్ చేయిస్తే మన రక్తంలో హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తాయి. ఇదే టెస్టులో ట్రైగ్లైజరిడ్స్ స్థాయి కూడా తెలుస్తుంది. సాధారణంగా డయాబెటీస్, తదితర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి. డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్న వారు కనీసం ఏడాదికోసారి ఈ పరీక్షలు చేయించుకోవడం మేలు. ఒకవేళ ఫ్యామిలీలో ఈ కండిషన్ ఎవరికైనా ఉన్నా కూడా వారి సంతానం చెక్ చేయించుకోవడం మంచిది.

cholesterol test: ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ టెస్ట్ రిజల్ట్స్

100 మి.గ్రా./డెసిలీటర్ కంటే తక్కువగా ఉంటే నార్మల్‌గా ఉన్నట్టు లెక్క. 100 నుంచి 129 మి.గ్రా./డెసిలీటర్ ఉంటే నార్మల్ రేంజ్‌కు పైన ఉన్నట్టు లెక్క. 130-159 మి.గ్రా./డెసిలీటర్ ఉంటే బార్డర్‌లైన్ హై గా పరిగణిస్తారు. 160-189 మి.గ్రా./డెసిలీటర్ మధ్య ఉంటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. 190 మి.గ్రా./డెసిలీటర్, ఆ పైన ఉంటే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు లెక్క.

చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాల బారిన పడతారు. డయాబెటిస్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.

high cholesterol symptoms: చెడు కొలెస్ట్రాల్‌కు కారణాలు ఇవే..

అతిగా ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం, కొవ్వు పదార్థాలు తినడం, క్రమశిక్షణ లేని లైఫ్‌స్టైల్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు కారణమవుతుంది. ఇది క్రమంగా ఒబెసిటికి దారితీస్తుంది. అంతేకాదు. గుండె జబ్బులు, స్ట్రోక్స్‌కు కారణమవుతుంది. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అయితే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. వాటి ప్రభావం మన శరీర అవయవాలపై పడకుండా నివారించవచ్చు.

high cholesterol foods: చెడు కొలెస్ట్రాల్ నివారణకు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి?

శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న పదార్థాలు పూర్తిగా పక్కనపెట్టాలి. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే సింపుల్ కార్బొహైడ్రేట్లను మీ డైట్ నుంచి తప్పించాలి. తెల్లని పిండి పదార్థాల జోలికి వెళ్లొద్దు. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. గింజ ధాన్యాలను తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి. బరువు తగ్గుతున్న కొద్దీ మీ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అందువల్ల బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలి. 

స్మోక్ చేస్తున్నట్టయితే వెంటనే స్మోకింగ్ అలవాటు మానుకోవాలి. ఒకవేళ మీరు స్మోకింగ్ మానుకోలేని పక్షంలో వైద్యుల సహాయం తీసుకోవాలి. 

కొన్ని మందుల ద్వారా కూడా అధిక చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. వైద్యులు ఎక్కువగా స్టాటిన్స్ వంటి మందులను రాస్తారు. 

high cholesterol fruits: చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టే పండ్లు

కొన్ని రకాల పండ్లు ఈ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. అందువల్ల ఆయా పండ్లను మీ రోజూవారీ డైట్‌లో చేర్చుకుంటే మేలు. 

యాపిల్: 

యాపిల్ పండ్లలో ఉండే పెక్టిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పెక్టిన్ ఒక రకమైన ఫైబర్. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను క్రమపద్ధతిలో తగ్గిస్తుంది. యాపిల్స్‌లో ఉండే పాలీఫెనోల్స్ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

పియర్స్:

పియర్స్‌లో కూడా ఆపిల్స్‌లో ఉన్నట్టుగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడమే కాకుండా మీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

బెర్రీస్

బెర్రీ ఒక సీజనల్ ఫ్రూట్. ఫైబర్ కంటెంట్ విస్తృతంగా ఉంటుంది. మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను బెర్రీ పండ్లు తగ్గిస్తాయి. 

సంత్రా పండ్లు

ఆరేంజెస్ లేదా సంత్రా పండ్లు సిట్రస్ వర్గానికి చెందినవి. వీటిలో ఫైబర్ కంటెంట్ విరివిగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచుతూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అవకాడో

మన దేశంలో అంత ప్రాచుర్యం లేదు కానీ అవకాడో అనేక సుగుణాల మేలు కలయిక. ఇది మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. విదేశాల్లో అవకాడో టోస్టులు చాలా ఫేమస్ కూడా. ఈ పండ్లలో అధికస్తాయిలో ఫైబర్ ఉంటుంది. ఆర్టరీ బ్లాకేజ్‌ కాకుండా చూస్తుంది. 

Previous articleCommon ITR for all: అన్ని రకాల ఐటీ రిటర్నులకు కామన్ ఐటీఆర్
Next articleSUV new launches: త్వరలో 5 కొత్త ఎస్‌యూవీ కార్లు.. మారుతీ జిమ్నీ, హ్యుందాయ్ కాస్పర్ ఇంకా