లాక్‌ డౌన్‌లో మినహాయింపులు వీటికే

lockdown

దేశంలో 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన అనంతరం లాక్‌ డౌన్‌ ఆంక్షలు, మినహాయింపులపై కేంద్ర హోం శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది.

1. లాక్‌ డౌన్‌ ఆంక్షలుః కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల కార్యాలయాలు, పబ్లిక్‌ కార్పొరేషన్‌ సంస్థలు

వేటికి మినహాయింపుః రక్షణ శాఖ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ట్రెజరీ, పబ్లిక్‌ యుటిలిటీస్‌(పెట్రోలియం, సీఎన్‌జీ, ఎల్పీజీ, పీఎన్‌జీ), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, పవర్‌ జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌ యూనిట్స్, పోస్ట్‌ ఆఫీసులు, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్, ముందస్తు హెచ్చరిక సంస్థలు

2. లాక్‌ డౌన్‌ ఆంక్షలుః రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు తెరుచుకోవు.

మినహాయింపు వేటికి మరిః ఎ) పోలీస్, హోం గార్డు, సివిల్‌ డిఫెన్స్, అగ్నిమాపక సేవలు, అత్యవసర సేవలు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, జైళ్ల శాఖ
బి) జిల్లా పరిపాలన కార్యాలయాలు, ట్రెజరీ
సి) విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య విభాగాలు
డి) పురపాలక సంస్థలు(అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది మాత్రమే)

3. ఆసుపత్రులు, వైద్య సంస్థలు, ఔషధ ఉత్పత్తులు, పంపిణీ సంస్థలు(పబ్లిక్, ప్రయివేటు), డిస్పెన్సరీలు, కెమిస్ట్‌(ఫార్మసీ), వైద్య పరికరాల షాపులు, వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబులు, క్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్స్, ఆంబులెన్స్‌ సేవలు కొనసాగుతాయి.

4. అన్ని వాణిజ్య, ప్రయివేటు ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ మూసి ఉంటాయి.
మినహాయింపు వర్తించేవిః
ఎ) రేషన్‌ షాపులు, ఫుడ్, కిరాణం, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా తదితర షాపులు తెరిచి ఉంటాయి. హోం డెలివరీని జిల్లా యంత్రాంగం ప్రోత్సహించడం ద్వారా ప్రజలు బయటకు రాకుండా చూడాలి.
బి) బ్యాంకులు, బీమా సంస్థలు, ఏటీఎంలు
సి) ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా
డి) టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్‌ సేవలు, బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారత సేవలు (సాధ్యమైనంత మేర ఇంటి నుంచి పనిచేయాలి)
ఇ) ఫుడ్, ఫార్మా, వైద్య పరికరాలు ఈ–కామర్స్‌ ద్వారా హోం డెలివరీ
ఎఫ్‌) పెట్రోల్‌ పంపులు, ఎల్పీజీ, పెట్రోలియం, గ్యాస్‌ రీటైల్, స్టోరేజ్‌ యూనిట్లు
జి) విద్యుదుత్పత్తి, పంపిణీ యూనిట్లు, వాటి సేవలు
హెచ్‌) సెబీ గుర్తింపు పొందిన కాపిటల్, డెట్‌ మార్కెట్‌ సేవలు
ఐ) కోల్డ్‌స్టోరేజ్‌ అండ్‌ వేర్‌హౌజింగ్‌ సేవలు
జె) ప్రయివేటు సెక్యూరిటీ సేవలు

5. పారిశ్రామిక సంస్థలు మూసి ఉంటాయి.
మినహాయింపు దేనికిః ఎ)అత్యవసర వస్తువుల తయారీ సంస్థలు బి) నిరంతరం ఉత్పత్తి చేయాల్సిన ఉత్పత్తి సంస్థలు(రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొనసాగించాలి)

6. రవాణా సేవల నిలిపివేతః విమానం, రైలు, రోడ్డు రవాణా ఉండదు.
మినహాయింపు దేనికిః ఎ) అత్యవసర వస్తువుల రవాణా బి) అగ్నిమాపక సేవలు, శాంతి భద్రతలు, ఇతర అత్యవసర రవాణా సేవలు

7. హాస్పిటాలిటీ (ఆతిథ్య) సేవలు ఉండవు
మినహాయింపు దేనికిః లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయిన వ్యక్తులు, పర్యాటకులు, వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవలు అందించే సిబ్బంది, విమానయాన సిబ్బంది, నౌకాయాన సిబ్బంది కోసం హోటళ్లు, లాడ్జీలకు మినహాయింపు

8. అన్ని విద్యా సంస్థలు, శిక్షణ, పరిశోధన, కోచింగ్‌ సంస్థలు మూసి వేయాలి

9. అన్ని ప్రార్థన మందిరాలు మూసివేయాలి.

10. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, అకడమిక్, సాంస్కృతిక, మత వేడుకలు, సమావేశాలపై నిషేధం

11. అంత్యక్రియల ఘటనల్లో 20 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదు.

12. ఫిబ్రవరి 15, 2020 తరువాత దేశంలోకి వచ్చిన వారంతా స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో లేదా సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాలి. ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు.

13. మినహాయింపులు ఇచ్చిన సంస్థలు, ఉద్యోగులు కరోనా వైరస్‌ ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి.

14. ఆంక్షలు అమలయ్యేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్‌ కమాండర్‌గా క్షేత్రస్థాయిలోకి పంపాలి. ఈ ఇన్సిడెంట్‌ కమాండర్సే ఆంక్షల అమలుకు బాధ్యులు.

15. ఆంక్షలన్నీ ప్రజల కదలికల నియంత్రణకే తప్ప అత్యవసర వస్తువుల రవాణాకు సంబంధించి కాదు.

16. ఆసుపత్రుల సేవలు కొనసాగడం, ఆసుపత్రుల విస్తరణ, అవసరమయ్యే సామగ్రి, మానవవనరులు లభ్యమయ్యేలా చూడాలి.

17. ఆంక్షలు ఉల్లంఘించిన వారు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద శిక్షార్హులు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద కూడా శిక్షార్హులు.

Previous article21 రోజుల పాటు దేశం లాక్‌ డౌన్‌: ప్రధాని సంచలన నిర్ణయం
Next articleఆల్కహాల్‌ విత్‌డ్రాయల్‌ సిండ్రోమ్‌: కౌన్సెలింగ్, చికిత్స