Honda shine 100cc price hyderabad: హోండా షైన్ 100 సీసీ ధర, ఫీచర్లు ఇవే

shine 100 cc
హోండా షైన్ 100 సీసీ బైక్ (Image credit: Honda Motors)

honda shine 100cc price hyderabad: హోండా షైన్ 100 సీసీ ధర, ఫీచర్ల గురించి వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే. మే 15 నుంచి షోరూముల్లో ఈ బైకులు అందుబాటులోకి రానున్నాయి. చాలాకాలం తరువాత హోండా మోటార్స్ 100 సీసీ సెగ్మెంట్లోకి అడుగుపెడుతోంది. హోండా షైన్ 100 సీసీ ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.

హోండా షైన్ 100 సీసీ ఫీచర్స్ 

1. ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (పిజిఎం-ఎఫ్ఐ): సిస్టమ్ నిరంతరం ఇంజెక్ట్ చేయడానికి ఆన్‌బోర్డ్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఇది స్థిరమైన పవర్ అవుట్ పుట్, అధిక ఇంధన సామర్థ్యం ఇస్తుంది. ఉద్గారాలు తక్కువగా వెలువరిస్తుంది. ఈఎస్పీ (ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్) టెక్నాలజీతో పనిచేస్తుంది.

2. ఘర్షణ తగ్గింపు: పిస్టన్ కూలింగ్ జెట్ ఘర్షణను తగ్గిస్తుంది. ఆఫ్ సెట్ సిలెండర్, రాకర్ రోలర్ ఆర్మ్ యొక్క ఉపయోగం ఘర్షణ నష్టాన్ని మరింత తగ్గిస్తుంది. సజావుగా, మెరుగైన పవర్ అవుట్ పుట్‌కు సహాయపడటమే కాకుండా, ఇంధన సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

shine specifications
షైన్ 100 సీసీ బైక్ ఫీచర్స్ (Image credit: Honda Motors)

3. సోలెనాయిడ్ వాల్వ్: ఆటోమేటిక్ చోక్ సిస్టమ్‌గా పనిచేస్తూ రిచ్ ఎయిర్ ఫ్యూయల్ మిశ్రమాన్ని అందిస్తుంది. ఏ సమయంలోనైనా సరే వన్ టైమ్ స్టార్ట్ అయ్యే సౌలభ్యాన్ని అందిస్తుంది.

4. పొడవైన, సౌకర్యవంతమైన సీటు (677 మిమీ): రైడర్, పిలియన్ రైడింగ్ కోసం తగినంత స్థలాన్ని అందిస్తుంది. సౌకర్యవంతంగా సుదూర ప్రయాణాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. షైన్ 100 సీటింగ్ భంగిమ సాటిలేని సౌకర్యాన్ని అందిస్తుంది. అలసట లేని రోజువారీ ప్రయాణానికి ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. సౌకర్యవంతమైన రైడింగ్, లోడ్ క్యారీయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రైడింగ్ పొజిషన్ డిజైన్ చేశారు. ఆప్టిమమ్ సీట్ ఎత్తు (786 మిమీ)సగటు ఎత్తు భారతీయ రైడర్లకు సులభమైన గ్రౌండ్ టచ్‌ను అనుమతిస్తుంది. లాంగ్ స్ట్రోక్‌తో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సస్పెన్షన్ యూనిట్ ఎలాంటి రోడ్డు పరిస్థితులనైనా అధిగమిస్తుంది. కఠినమైన ఉపరితలంపై ప్రకంపనలను గ్రహించే సామర్థ్యం రైడర్‌కు అదనపు స్థిరత్వం, విశ్వాసాన్ని ఇస్తుంది. 

5. సైడ్ స్టాండ్ విత్ ఇంజిన్ ఇన్హిబిటర్: సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవడాన్ని నిరోధిస్తుంది. షైన్ 100 సీసీ బైక్ ప్రతి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది. 

6. తేలికపాటి బరువు మన్నికైన స్టీల్ ఫ్రేమ్: వాహన బరువు తక్కువగా ఉండడానికి దోహదం చేస్తుంది. విభిన్న రోడ్లపై ఈ కఠినమైన ఫ్రేమ్ అనువుగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నుతుంది. ఇరుకైన రోడ్లపై వాహనాన్ని హ్యాండిల్ చేయడం సులభం అవుతుంది. టర్నింగ్ రేడియస్ 1.9 మీటర్లు. ఇది ఈ సెగ్మెంట్ లో క్లాస్ లీడింగ్. 

7. లాంగ్ వీల్ బేస్ (1245 మిమీ): లాంగ్ వీల్ బేస్, హై గ్రౌండ్ క్లియరెన్స్ (168 మిమీ) బైక్‌ను స్థిరంగా ఉంచుతుంది. 

8. సొగసైన శైలి: షైన్ 125 నుండి ప్రేరణ పొందిన సుసంపన్నమైన డిజైన్ షైన్ 100. ఆకర్షణీయమైన ఫ్రంట్ కౌల్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ప్రాక్టికల్ అల్యూమినియం గ్రాబ్ రైల్, బోల్డ్ టెయిల్ ల్యాంప్, స్లీక్ డిఫరెంట్ మఫ్లర్ కాంప్లిమెంట్ మోటార్ సైకిల్‌కు సొగసైన శైలిని ఇస్తుంది.

9. విశ్వసనీయత: హోండా మోటార్స్ హోండా షైన్ 100 సీసీ బైక్‌పై ప్రత్యేక 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీని (3 సంవత్సరాల స్టాండర్డ్ + 3 ఇయర్స్ ఆప్షనల్) కూడా అందిస్తోంది. 

shine bike colors
5 రంగుల్లో షైన్ బైక్ (image: Hinda motors)

10. కలర్ ఆప్షన్స్: షైన్ 100 5 కలర్ ఆప్షన్లలో (బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ లభిస్తుంది. 

షైన్ 100 సీసీ బైక్ ధర హైదరాబాద్, ఇతర నగరాల్లో ఇలా

హోండా షైన్ 100 సీసీ బైక్ (హైదరాబాద్ ఎక్స్-షోరూమ్) ధర: రూ. 66,600గా ఉంది. 

హోండా షైన్ 100 సీసీ బైక్ (వరంగల్లు ఎక్స్-షోరూమ్) ధర: రూ. 66,600

కరీంనగర్ ఎక్స్-షోరూమ్ ధర: రూ. 66,600

విశాఖపట్నం ఎక్స్-షోరూమ్ ధర: రూ. 66,300

విజయవాడ ఎక్స్-షోరూమ్ ధర: రూ. 66,300

తిరుపతి ఎక్స్-షోరూమ్ ధర: రూ. 66,300

Previous articleనానబెట్టిన వాల్‌నట్స్ తింటే త్వరగా బరువు తగ్గుతారు.. మరో 6 ఉపయోగాలూ తెలుసుకోండి
Next articleBreakfast recipes with Oats: ఓట్స్‌తో 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు.. చేయడం చాలా సులువు