Natu Kodi Pulao Recipe: నాటుకోడి పులావ్ రుచి వేరే లెవెల్. నాటుకోడి కూరగా ఎంత రుచిగా ఉంటుందో పులావ్‌తో కూడా అంతకంటే రుచిని ఇస్తుంది. చాలామంది ఈ పులావ్ వండడం అంటే ఎక్కువ శ్రమ కలిగినదిగా భావిస్తారు. నిజానికి దీనిని తయారు చేయడం చాలా సులువు. కొద్ది సమయంలోనే ఈజీగా చేసేయెచ్చు. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
నాటుకోడి పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
- నాటుకోడి మాంసం – అర కిలో
- బాస్మతి బియ్యం – రెండు కప్పులు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- ఉల్లిపాయలు – పెద్దవి రెండు
- పచ్చిమిర్చి – నాలుగు
- టమాటో – రెండు
- కారం – రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు – తగినంత
- పసుపు – ఒక టీ స్పూన్
- దనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్
- గరం మసాలా – ఒక టేబుల్ స్సూన్
- బిర్యానీ మసాలా – ఒక టేబుల్ స్సూన్
- పెరుగు – పావు కప్పు
- కొత్తిమీర, పుదీనా – కొద్దిగా
- నూనె – రెండు స్సూన్లు , నెయ్యి – రెండు స్పూన్లు
- బిర్యానీ మసాలాలు: బిర్యానీ ఆకులు రెండు, యాలకులు – రెండు , నిమ్మరసం – తగినంత.
నాటు కోడి పులావ్ తయారీ విధానం
- ముందుగా బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడ స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల నూనె, రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కాగనివ్వాలి.
- అందులో చికెన్ బిర్యానీ మసాలాలు వేసి వేయించుకోవాలి.
- ఇలా వేయించుకున్న దానిలో ఉల్లిపాయలను సన్నగా పొడువుగా తురుముకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి.
- అవి కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేగనివ్వాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి.
- తర్వాత టమాటో ముక్కలను వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత పెరుగును కూడా వేసుకుని కలుపుకోవాలి.
- ఆపై చికెన్‌ను వేసుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని 20 నిమిషాలు పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దానిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఇలా కలుపుకున్న తర్వాత అందులో రెండు కప్పుల బిర్యానీకి మూడు గ్లాసుల నీటిని పోయాలి.
- ఆ నీరు బాగా మరిగిన తర్వాత అందులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకోవాలి. ఆపై మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. అంతే నాటుకోడి పులావ్ రెడీ. యమ్మీ యమ్మీగా స్పైసీగా తినేయచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్